మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్:
అసెంబ్లీలో తెలంగాణ చర్చ మొదలైందని, ప్రత్యేక పార్లమెంట్ సమావేశా ల్లో రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొం దుతుందని ప్రభుత్వ విప్, నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే అనిల్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అ తిథి గృహంలో ఆయన విలేకరులతో మా ట్లాడుతూ రాష్ట్రపతి పంపిన బిల్లును అ సెంబ్లీలో చర్చిస్తుంటే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అడ్డుకోవాలని చూడటం సరికాదని హితవు పలికారు. వారికి ని జంగా సీమాంధ్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాంతంలో విద్య, ఉద్యోగ, రా జధాని కో సం చర్చించాలని కోరారు.
తె లంగాణ ప్రజల 60ఏళ్ల ఆకాంక్షను గౌరవించకుండా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుండటం స మంజసం కాదన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు ఆగదని పేర్కొన్నారు. ఇచ్చినమాట ప్రకారం యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ రా ష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇ ప్పటికీ రెండుకళ్ల సిద్ధాంతం పాటిస్తున్న టీ డీపీ ఇరుప్రాంతాల్లో కనుమరుగు కావడం ఖాయమన్నారు. స్వార్థ పూరిత రాజకీయ పార్టీల ను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఆదరించర ని చెప్పారు. రాహుల్‌గాంధీ దేశంలోని యువతరానికి ఐకాన్‌గా మారారని పే ర్కొన్నారు. అవినీతిరహిత సమాజం కోసం యువత ఉద్యమించాలని కోరారు.
అనంతరం ఎన్‌ఎస్‌యూఐ రూపొందిం చిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించా రు. సమావేశంలో ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రె డ్డి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల ప్ర కాశ్, జిల్లా గ్రంథాల సంస్థ అధ్యక్షుడు పె ద్దిరెడ్డి సాయిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బ్రహ్మయ్య, జిల్లా అధికార ప్రతినిధి సీజే బెనహర్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షు డు దినేష్, ఉపాధ్యక్షుడు ఇమ్మడి వెం కటేష్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రక్రియ మొదలైంది ప్రభుత్వ విప్ అనిల్
Published Tue, Dec 24 2013 3:16 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM
Advertisement
Advertisement