రూ.30కే కిలో బియ్యం | one kilo rice thirty rupees only | Sakshi
Sakshi News home page

రూ.30కే కిలో బియ్యం

Published Tue, Jul 8 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 9:57 AM

రూ.30కే కిలో బియ్యం

రూ.30కే కిలో బియ్యం

నర్సాపూర్: పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30కే కిలో బియ్యం పథకం చేపట్టిందని స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిలో రూ.30కే బియ్యం కౌంటర్‌ను ఆయన జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రాజమణి మురళీధర్ యాదవ్‌తో కలిసి స్థానిక రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరువుతో ధరలు పెరిగినందున పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా  ప్రభుత్వం నిర్ణీత ధర కు బియ్యం అందేలా చర్యలు తీసుకుందని చెప్పారు.
 
అందులో భాగంగా బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ రమణారావు, తహశీల్దార్ అన్వర్ మహమ్మద్, టీఆర్‌ఎస్ నాయకులు మురళీధర్ యాదవ్, రామాగౌడ్, రైస్‌మిల్లర్స్ జిల్లా మాజీ అధ్యక్షుడు కిషన్‌రావు, గౌరవ ఆధ్యక్షుడు మల్లారెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు ర్యాక వెంకటేశం, అశోక్, నోముల పాండు, శ్రీనివాస్, రాంరెడ్డి, సర్వర్ ఖా న్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రైస్ మిల్లర్లు మదన్‌రెడ్డి, రాజమణిని ఘనంగా సన్మానించా రు.
 
జెడ్పీ చైర్‌పర్సన్‌కు సన్మానం
నర్సాపూర్:జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ ఎ.రాజమణిని సోమవారం నర్సాపూర్‌లోని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. జిల్లా అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కె. కిషన్‌రావు, నర్సాపూర్ అసోసియేషన్ గౌరవఅధ్యక్షుడు మల్లారెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, డెరైక్టర్ అశోక్, ఇతర ప్రతినిధులు మల్లారెడ్డి,రాంరెడ్డి  ఆమెను ఘనంగా సన్మానించారు.  ఆమె హయాంలో జిల్లా అభివృద్ధి చెందగలదనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆమె భర్త టీఆర్‌ఎస్ నాయకుడు మురళీధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement