ప్రజలందరికీ న్యాయం చేస్తాం | Will do justice for people | Sakshi
Sakshi News home page

ప్రజలందరికీ న్యాయం చేస్తాం

Published Fri, Sep 23 2016 2:03 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

ప్రజలందరికీ న్యాయం చేస్తాం

ప్రజలందరికీ న్యాయం చేస్తాం

 
  •  ఎమ్మెల్యే అనిల్‌
 
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): సాలుచింతల ప్రాంతంలో పెన్నా బ్యారేజీ నిర్మాణ సమీపంలో నివసిస్తున్న ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అందరికీ న్యాయం జరుగుతుందని నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌యాదవ్‌ భరోసా ఇచ్చారు. 53వ డివిజన్‌ సాలుచింతలలో గురువారం ఆయన పర్యటించారు. పెన్నా బ్యారేజీ నిర్మాణ పనుల వల్ల ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఖాళీ చేయాల్సి వస్తుందని అధికారులు చెప్పడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దాదాపు 50 ఏళ్ల నుంచి అక్కడ నివసిస్తున్న కుటుంబాల పరిస్థితులను కలెక్టర్‌కు వివరించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తామని తెలిపారు. బండ్‌ కాకుండా ప్రహరీని నిర్మిస్తే ఈ ప్రాంత వాసులు ఖాళీ చేయాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌ రూప్‌కుమార్‌యాదవ్, కార్పొరేటర్‌ దేవరకొండ అశోక్, నాయకులు నాగభూషణం, జాకీర్, నాగరాజు, వెంకటేశ్వర్లు, జెస్సీ, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement