చుట్టం చూపుగా వస్తున్న ‘నారాయణ ’ | minister narayana | Sakshi
Sakshi News home page

చుట్టం చూపుగా వస్తున్న ‘నారాయణ ’

Published Mon, Aug 17 2015 3:10 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

చుట్టం చూపుగా వస్తున్న ‘నారాయణ ’ - Sakshi

చుట్టం చూపుగా వస్తున్న ‘నారాయణ ’

జిల్లా నుంచి మంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యం
నారాయణపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే అనిల్
 
 నెల్లూరు(సెంట్రల్) : రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ జిల్లాకు చుట్టం చూపుగా వస్తున్నారే కానీ ఏనాడూ ప్రజా సమస్యలు పరిష్కరించిన దాఖలాల్లేవని మంత్రి నారాయణపై సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ ధ్వజమెత్తారు. స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మంత్రి ఎప్పుడు వస్తారో..ఎప్పుడు వెళ్తారో ఎవరికీ తెలియదన్నారు. జిల్లాకు వచ్చే కేంద్ర మంత్రులకు స్వాగతాలు పలకడానికే ఆయన ఉన్నట్లుందని ఎద్దేవా చేశారు. జిల్లాకు చెందిన వ్యక్తి మున్సిపల్ మంత్రిగా ఉండి కూడా జిల్లాకు ఒక్క పైసా కూడా నిధులు తీసుకురాక పోవడం దారుణమన్నారు. ఆయన మంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యమన్నారు.

 మోసపూరిత మాటలు మానుకోవాలి..
 ప్రత్యేక హోదాపై ప్రజలను మోసం చేసే మాటలను తెలుగుదేశం నాయకులు మానుకోవాలని ఎమ్మెల్యే హితవు పలికారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ నేతలు తలోమాట మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. సమావేశంలో కార్పొరేటర్లు ఓబిలి రవిచంద్ర, ఊటుకూరు మాధవయ్య, గోగుల నాగరాజు, ఎండీ ఖలీల్‌అహ్మద్, దేవరకొండ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement