తాండూరు టౌన్, న్యూస్‌లైన్ : తాండూరు మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పట్టణంలో ‘తెలంగాణ విక్టరీ రన్’ నిర్వహించారు. స్థానిక విలియంమూన్ చౌరస్తాలో ప్రారంభమైన రన్ ఇందిరా చౌక్, వినాయక్ చౌక్, రైల్వే స్టేషన్, మార్వాడీ బజార్ వార్డుల నుంచి సాగి తిరిగి విలియంమూన్ చౌరస్తాలో ముగిసింది. ఈ సందర్భంగా మార్నింగ్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. ఆరోగ్యానికి ఉదయపు నడక దోహదపడుతుందన్నారు. రోజంతా నూతనోత్తేజంతో పని చేస్తామన్నారు. దశాబ్దాల పాటు సాగించిన ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.
ష్ట్ర పునర్నిర్మాణంలోనూ అందరూ భాగస్వాములు కావాలని, ఆర్థిక, విద్య, వైద్య తదితర రంగాలను అభివృద్ధిపరిచి ప్రజలను ప్రగతిపథం వైపు నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇంధన పొదుపు, కాలుష్య పరిరక్షణ కోసం మోటారుసైకిళ్ల వినియోగం తగ్గించుకోవాలని సూచించారు. తక్కువ దూరం వెళ్లాల్సి వస్తే నడకకే ప్రాధాన్యమివ్వాలని లేదా సైకిల్‌ను వినియోగించాలన్నారు. త్వరలోనే సైకిల్‌పై ప్రయాణాన్ని ప్రోత్సహించేందుకు వాక ర్స్ అసోసియేషన్ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ నియోజకవర్గ చైర్మన్ సోమశేఖర్, ఉపాధ్యాయుల సంఘం జేఏసీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, టీవీవీ జిల్లా అధ్యక్షుడు మదన్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఏఈ తుల్జారాం సింగ్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కేశవరెడ్డి, అంబరయ్య, శ్రీనివాస్, రవి, మధు, వెంకట్రామ్‌రెడ్డి, ఎల్లప్ప, నర్సిరెడ్డి, సత్యం పాల్గొన్నారు.
తాండూరులో ‘తెలంగాణ విక్టరీ రన్’
Published Tue, Mar 4 2014 11:46 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement