సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకర ణ బిల్లులో తెలంగాణకు నష్టం కలిగించే అంశాలపై సవరణలు చేయాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు శుక్రవారం శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు లేఖ ఇవ్వనున్నారు. మొత్తం 9 అంశాలను గుర్తించిన నేతలు వాటికి ఏయే సవరణలు చేయాలో సూచనలు చేశారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి జానారెడ్డి చాంబర్లో సమావేశమైన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ మేరకు రూపొందించిన లేఖపై సంతకాలు చేశారు. హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా చేయాలనే క్లాజును తొలగించి సీమాంధ్రలో కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకునే వరకు లేదా మూడేళ్లపాటు తాత్కాలిక రాజధానిగా కొనసాగించాలని ఆ లేఖలో సూచించారు.
రాజధానిలో శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్‌కు అప్పగించే క్లాజును తొలగించాలని, రాజ్యాంగబద్ధంగా తెలంగాణ ప్రభుత్వానికే ఆ అధికారాలను అప్పగించాలని సూచించారు. తెలంగాణ, సీమాంధ్రలకు వేర్వేరుగా హైకోర్టులను ఏర్పాటు చేయాలని, ముల్కీ సర్టిఫికెట్లు పొంది ఉద్యోగాలు సంపాదించి రిటైర్డ్ అయిన సీమాంధ్ర ఉద్యోగులందరికీ సీమాంధ్ర ప్రభుత్వమే పెన్షన్లు చెల్లించేలా బిల్లును సవరించాలని కోరారు. పీపీఏ ఒప్పందాల మేరకు తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు విద్యుత్ కేటాయింపులు చేయాలని, వెటర్నరీ యూనివర్సిటీతోపాటు ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఐఐఎం విద్యా సంస్థను ఏర్పాటు చేయాలని అందులో పేర్కొన్నారు.
9 సూచనలను ప్రతిపాదించిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
Published Fri, Jan 10 2014 4:17 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement