
అసంబద్ధంగా తెలంగాణ బిల్లు: హరిబాబు
నెల్లూరు: తెలంగాణ ముసాయిదా బిల్లులో సీమాంధ్ర అభివృద్ధి అంశాలు లేవని బీజేపీ సీనియర్ నేత కంభంపాటి హరిబాబు అన్నారు. పూర్తి అసంబద్ధంగా తెలంగాణ బిల్లును రూపొందించారని ఆయన విమర్శించారు. పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపాలని సూచించారు. సీమాంధ్రకు న్యాయం జరగకుండా ఉంటే తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వొద్దని తమ అధిష్టానాన్ని కోరుతామని చెప్పారు.
విభజన బిల్లు సీమాంధ్రులకు అన్యాయం చేసేదిగా ఉందని అంతకుముందు హరిబాబు అన్నారు. పోలవరానికి న్యాయం జరగాలంటే కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం ప్రమేయం లేకుండా ప్రాజెక్టు డిజైన్ ఉండాలన్నారు. ఇంతవరకూ ఏ రెండు రాష్ట్రాలకు ఒకే ప్రాంతం ఉమ్మడి రాజధానిగా లేదన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత ఆయా పార్టీల అవసరాల మేరకు పొత్తు పెట్టుకుంటాయని స్పష్టం చేశారు.