madhan reddy
-
ఎమ్మెల్యేకు బాల్యం గుర్తొచ్చిందేమో?
కొల్చారం(నర్సాపూర్): ఆయన ఎమ్మెల్యే పల్లె ప్రగతి అభివృద్ధి పనులు పరిశీలించడానికి వచ్చారు. అక్కడ ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన ఉయ్యాలను చూసి ఒక్కసారిగి బాల్యం గుర్తొచ్చిందేమో? ఉయ్యాలలో ఊగి ఆనందపడ్డారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి గురువారం కొల్చారం మండలంలో పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు పర్యటించారు. అక్కడ కొంగోడ్ గ్రామంలోని పల్లె ప్రకృతివనాన్ని ప్రారంభించి ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన ఉయ్యాలపై కూర్చుని సరదాగా ఉయ్యాల ఊగి ఆనంద పడ్డారు. -
ఆంధ్రా పోలీసులపై రౌడీ ముఠా దాడి
► నిందితుడిని తరలిస్తుండగా ఘటన ► నలుగురికి తీవ్ర గాయాలు తిరుత్తణి: మహిళ కిడ్నాప్ కేసుకు సంబంధించి నిందితుడిని అరక్కోణంలో అరెస్టు చేసి ఆంధ్రా పోలీసులు తరలిస్తుండగా అడ్డుకున్న ఓ రౌడీ ముఠా వారిపై దాడి చేసి నిందితుడిని తీసుకెళ్లిన సంఘటన తిరుత్తణిలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసులు 2009లో ఓ మహిళ కిడ్నాప్ కేసుకు సంబంధించి మదన్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి గత వారం కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. మదన్‌రెడ్డి తమిళనాడు అరక్కోణం ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు హెడ్ కానిస్టేబుల్ శ్యాంసన్ ఆధ్వర్యంలో కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, వెంకటేష్, గజవాల శనివారం అరక్కోణం చేరుకుని మదన్‌రెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం కారును అద్దెకు తీసుకుని నిందితుడితో పాటు పోలీసులు ప్రయాణం అయ్యారు. శనివారం రాత్రి 8 గంటల సమయంలో తిరుత్తణి సమీప చెన్నై, తిరుపతి జాతీయ రహదారి వద్ద కారు వెళ్తున్న సమయంలో అడ్డుకున్న కొంతమంది కారు అద్దాలను ధ్వంసం చేసి పోలీసులపై దాడికి పాల్పడ్డారు. అనంతరం కారులోని మదన్‌రెడ్డిని తీసుకుని పారిపోయారు. గాయపడిన పోలీసులను స్థానికకులు తిరుత్తణి జీహెచ్‌కు తరలించారు. దీనిపై ఆంధ్రా పోలీసులు తిరుత్తణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రూ.30కే కిలో బియ్యం
నర్సాపూర్: పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30కే కిలో బియ్యం పథకం చేపట్టిందని స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిలో రూ.30కే బియ్యం కౌంటర్‌ను ఆయన జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాజమణి మురళీధర్ యాదవ్‌తో కలిసి స్థానిక రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరువుతో ధరలు పెరిగినందున పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నిర్ణీత ధర కు బియ్యం అందేలా చర్యలు తీసుకుందని చెప్పారు. అందులో భాగంగా బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ రమణారావు, తహశీల్దార్ అన్వర్ మహమ్మద్, టీఆర్ఎస్ నాయకులు మురళీధర్ యాదవ్, రామాగౌడ్, రైస్‌మిల్లర్స్ జిల్లా మాజీ అధ్యక్షుడు కిషన్‌రావు, గౌరవ ఆధ్యక్షుడు మల్లారెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు ర్యాక వెంకటేశం, అశోక్, నోముల పాండు, శ్రీనివాస్, రాంరెడ్డి, సర్వర్ ఖా న్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రైస్ మిల్లర్లు మదన్‌రెడ్డి, రాజమణిని ఘనంగా సన్మానించా రు. జెడ్పీ చైర్‌పర్సన్‌కు సన్మానం నర్సాపూర్:జిల్లాపరిషత్ చైర్పర్సన్ ఎ.రాజమణిని సోమవారం నర్సాపూర్‌లోని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. జిల్లా అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కె. కిషన్‌రావు, నర్సాపూర్ అసోసియేషన్ గౌరవఅధ్యక్షుడు మల్లారెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, డెరైక్టర్ అశోక్, ఇతర ప్రతినిధులు మల్లారెడ్డి,రాంరెడ్డి ఆమెను ఘనంగా సన్మానించారు. ఆమె హయాంలో జిల్లా అభివృద్ధి చెందగలదనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆమె భర్త టీఆర్ఎస్ నాయకుడు మురళీధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
తాండూరులో ‘తెలంగాణ విక్టరీ రన్’
తాండూరు టౌన్, న్యూస్‌లైన్ : తాండూరు మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పట్టణంలో ‘తెలంగాణ విక్టరీ రన్’ నిర్వహించారు. స్థానిక విలియంమూన్ చౌరస్తాలో ప్రారంభమైన రన్ ఇందిరా చౌక్, వినాయక్ చౌక్, రైల్వే స్టేషన్, మార్వాడీ బజార్ వార్డుల నుంచి సాగి తిరిగి విలియంమూన్ చౌరస్తాలో ముగిసింది. ఈ సందర్భంగా మార్నింగ్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. ఆరోగ్యానికి ఉదయపు నడక దోహదపడుతుందన్నారు. రోజంతా నూతనోత్తేజంతో పని చేస్తామన్నారు. దశాబ్దాల పాటు సాగించిన ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ష్ట్ర పునర్నిర్మాణంలోనూ అందరూ భాగస్వాములు కావాలని, ఆర్థిక, విద్య, వైద్య తదితర రంగాలను అభివృద్ధిపరిచి ప్రజలను ప్రగతిపథం వైపు నడిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇంధన పొదుపు, కాలుష్య పరిరక్షణ కోసం మోటారుసైకిళ్ల వినియోగం తగ్గించుకోవాలని సూచించారు. తక్కువ దూరం వెళ్లాల్సి వస్తే నడకకే ప్రాధాన్యమివ్వాలని లేదా సైకిల్‌ను వినియోగించాలన్నారు. త్వరలోనే సైకిల్‌పై ప్రయాణాన్ని ప్రోత్సహించేందుకు వాక ర్స్ అసోసియేషన్ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జేఏసీ నియోజకవర్గ చైర్మన్ సోమశేఖర్, ఉపాధ్యాయుల సంఘం జేఏసీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, టీవీవీ జిల్లా అధ్యక్షుడు మదన్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఏఈ తుల్జారాం సింగ్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కేశవరెడ్డి, అంబరయ్య, శ్రీనివాస్, రవి, మధు, వెంకట్రామ్రెడ్డి, ఎల్లప్ప, నర్సిరెడ్డి, సత్యం పాల్గొన్నారు.