MLA Anil
-
'పవన్ ఫ్యూచర్‌కే క్లారిటీ లేదు.. అభిమానులకు ఏం భరోసా ఇస్తారు'
నెల్లూరు: నెల్లూరులో పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే అనిల్ ఫైరయ్యారు. పవన్‌కి జై కొడుతూ పిల్ల సైనిక్స్ భవిష్యత్ పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ ఫ్యూచర్‌కే క్లారిటీ లేదు.. మీకు ఆయన ఏం భరోసా ఇస్తారని ప్రశ్నించారు. అభిమానం పేరుతో యువకుల జీవితాలను నాశనం చేస్తున్నారని పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగారు. మహిళ శక్తిపై టీడీపీ చేస్తున్న ప్రచారాలపై ఎమ్మెల్యే అనిల్ విమర్శలు గుప్పించారు. మహిళా శక్తి అంటూ తిరిగే టీడీపీ నేతలకు చిత్త శుద్ది లేదని విమర్శించారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటం, కత్తితో మహిళపై దాడి చెయ్యడమేనా మహిళా శక్తి అంటే..? అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: కేంద్రీయ విద్యాలయంలో వేధింపులు.. లైబ్రేరియన్‌పై పేరెంట్స్ దాడి -
గడప గడపకూ వెళ్తా
నెల్లూరు (సెంట్రల్): నియోజకవర్గంలో ఈ నెల 26 నుంచి ప్రజాదీవెన కార్యక్రమం చేపడుతున్నట్లు నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ యాదవ్ వెల్లడించారు. స్థానిక ఎంసీఎస్ కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం ముగింపు సభలో ఆయన మాట్లాడారు. ప్రజాదీవెనలో భాగంగా గడపగడపకూ వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటానని చెప్పారు. ఇటీవల చేపట్టిన వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం విజయవంతంగా సాగిందని, ఈ కార్యక్రమం ద్వారా 40 వేల కుటుంబాలకు చేరవయ్యామని వివరించారు. ప్రజాదీవెన కార్యక్రమంతో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటి మేయర్ ముక్కాల ద్వారకానాథ్, ప్లోర్‌లీడర్ పి.రూప్‌కుమార్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. -
భక్త జనసంద్రం
గొబ్బియాలో.. గొబ్బియాలో.. సంక్రాంతి పండగొచ్చే గొబ్బియాలో.. సంబరాలు తీసుకొచ్చే గొబ్బియాలో అంటూ మహిళల పాటలతో.. చిన్నారుల సరదా ఆటలతో పవిత్ర పినాకినీ నదీతీరంలో గొబ్బెమ్మ(గౌరమ్మ)ల పండగ సోమవారం వైభవంగా జరిగింది. సంస్కృతి, సంప్రదాయాలతో ముంగిళ్ల ముందు రంగవల్లులతో తీర్చిదిద్దిన గొబ్బెమ్మలను ఊరేగింపుగా తీసుకొచ్చి ‘ఏటిపండగ’ సందర్భంగా గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేశారు. జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన వేలాది మంది భక్తులతో పెన్నానదీ తీరం జనసంద్రంగా మారింది. నెల్లూరు(బృందావనం): బాలబాలికలు గాలిపటాలను ఎగురవేస్తూ, యువతీయువకుల కేరింతల కొడుతూ, మహిళల కోలాటాలు, టగ్‌ఆఫ్‌వార్, తదితర ఆటపాటలతో రంగనాయకులపేటలోని పెన్నానదీతీరం హోరెత్తింది. భక్తులు వేలాదిగా తరలి రావడంతో జనసంద్రంగా మా రింది. నెల్లూరు పవిత్ర పెన్నానది తీరంలో ఏటా నిర్వహించే గొబ్బెమ్మల పండగ (ఏటిపండగ) సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కోలాహలంగా సాగింది. ధనుర్మాస ప్రారంభంలో తమ ఇళ్లలో ఉంచి పూజించిన గౌరమ్మలు(గొబ్బెమ్మ)లను భక్తిశ్రద్ధలు, దీపహారతులతో పెన్నానదిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఎమ్మెల్యే అనిల్ పర్యవేక్షణ విశేషంగా తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెల్లూరు సిటీఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ వివిధ శాఖల అధికారులను సమన్వయపరుస్తూ భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పర్యవేక్షించారు. ఐదురోజుల క్రితమే ఎమ్మెల్యే అనిల్ దేవాదాయ, ధర్మాదాయ, విద్యుత్తు, పోలీసు, కార్పొరేషన్ తదితర శాఖలకు చెందిన అధికారు లను సమన్వయపరుస్తూ పలు పర్యాయాలు ఏర్పాట్లను పరిశీలించారు. కొలువైన దేవతామూర్తులు గొబ్బెమ్మల పండగను పురస్కరించుకుని దేవాదాయ, ధర్మాదాయశాఖ సహాయ కమిషనర్ వేగూరు రవీంద్రరెడ్డి పర్యవేక్షణలో నగరంలోని, జిల్లాలోని వివిధ ఆలయాలకు చెందిన కార్యనిర్వహణాధికారుల పర్యవేక్షణలో శ్రీవిఘ్నేశ్వరుడు, నెల్లూరు గ్రామదేవత శ్రీఇరుకళల పరమేశ్వరి అమ్మవారు, శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీతల్పగిరి రంగనాథస్వామి, శ్రీద్రౌపది సమేత శ్రీకృష్ణధర్మరాజస్వామి, మూలా పేట శ్రీభువనేశ్వరి సమేత శ్రీమూలస్థానేశ్వరస్వామి, జొన్నవాడ శ్రీకామాక్షీతాయి, నర్రవాడ శ్రీవెంగమాంబ పేరంటాళు, శ్రీవేదగిరి లక్ష్మీనృసింహస్వామి, శ్రీమేలమరువత్తూర్ ఆదిపరాశక్తి అమ్మవారుతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన దేవతామూర్తులు కొలువుదీరారు. కొలువుదీరిన స్వామివార్లను వేలాదిగాభక్తులు దర్శించుకున్నారు. వీరికి ఆయా ఆలయాల కార్యనిర్వహణాధికారులు తీర్థప్రసాదాలు ఏర్పాటుచేశారు. జనసంద్రం పతంగులు ఎగురవేస్తూ చిన్నారులు, గొబ్బెమ్మలను నిమజ్జనం చేస్తూ మహిళలు, దేవతామూర్తులను దర్శిస్తూ భక్తులు.. ఆటపాటల్లో నిమగ్నమైన యువతీయువకులతో పవిత్ర పినాకినీ తీరం సోమవారం సాయం సంధ్యవేళ నుంచి జనసంద్రంగా మారింది. ఏటి పండగలో ప్రముఖులు నగరంలోని పెన్నానదితీరంలో నిర్వహించిన గొబ్బెమ్మల పండగలో రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ, నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరుసిటీ ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఫ్లోర్‌లీడర్ రూప్‌కుమార్‌యాదవ్, మేయర్ అబ్దుల్అజీజ్, మాజీ ఎమ్మె ల్యే ముంగమూరుశ్రీధరకృష్ణారెడ్డి, వివిధపార్టీలకు చెందిన కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధు లు పాల్గొన్నారు. సుఖసంతోషాలతో ఉండాలి : ఎంపీ మేకపాటి నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన దేవతామూర్తులను నెల్లూరు పెన్నానది తీరంలో సంక్రాంతి సందర్భంగా కొలువుదీరి భక్తులకు దర్శనభాగ్యం కల్పించడం సంతోషదాయకమన్నారు. ఆ దేవతామూర్తుల దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో జీవించాలన్నారు. సంప్రదాయ పండగ : నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ గొబ్బెమ్మల పండగ చక్కటి సంప్రదాయపండగని పేర్కొన్నారు. భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుని వేడుకున్నట్లు తెలిపారు. మహద్భాగ్యం : రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ సర్వదేవతలు నెల్లూరులో కొలువుదీరి ప్రజలకుదర్శనం కలిగించడం మహద్భాగ్యంగా పే ర్కొన్నారు. ప్రజలకు భగవంతుని ఆశీస్సులు లభించాలని కోరుకున్నారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి
నగర ఎమ్మెల్యే డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ నెల్లూరు రూరల్ : అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. స్థానిక బుజబుజనెల్లూరు వద్ద జాతీయ రహదారిపై అగ్రిగోల్డ్ బాధితులు తమకు న్యాయం చేయాలని శనివారం రాస్తారోకో చేశారు. నగర ఎమ్మెల్యే రాస్తారోకోలో పాల్గొని వారికి మద్దతిచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భవిష్యత్ అవసరాల కోసం ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలు రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్మును అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిట్ల రూపంలో సేకరించి తిరిగి చెల్లించకపోవడం బాధాకరమన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు న్యాయం చేయాలని అనేక రకాలుగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. అనేక మంది బాధితులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను అమ్మేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. బాధితులకు సీపీఎం రూరల్ నియోజకవర్గ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా కార్యదర్శి పార్థసారథి, రామరాజు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు మద్దతు పలికారు. -
ప్రజలందరికీ న్యాయం చేస్తాం
ఎమ్మెల్యే అనిల్ నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): సాలుచింతల ప్రాంతంలో పెన్నా బ్యారేజీ నిర్మాణ సమీపంలో నివసిస్తున్న ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అందరికీ న్యాయం జరుగుతుందని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్ భరోసా ఇచ్చారు. 53వ డివిజన్ సాలుచింతలలో గురువారం ఆయన పర్యటించారు. పెన్నా బ్యారేజీ నిర్మాణ పనుల వల్ల ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఖాళీ చేయాల్సి వస్తుందని అధికారులు చెప్పడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దాదాపు 50 ఏళ్ల నుంచి అక్కడ నివసిస్తున్న కుటుంబాల పరిస్థితులను కలెక్టర్‌కు వివరించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తామని తెలిపారు. బండ్ కాకుండా ప్రహరీని నిర్మిస్తే ఈ ప్రాంత వాసులు ఖాళీ చేయాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్ దేవరకొండ అశోక్, నాయకులు నాగభూషణం, జాకీర్, నాగరాజు, వెంకటేశ్వర్లు, జెస్సీ, శ్రీను, తదితరులు పాల్గొన్నారు. -
అర్ధరాత్రి నెల్లూరుకు..తెల్లవారుజామున హైదరాబాద్‌కు
మంత్రి నారాయణపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే అనిల్ నెల్లూరు(సెంట్రల్) : రాష్ట్ర మున్సిపల్ మంత్రి నారాయణ నగరానికి అర్ధరాత్రులు రావడం.. తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్‌కు వెళ్తూ ప్రజా సమస్యలను విస్మరిస్తున్నారని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కనీసం మంత్రి ఎప్పుడొస్తారో అధికారులు కూడా తెలియదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాలుగు నెలల క్రితం కార్పొరేషన్ సమావేశంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి నారాయణ సమక్షంలో రెండు నెలల్లో హడ్కో నిధులు వస్తాయని అగ్రిమెంట్ చేసుకున్నారని, అయితే ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడంలేదని విమర్శించారు. అసలు హడ్కో నిధులు వస్తాయో.. లేదో తెలపాలని డిమాండ్ చేశారు. నగరంలో చాలా చోట్ల రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, ఈ విషయమై కార్పొరేషన్ పాలకులను అడిగితే హడ్కో నిధులు వస్తాయంటూ మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. మంత్రి నారాయణ అర్ధరాత్రి పర్యటనలంటూ నాలుగు రోడ్లు తిరిగి వెళ్లిపోవడం తప్ప, చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. పగలు తిరిగితే సమస్యలపై నిలదీస్తారనే భయం నారాయణకు పట్టుకున్నట్లుందని ఎద్దేవా చేశారు. అధికారం చేపట్టి ఇన్ని నెలలైనా ఇంత వరకు నగరానికి రూ.10 లక్షల ఖర్చు పెట్టారానని ప్రశ్నించారు. నగరంలో తాగునీటి సమస్య.. అధ్వానంగా మారిన పారిశుధ్యం.. కుక్కల బెడదతో ప్రజలు విలవిలలాడుతున్నారన్నారు. ప్రజాసమస్యలపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తే విమర్శిస్తున్నారనడం తప్ప మంత్రి చే సిందేమీలేదని ఎద్దేవా చేశారు. కార్పొరేషన్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేటర్లు ఊటుకూరు మాధవయ్య, ఓబిలి రవిచంద్ర, దేవరకొండ అశోక్, నాయకులు వందవాసి రంగ, కుంచాల శ్రీనివాసులు, వేలూరు మహేష్ పాల్గొన్నారు. -
చుట్టం చూపుగా వస్తున్న ‘నారాయణ ’
జిల్లా నుంచి మంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యం నారాయణపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే అనిల్ నెల్లూరు(సెంట్రల్) : రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ జిల్లాకు చుట్టం చూపుగా వస్తున్నారే కానీ ఏనాడూ ప్రజా సమస్యలు పరిష్కరించిన దాఖలాల్లేవని మంత్రి నారాయణపై సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ ధ్వజమెత్తారు. స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మంత్రి ఎప్పుడు వస్తారో..ఎప్పుడు వెళ్తారో ఎవరికీ తెలియదన్నారు. జిల్లాకు వచ్చే కేంద్ర మంత్రులకు స్వాగతాలు పలకడానికే ఆయన ఉన్నట్లుందని ఎద్దేవా చేశారు. జిల్లాకు చెందిన వ్యక్తి మున్సిపల్ మంత్రిగా ఉండి కూడా జిల్లాకు ఒక్క పైసా కూడా నిధులు తీసుకురాక పోవడం దారుణమన్నారు. ఆయన మంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యమన్నారు. మోసపూరిత మాటలు మానుకోవాలి.. ప్రత్యేక హోదాపై ప్రజలను మోసం చేసే మాటలను తెలుగుదేశం నాయకులు మానుకోవాలని ఎమ్మెల్యే హితవు పలికారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ నేతలు తలోమాట మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. సమావేశంలో కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, గోగుల నాగరాజు, ఎండీ ఖలీల్‌అహ్మద్, దేవరకొండ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ ప్రక్రియ మొదలైంది ప్రభుత్వ విప్ అనిల్
మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: అసెంబ్లీలో తెలంగాణ చర్చ మొదలైందని, ప్రత్యేక పార్లమెంట్ సమావేశా ల్లో రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొం దుతుందని ప్రభుత్వ విప్, నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే అనిల్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఆర్అండ్బీ అ తిథి గృహంలో ఆయన విలేకరులతో మా ట్లాడుతూ రాష్ట్రపతి పంపిన బిల్లును అ సెంబ్లీలో చర్చిస్తుంటే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అడ్డుకోవాలని చూడటం సరికాదని హితవు పలికారు. వారికి ని జంగా సీమాంధ్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ఆ ప్రాంతంలో విద్య, ఉద్యోగ, రా జధాని కో సం చర్చించాలని కోరారు. తె లంగాణ ప్రజల 60ఏళ్ల ఆకాంక్షను గౌరవించకుండా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుండటం స మంజసం కాదన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు ఆగదని పేర్కొన్నారు. ఇచ్చినమాట ప్రకారం యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ రా ష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇ ప్పటికీ రెండుకళ్ల సిద్ధాంతం పాటిస్తున్న టీ డీపీ ఇరుప్రాంతాల్లో కనుమరుగు కావడం ఖాయమన్నారు. స్వార్థ పూరిత రాజకీయ పార్టీల ను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఆదరించర ని చెప్పారు. రాహుల్‌గాంధీ దేశంలోని యువతరానికి ఐకాన్‌గా మారారని పే ర్కొన్నారు. అవినీతిరహిత సమాజం కోసం యువత ఉద్యమించాలని కోరారు. అనంతరం ఎన్ఎస్యూఐ రూపొందిం చిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించా రు. సమావేశంలో ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రె డ్డి, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మాజీ మున్సిపల్ చైర్మన్ ముత్యాల ప్ర కాశ్, జిల్లా గ్రంథాల సంస్థ అధ్యక్షుడు పె ద్దిరెడ్డి సాయిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బ్రహ్మయ్య, జిల్లా అధికార ప్రతినిధి సీజే బెనహర్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షు డు దినేష్, ఉపాధ్యక్షుడు ఇమ్మడి వెం కటేష్, తదితరులు పాల్గొన్నారు.