poor peoples
-
పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర
-
Paital Gagan: బట్టల తాత వచ్చాడోచ్
ఒరిస్సాలో ఏదో ఒక ఉదయం ఏదో ఒక మారుమూల పల్లెలో వ్యాన్ ఆగుతుంది. దానిని చూసిన వెంటనే పిల్లల కళ్లల్లో వెలుగు. కటిక దారిద్య్రం వల్ల చలికాలమైనా వానాకాలమైనా ఒంటి నిండా బట్టలు లేని వారికి గగన్ బట్టలు పంచుతాడు. రిటైర్డ్ ఉద్యోగి అయిన పెయిటల్ గగన్ తన భార్యతో కలిసి ఊరూరా తిరిగి బట్టలు సేకరించి పంచుతాడు. పిల్లల పసినవ్వును ఆశీర్వాదంగా పొందుతాడు. సంఘటనలు అందరికీ ఎదురవుతుంటాయి. కొందరు స్పందిస్తారు. కొందరు స్పందించరు. కొందరు ఆ సంఘటనలతో తమ లక్ష్యాన్ని, కర్తవ్యాన్ని తెలుసుకుంటారు. అలాంటి వారు ఆదర్శంగా నిలుస్తారు. పదేళ్ల క్రితం– భువనేశ్వర్‌లో చిన్న పోస్టల్ ఉద్యోగైన గగన్ పెయిటల్ ఇంటికి వెళుతున్నాడు. అతనికి వాణి విహార్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక దిక్కులేని మహిళ కనిపించింది. ఆమె చిరిగిన చీర కట్టుకుని ఉంది. గగన్ ఆమెను చూసి జాలిపడి హోటల్ నుంచి ఫుడ్ ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడు. కాని ఆమె ‘అన్నం వద్దు. ముందు ఒక చీర ఇవ్వండి’ అని ప్రాధేయపడింది. స్త్రీగా ఆమె అవస్థ గమనించిన గగన్ వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లి పాత చీర తెచ్చి ఇచ్చాడు. ‘దానిని అందుకుంటూ ఆమె ముఖంలో కనిపించిన సంతోషం అంతా ఇంతా కాదు. ఒంటికి తగిన బట్ట ఉంటేనే మనిషికి మర్యాద. అది లేని వారు ఈ దేశంలో ఎందరో ఉన్నారు. వారి కోసం ఏదైనా చేయాలి అని నిశ్చయించుకున్నాను’ అంటాడు గగన్. ఉద్యోగంలో ఉండగా మొదలుపెట్టిన ఈ పనిని రిటైరయ్యాక కూడా కొనసాగిస్తున్నాడు. చిన్న ఉద్యోగి అయినా పోస్టాఫీసులో చిరుద్యోగిగా పని చేసి రిటైరైన గగన్ భువనేశ్వర్‌లో చకైసియాని ప్రాంతంలో నివసిస్తాడు. కొడుకు మృత్యుంజయ బలిగూడ అనే ఊళ్లో క్యాబ్ డ్రైవర్. కోడలు టీచర్‌గా పని చేస్తున్నది. ఇతర బాదరబందీలు లేని గగన్ తన భార్య అన్నపూర్ణకు తన ఆలోచన చెప్పాడు. ‘మనం అందరికీ కొత్త బట్టలు ఇవ్వలేం. అలాగని అన్నేసి పాత బట్టలూ ఉండవు. కాబట్టి సేకరించి పంచుదాం’ అన్నాడు. అన్నపూర్ణ అతనికి సహరించడానికి అంగీకరించింది. ఆ రోజు నుంచి గగన్ తనకు ఖాళీ ఉన్నప్పుడల్లా భువనేశ్వర్‌లోని అపార్ట్మెంట్లకూ హౌసింగ్ కాలనీలకు తిరిగి వాడిన దుస్తులను సేకరిస్తాడు. అవసరమైతే కటక్ వంటి ఇతర పట్టణాలకు కూడా వెళతాడు. ‘పేదలకు పంచుతాం. మీరు ఉపయోగించక పడేసిన దుస్తులు ఇవ్వండి’ అంటే చాలామంది ఇస్తారు. వాటిని తీసుకొస్తాడు గగన్. సరి చేసి, ఇస్త్రీ చేసి ‘మనం బట్టలు పంచినా అవి సరిగ్గా ఉండాలి. మావారు తెచ్చిన బట్టలు ఏవైనా చిరిగి ఉంటే కుట్టి, ఇస్త్రీ చేసి, స్త్రీలవి, పురుషులవి, పిల్లలవి విడివిడిగా ప్యాక్ చేసి కొత్తవిగా కనిపించేలా చేస్తాను’ అంటుంది గగన్ భార్య అన్నపూర్ణ. వాళ్లుండేది చిన్న ఇల్లే అయినా ఒక గది ఖాళీ చేసి పూర్తిగా గోడౌన్‌గా వదిలారు. భార్యాభర్తలిద్దరూ డాబా మీదకు చేరి వాటిని విభజించి మూటలుగా కడతారు. ఆ తర్వాత గగన్ తీసుకెళ్లి పంచుతాడు. బట్టలు, బూట్లు, దోమతెరలు గగన్ ముఖ్యంగా చిన్నపిల్లల కోసం బట్టలు సేకరిస్తాడు. ఒడిసాలో గిరిజన పిల్లలకు సరైన బట్టలు ఉండవు. కొండ ప్రాంతాలకు వెళ్లి వారి బాగోగులు ఎవరూ చూడరు. గగన్ అలాంటి పిల్లల కోసం బట్టలు సేకరించి పంచుతాడు. గగన్ సేవా భావం గమనించిన దాతలు అతనికో వ్యాన్ ఏర్పాటు చేశారు. గగన్‌కు ఏనుగంత బలం వచ్చింది. తాను సేకరించిన బట్టలను వ్యాన్‌లో వేసుకుని మారుమూల పల్లెలకు వెళ్లి పిల్లలకు పంచుతాడు. దోమలు కుట్టి పసికందులు రోగాల బారిన పడకుండా దోమతెరలు పంచుతాడు. బొమ్మలు ఇస్తాడు. పిల్లలు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరిస్తారు. బట్టల తాత అని పిలుస్తారు. పండుగల ముందు ఒడిసాలో చేసుకునే పండగల ముందు చాలా శ్రమించి బట్టలు సేకరిస్తాడు గగన్. పేదలు పండగ సమయంలో వీలైనంత మంచి బట్టలు వేసుకోవాలని ఆ సమయాలలో ప్రత్యేకంగా తీసుకెళ్లి పంచుతాడు. అంతేకాదు పూరి జగన్నాథ రథ యాత్ర సమయంలోనూ, కటక్ దుర్గా పూజకూ ఎక్కడెక్కడి పేదవారో వస్తారు. అక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ పెట్టి మరీ పాత బట్టలు పంచుతాడు. ఈ దేశంలో ప్రతి పేదవాళ్లకి ఒంటినిండా బట్ట దొరికే దాకా గగన్ లాంటి వాళ్లు వందలుగా పని చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వారుగా ఎవరైనా ఉండొచ్చు. ప్రయత్నించాలి... కొద్దిగా మనసు పెట్టాలి అంతే. -
అమరావతిలో పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి లైన్ క్లియర్
-
కొత్త ఊళ్లకు ఊపిరి...విపక్షం ఉక్కిరిబిక్కిరి
సొంతింటి కల సాకారమవుతోంది. పేదల్లో సంతోషం పరవళ్లు తొక్కుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. వేలకు వేల ఇళ్లతో ఏకంగా ఊళ్లే ఊపిరి పోసుకుంటున్నాయి. మరోవైపు ఈ కార్యక్రమం ద్వారా నిర్మాణరంగం కళకళలాడుతోంది. వేలాది కార్మికులకు ఉపాధి లభిస్తోంది. స్టీల్, సిమెంట్, ఇటుకలు తదితర నిర్మాణ సామాగ్రి వ్యాపారాలు సైతం జోరుగా సాగుతూ మార్కెట్ టర్నోవర్ ను పెంచుతున్నాయి. జగనన్న కాలనీల పథకంతో ఇన్ని రకాలుగా మేలు జరుగుతున్నా.. విపక్షం కళ్లు లేని కబోదిలా వ్యవరిస్తోంది. ఇళ్ల నిర్మాణంతో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుందని కుళ్లుకుంటోంది. పచ్చ మీడియా ద్వారా విషం చిమ్ముతోంది. తన పాలనలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయని టీడీపీ శరవేగంగా జరుగుతున్న ఇళ్ల నిర్మాణాలపై తప్పుడు ప్రచారానికి తెగబడుతూ పైశాచిక ఆనందం పొందుతోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో జగనన్న కాలనీల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గృహ ప్రవేశాలు కూడా మొదలైపోయాయి. కానీ వీటిని చూసి టీడీపీ ఓర్చుకోలేకపోతోంది. పచ్చ పత్రికలతో గోబెల్స్ ప్రచారానికి ఒడిగడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు న్యాయస్థానాల్లో పలు పిటీషన్లు వేసి అడ్డు తగిలినా చివరికి ధర్మమే గెలిచింది. జిల్లాలో 1156 లేఅవుట్లు జిల్లాలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున భూసేకరణ చేసింది. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాల కోసం 1795.80 ఎకరాలు అవసరం కాగా 1227.17ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించింది. మిగతా 568. 63 ఎకరాల మేరకు ప్రైవేటు భూమి కొనుగోలు చేశారు. ఒక్క భూమి కొనుగోలు కోసమే రూ.178.31కోట్లు వెచ్చించారు. అర్హులైన వారందరి కోసం జిల్లాలో 1156 లేఅవుట్లు వేశారు. లేఅవుట్ కోసం భూముల చదును చేయడం, జంగిల్ క్లియరెన్స్, అంతర్గత రోడ్లు, హద్దుల రాళ్లు, డ్రైనేజీ తదితర వాటి కోసం రూ. 30కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇవి కాకుండా లేఅవుట్లకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు రూ.74కోట్లు ఖర్చు చేసింది. అలాగే లేఅవుట్లలో విద్యుత్ సౌకర్యం కోసమని రూ.10 కోట్లకు పైగా ఖర్చు పెడుతోంది. వేసిన లేఅవుట్లలో పచ్చదనం కోసం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరుగుతోంది. తొలి విడతలో 695 లేఅవుట్లు జిల్లా వ్యాప్తంగా 1156 లేఅవుట్లు వేసినప్పటికీ తొలి విడతగా 695 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో 40,630 స్థలాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో లబ్ధిదారులు ఉత్సాహంగా ఇళ్లు నిర్మాణాలు చేపడుతున్నారు. రెండేళ్ల కరోనాతో ఆర్థిక ఇబ్బందులు కారణంగా పెట్టుబడి పెట్టలేని పరిస్థితిలో కొంత జాప్యం జరుగుతున్నా... సొంతిళ్లు సాకారం చేసుకునేందుకు ప్రభుత్వమిచ్చిన ఆర్థిక సాయంతో నిర్మాణాలు వేగవంతం చేశారు. అధికారులు కూడా పర్యవేక్షణ చేసి ఎప్పటికప్పుడు వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు అవసరమైన సాయం అందిస్తున్నారు. మంజూరైన వాటిలో 38,174 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కొత్త కాలనీలు.. ప్రస్తుతం నిర్మాణాలు జోరుగా సాగుతుండటంతో కొత్తగా నిర్మిస్తున్న కాలనీలు కొత్త ఊళ్లుగా దర్శనమిస్తున్నాయి. ఆ కాలనీల్లో నిర్మాణ సందడి కనిపిస్తోంది. అద్దెల భారం నుంచి బయటపడాలని లబ్ధిదారులు సైతం వ్యక్తిగత శ్రద్ధతో నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవన్నీ పూర్తయితే జిల్లాలో కొత్తగా 695 కాలనీలు అవతరించనున్నాయి. సంపూర్ణ గృహ హక్కుతో.. 1983 నుంచి 2011 వరకు ప్రభుత్వ గ్రాంట్‌తో, గృహ నిర్మాణ సంస్థ రుణంతో నిర్మించుకున్న ఇళ్లకు చాలా మంది పేరుకే యజమానులు తప్ప ఎలాంటి హక్కులు లేని పరిస్థితి ఉంది. మన పేరున హౌసింగ్ రుణం ఉండటంతో ఆ ఇళ్లను అమ్ముకోవడానికి, బదిలీకి, కనీసం లీజుకివ్వడానికి గానీ, అవసరం మేరకు బ్యాంకు రుణం తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఎన్నాళ్లైనా ఆ ఇంటిలో ఉండటమే తప్ప అవసరాలకు దాన్ని వినియోగించుకోలేని దుస్థితి ఉండేది. సరికదా ఇళ్ల నిర్మాణం కోసమని తీసుకున్న రుణాన్ని వాయిదాల పద్ధతిలో వడ్డీతో కలిపి చెల్లించాల్సిన పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఈ విధంగా తరాలు మారుతున్నా ప్రభుత్వ ఇళ్లకు సర్వహక్కులు పొందలేకపోయారు. ఇలాంటి వారి బాధలను దృష్టిలో పెట్టుకుని నామమాత్రం రుసుంతో ఇంటిపై సర్వహక్కులను కల్పించే సదుద్దేశంతో సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీంతో జిల్లాలో లక్షా 93వేల 881మందికి ఉపశమనం కలిగింది. ఇప్పటికే 43వేల మంది రిజిస్ట్రేషన్లతో పక్కా పత్రాలు పొందారు. ఇంటివారమయ్యాం.. నాకు వివాహమై 15 ఏళ్లవుతోంది. ఇన్నాళ్లకు మేం ఓ ఇంటి వారమయ్యాం. నా భర్త కూలి పని చేస్తుంటారు. సొంతంగా ఇళ్లు నిర్మించుకోలేక ఇన్నాళ్లు అద్దె ఇంటిలోనే ఉన్నాం. జగనన్న వచ్చి విలువైన ఇంటి స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి డబ్బు మంజూరు చేశారు. చాలా ఆనందంగా ఉంది. తొందరగా పూర్తి చేసి గృహ ప్రవేశం చేద్దామనుకుంటున్నాం. ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోంది. – నక్క ఆరుద్ర, గడ్డెయ్యపేట, జమ్ము, నరసన్నపేట కల సాకరమైంది.. కుప్పిలికి చెందిన కుప్పిలి నారాయణమ్మది పేద కుంటుంబం. సొంతింటి కోసం ఎన్నో ఏళ్లుగా కలలు కన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నవరత్నాలు–వైఎస్సార్ ఇళ్లులో ఈమెకు సెంటున్నర స్థలం ఇంటి పట్టా ఇచ్చారు. రూ. 1.80 లక్షలు యూనిట్ మంజూరు చేశారు. ఇసుక కూపన్లు, నిబంధనల మేరకు ఐరన్, సిమ్మెంట్, పునాదులు తవ్వకానికి 90 రోజులు ఉపాధి హామీ పథకం మస్టర్ వేసి వేతనం ఇచ్చారు. ఇలా ఈమె సొంతింటి కల సాకారమైంది. 20 ఏళ్ల కల టెక్కలికి చెందిన కరుకోల షణ్ముఖరావు, విజయలక్ష్మి దంపతుల 20 ఏళ్ల నిరీక్షణ వైఎస్సార్ జగనన్న కాలనీతో నెరవేరింది. షణ్ముఖరావు స్థానికంగా ఓ కిరాణా దుకాణంలో పనిచేస్తున్నారు. 20 ఏళ్లుగా పట్టణంలో అద్దె ఇంటిలోనే నివాసం ఉంటున్నారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా టెక్కలి జగతిమెట్ట వద్ద ఆయనకు ప్రభుత్వం ఇంటి స్థలం మంజూరు చేసింది. దీంతో వారు ఎంతో సుందరంగా ఇంటిని కట్టుకున్నారు. 20 ఏళ్లుగా కలగానే ఉండిపోయిన సమస్యను వైఎస్ జగన్ తీర్చారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ఏ ఊళ్లోనూ 50% పైగా ఎస్సీలు లేరట!) -
లాక్‌డౌన్‌తో ఎవరూ ఇబ్బంది పడకూడదు
-
రంజాన్ తోఫా రెడీ
మెదక్ రూరల్: నిరుపేదలు సైతం అందరితో సమానంగా పండుగలను జరుపుకోవాలనే ఆలోచనతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు వారివారి ముఖ్యమైన పండుగలకు ప్రభుత్వం కానుకలను పంపిణీ చేస్తుంది. ఇందులో భాగంగానే ప్రస్తుత రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పేద ముస్లింలకు కానుకలను అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు ఇప్పటికే జిల్లా కేంద్రంలో రంజాన్ కానుకలను పంపిణీ చేసేం దుకు సిద్ధంగా ఉంచారు. జిల్లాలో మొత్తం 20 మండలాలు, 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కానుకలను పంపిణీ చేసేందుకు మెదక్ నియోజకవర్గంలో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో మూడు మెదక్ పట్టణంలో, ఒకటి పాపన్నపేట, మరొకటి రామాయంపేటలో ఉన్నాయి. నర్సాపూర్ నియోజకవర్గంలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో నర్సాపూర్, కౌడిపల్లి, దౌల్తాబాద్ ఉన్నాయి. మొత్తం రెండు నియోజకవర్గాల్లో కలిపి ఎనిమిది కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందు కోసం ఒక్కో సెంటర్‌కు లక్ష రూపాయల చొప్పున మొత్తం ఎనిమిది సెంటర్లకు రూ.8లక్షలు అందజేయనున్నారు. పండుగకు వారం రోజుల ముందు ప్రతి సెంటర్లో 500 మంది పేదలను గుర్తించి వారికి దుస్తులతో ఉన్న గిఫ్ట్ ప్యాకెట్లను అందజేయనున్నారు. ఎనిమిది సెంటర్లకు కలిపి మొత్తం 4 వేల గిఫ్ట్ ప్యాకెట్లు జిల్లాకు చేరుకున్నాయి. రంజాన్ పండుగకు వారం రోజుల ముందు వీటిని అందించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రతి సెంటర్లో ఆర్డీఓ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఆ కమిటీకి పూర్తి బాధ్యతలను అప్పగిస్తున్నారు. ప్రభుత్వం ఇఫ్తార్ విందు కోసం అందించిన డబ్బులను సైతం ఆ కమిటీ సభ్యుల ఖాతాలోనే వేయడం జరుగుతుంది. కమిటీ సభ్యులు వారి సాంప్రదాయం ప్రకారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తారు. తమ ప్రాంతంలోని పేద ముస్లింలను ఆధార్‌కార్డు, ఆధాయ ధ్రువీకరణ పత్రం ద్వారా నిర్ధారిస్తారు. ఆయా ప్రాంతాలకు సంబంధించిన మత పెద్దలతో సమావేశం నిర్వహించిన తర్వాత ఆర్డీఓల పర్యవేక్షణలో కానుకల పంపిణీ చేపట్టనున్నారు. మెదక్ నియోజకవర్గానికి సంబంధించి రంజాన్ కానుకలను మెదక్ కలెక్టరేట్లో, నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించి నర్సాపూర్ ఆర్డీఓ కార్యాలయంలో భద్రపరిచారు. కమిటీ సభ్యుల మధ్య సమన్వయం లోపంతో ఇఫ్తార్ విందు కోసం వచ్చిన డబ్బులను ఎవరి ఖాతాలో వేయాలో తెలియక అధికారులు సతమతమవుతున్నట్లు సమాచారం. -
కేజీబీవీల్లో ఇంటర్‌కు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, కరీంనగర్ ఎడ్యుకేషన్ : బాలికల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) ఇంటర్ బోధనకు ఈవిద్యా సంవత్సరం నుంచే గ్రీన్‌సిగ్నల్ లభించింది. అనాథలు, పేద కుటుంబాల బాలికలకు పాఠశాలస్థాయి విద్యను అందిస్తున్న వీటిలో ఉన్నత విద్యను అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. డిప్యూటి సీఎం కడియం శ్రీహరి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కస్తూరిభా పాఠశాలల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రారంభించేందుకు చొరవ చూపారు. ఈ మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ తరగతులు ప్రారంభించేలా విద్యాశాఖ ఇప్పటికే ఏర్పాట్లల్లో మునిగింది. నాలుగు కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో మొదటిగా నాలుగు కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ విద్యను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ నియోజకవర్గంలోని సప్తగిరికాలనీ లో కేజీబీవీ పాఠశాల, చొప్పదండిలోని గంగాధర, మానకొండూర్‌లోని శంకరపట్నం, హుజూరాబాద్‌లోని జమ్మికుంట కేజీబీవీల్లో ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. కరీంనగర్, శంకరపట్నం, జమ్మికుంట కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీ, గంగాధర కేజీబీవీలో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు ఏర్పాటు కానున్నాయి. వీటిల్లోను రెండింట్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులు, రెండింట్లో సీఈసీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్(ఎంపీహెచ్‌డబ్ల్యూ) కోర్సులను ఏర్పాటు చేశారు. ఒక్క కోర్సులో 40 మందికి ప్రవేశాలు కల్పించనున్నారు. జిల్లావ్యాప్తంగా నాలుగు పాఠశాలల్లో 160 సీట్లను భర్తీ చేయనున్నారు. పదో∙తరగతి పూర్తి చేసినవారితోపాటు, ఇతర పాఠశాలల్లో చదివిన వారు కూడా ప్రవేశాలు పొందవచ్చు. బోధనతో పాటు ఉచిత వసతి, భోజనం, ఇతర సదుపాయాలను ప్రభుత్వమే కల్పించనుంది. 13 వరకు దరఖాస్తుల గడువు కేజీబీవీల్లో ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈనెల 13లోగా దరఖాస్తులు సమర్పించాలని డీఈవో వెంకటేశ్వర్లు సూచించా రు. అనాథలు, నిరుపేదలు పదో తరగతి పూర్తి చేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. హాస్టల్ వసతి కల్పిస్తామని, ఎలాంటి ఫీజూ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈనెల 25నుంచి తరగతులు తెలుగు మీడియంలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. సిబ్బంది నియామకం ప్రస్తుతం కేజీబీవీల్లో సిబ్బంది కొరతతో సతమ తం అవుతున్నారు. కొత్తగా నాలుగుచోట్ల ఇంటర్ ప్రవేశపెడుతుండడంతో బోధకుల కొరత సమస్యగా మారింది. పోస్టుగ్రాడ్యుయేట్ కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్(పీజీసీఆర్టీ)లను నియామకం చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒప్పంద పద్ధతిలో నియామకాలు ఉంటాయని, గౌరవ వేతనం రూ.23 వేల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు. గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, తెలుగు, ఆంగ్లం, బోటనీ, జువా లజీ, కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, జనరల్ ఫౌం డేషన్ నర్సింగ్ కోర్సులతోపాటు 28 పోస్టులు ఉ న్నాయని, అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు 13 లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. -
125 రూపాయలకే..పేదలకు ‘పవర్’
♦ రూ.3 వేల విలువైన విద్యుత్ సామగ్రి కూడా ఉచితం ♦ పేదల కోసం ‘దీన్ దయాళ్ యోజన’ కింద కొత్త పథకం సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయానికి నోచుకోని పేదలకు సర్కారు శుభవార్త తెచ్చింది. పేదల గృహాలకు కేవలం రూ.125 కే కొత్త విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతోపాటు.. మీటరు, హౌజ్ వైరింగ్, రెండు ఎల్ఈడీ బల్బులు, సర్వీసు వైరును ఉచితంగా అందజేయనుంది. విద్యుత్ సదుపాయం లేని ప్రాంతాలకు కొత్త విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్మిషన్ లైన్లు, సబ్స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (డీడీయూజేవై)’పథకం కింద డిస్కంలు ఈ కార్యక్రమాన్ని త్వరలో అమల్లోకి తీసుకురానున్నాయి. పూర్తిస్థాయి విద్యుదీకరణలో భాగంగా ప్రస్తుతం కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం రూ.1,200 చెల్లించాలి. దీంతోపాటు మీటరు, సర్వీసు వైరు, ఇంట్లో అవసరమైన వైర్లు, విద్యుత్ పరికరాలు వంటి వాటిని స్వయంగా కొనుక్కోవాలి. ఇది పేదలకు భారంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘అందరికీ విద్యుత్ (పవర్ ఫర్ ఆల్)’ కార్యక్రమంలో భాగంగా ‘డీడీయూజేవై’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా లబ్ధిదారులు కేవలం రూ.100 సెక్యూరిటీ డిపాజిట్, రూ.25 దరఖాస్తు రుసుము కలిపి మొత్తం రూ.125 చెల్లిస్తే కొత్త విద్యుత్ కనెక్షన్ జారీ చేస్తారు. రూ.3 వేలు విలువైన విద్యుత్ సామగ్రిని ఉచితంగా అందజేస్తారు. ఇందులో విద్యుత్ మీటర్, సర్వీస్ వైరుతో పాటు ఇంట్లో ఒక బల్బు, ఫ్యాన్, సాకెట్‌ను ఉపయోగించుకునేందుకు వీలుగా బోర్డుతో సహా హౌస్ వైరింగ్, ఇంటిలోపల, బయట పెట్టుకునేందుకు రెండు ఎల్ఈడీ బల్బులు ఉంటాయి. మొత్తంగా ఏడాదిలోగా రాష్ట్రంలో విద్యుత్ సదుపాయం లేని పేదల ఇళ్లన్నింటికీ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో రూ.457 కోట్ల అంచనా వ్యయంతో డీడీయూజేవై కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా... అందులో 75 శాతం నిధులను కేంద్రం, మిగతా 25 శాతం నిధులను డిస్కంలు భరించనున్నాయి. 50 యూనిట్ల లోపు ఉచితం.. నెలకు 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే పేద ఎస్సీ, ఎస్టీల గృహాలకు డిస్కంలు ఇప్పటికే ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. రూ.125కే కొత్త విద్యుత్ కనెక్షన్ పొందే పేద ఎస్సీ, ఎస్టీల కుటుంబాలు సైతం ఈ పథకం కింద లబ్ధిపొందనున్నాయని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. దీంతో పేద ఎస్సీ, ఎస్టీల కుటుంబాలపై విద్యుత్ బిల్లుల భారం ఉండదన్నారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో.. గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో పేదల గృహాలకు విద్యుత్ కనెక్షన్లు లేవు. తాజా కార్యక్రమం కింద ఆ గృహాలన్నింటికి కనెక్షన్లు మంజూరు చేసేం దుకు డిస్కంలు చర్యలు ప్రారంభించాయి. ఒక్కో డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం పరిధిలోని ఇలాంటి గృహాలకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేశాయి. రాష్ట్రంలో 3.5 లక్షల గ్రామీణ గృహాలకు డీడీయూజేవై కార్యక్రమం కింద విద్యుత్ కనెక్షన్లు జారీ చేయనున్నారు. విద్యుత్ సరఫరాకు కావాల్సిన మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాల్లో కొత్త విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్మిషన్ లైన్లు, సబ్స్టేషన్లను సైతం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
పెద్దలప్లాన్..పేదల విలవిల
ఇందిరా సత్యనగర్ పుంత పేదల ఇళ్లకు ఎసరు 80 అడుగుల రోడ్డు విస్తరణకు అధికారుల ప్రయత్నాలు సర్వే లేకుండానే పనులు చేసేందుకు యత్నం ఆక్రమణదారులెవరు? ఎందరో తేల్చాలని స్థానికుల డిమాండ్ నీటి సరఫరా నిలిపివేత, వైఎస్సార్సీపీ జోక్యంతో పునరుద్ధరణ చర్యల వెనుక అధికార పార్టీ నేతల హస్తం 200 కుటుంబాల్లో అలజడి ... సాక్షి, రాజమహేంద్రవరం : ఉండటానికి గూడు లేకపోవడంతో 44 ఏళ్ల క్రితం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి వెనుక ఉన్న ఇందిరానగర్ రెవెన్యూ సర్వే నంబర్ 89లోని పుంతను చదును చేసుకుని చిన్నపాటి ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు ప్రస్తుతం గూడును కోల్పో యే పరిస్థితి ఏర్పడింది. 1975 మాస్టర్‌ప్లా¯ŒS ప్రకారం కోరుకొండ రోడ్డు నుంచి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి వెనుక అన్నయాచారి రోడ్డును కలుపుతూ 80 అడుగుల రోడ్డును నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే దాన్ని 1989లో స్థానికులు విజ్ఞప్తి మేరకు అప్పటి నగరపాలక మండలి 40 అడుగులకు కుదిస్తూ అక్కడున్న వారికి పట్టాలు మంజూరు చేసేవిధంగా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అయితే ఈ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించ లేదు. అయితే తర్వాత 1998లో ఆ రోడ్డును 80 అడుగుల నుంచి 40 అడుగులకు కుదించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా ప్రస్తుతం నగరపాలక సంస్థ యంత్రాంగం పుంతలో ఉన్న పేదలను ఖాళీ చేయించి 80 అడుగుల రోడ్డును నిర్మించాలని ప్రయత్నిస్తోంది. 1973 నుంచి ఆ పుంతలో పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. 1989లో నగరపాలక మండలి తీర్మానం మేరకు అక్కడ 76 మంది ఉన్నారు. ప్రస్తుతం దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయి. పేదల ఇళ్లను ఆనుకుని, ముఖ్యంగా ధనవంతుల ఇళ్లకు ముందు రోడ్డువైపున పేదల ఇళ్లున్నాయి. ప్రస్తుతం అక్కడ కొంత మంది రాజకీయ నాయకులు, పీఅండ్‌టీ కాలనీ వాసులు పేదలను ఖాళీ చేయించేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సర్వే లేకుండానే పనులు ఎలా? గత చరిత్రను పక్కన పెట్టిన ప్రస్తుత పాలకవర్గం, యంత్రాంగం పుంతలోని ఆక్రమణదారులను ఖాళీ చేయించి 80 అడుగుల రోడ్డు వేయాలని ప్రయత్నిస్తోంది. నగరాన్ని అభివృద్ధి చేయాలన్న యంత్రాంగం చర్యలు తమ బతుకులను ఛిద్రం చేయరాదన్నది అక్కడి పేదల విన్నపం. పుంత ఆక్రమణలో పేదలతోపాటు, ఆ తర్వాత అక్కడ ప్రైవేటు స్థలాలు కొన్నవారు కూడా కొంత ప్రాంతాన్ని తమ స్థలంలో కలుపుకున్నారు. ఆ అనవాళ్లు ఆక్కడ స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రి వెనుక వైపున అన్నయాచారి రోడ్డు నుంచి కోరుకొండ రోడ్డులోని క్వారీ సెంటర్ వరకు దాదాపు రెండు కిలోమీటర్ల పొడవు ఉంది. మధ్య మధ్యలో రోడ్డు వెడల్పు ప్రస్తుతం పలు రకాలుగా ఉంది. నగరపాలక మండలి 1998 తీర్మానం ప్రకారం 40 అడుగులు కాకుండా 80 అడుగుల మేర రోడ్డును వేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అక్కడ ఉన్న పేదలు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా అసలు పుంత ఎంత స్థలం? ఎక్కడ వరకు ఉంది? ఆక్రమణ ఎంత మేర గురైంది? ఆక్రమణదారులు ఎవరు? ఎంత ఆక్రమించారు? అన్న విషయాలు తేల్చేందుకు సర్వే చేయకుండా పేదల ఇళ్లను మాత్రమే తొలగించాలని నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. కోరుకొండ రోడ్డు 80 అడుగులు ... అదే విధంగా అన్నయాచారి రోడ్డు కనీసం 30 అడుగులు కూడా లేదు. అలాంటిది ఈ రెండు రహదారులను కలుపుతూ వేసే లింకు రోడ్డు 80 అడుగులు ఉండడం, పీఅండ్‌టీ కాలనీ సంఘానికి, అక్కడ పేదలకు గత కొన్నేళ్లుగా వివాదాలు ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు... యంత్రాంగం తాను అనుకున్న పనిని వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా పదిహేను రోజుల క్రితం పుంతలోని అన్నయాచారి రోడ్డువైపు ప్రారంభంలోని నీటి కుళాయిని తొలగించింది. అయితే పేదల విషయం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలా రెడ్డి అధికారుల దృష్టికి తీసుకురావడంతో కుళాయిని పునరుద్ధరించారు. ఘటనా స్థలానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు వారికి భరోసా ఇచ్చారు. అయితే మరుసటి రోజు నుంచి కూడా యంత్రాంగం తమ ప్రయత్నాలను ఆపలేదు. దీంతో స్థానికులు నగరపాలక సంస్థ ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎప్పడు ఎవరొస్తారు? ఏమి చేస్తారోనన్న ఆందోళనలో కాలనీ వాసులున్నారు. -
ఆరో రోజూ అవే అవస్థలు
క్యూ లైన్లలో సామాన్యులు ఉదయం నుంచే ఏటీఎంల వద్ద పడిగాపులు నల్లధనం మార్పునకు పేదలే పావులు సాక్షి, రాజమహేంద్రవరం : వారం రోజులు గడుస్తున్నా బ్యాంకుల వద్ద రద్దీ ఏమాత్రం తగ్గడంలేదు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ. వెయ్యి, రూ.500 నోట్లు మార్చుకునేందుకు, నగదు డిపాజిట్ చేసేం దుకు బ్యాంకుల వద్ద ప్రజలు బారులుదీరుతున్నారు. చంటి బిడ్డలతో క్యూలైన్లలో నిలబడలేక అల్లాడిపోతున్నారు. ఉదయం వచ్చిన వారు నగదు మార్చుకునే సరికి సాయంత్రం అవుతోంది. మధ్యాహ్నం భోజనం మానుకుని క్యూలైన్లలో నిలబడుతున్నారు. ఎక్కడ పక్కకు వెళితే తమ స్థానం పోతుందోననే భయంతో అక్కడే ఉండి పోతున్నారు. నల్లధనం బయటకు వస్తుందో రాదో తెలియదుకాని తమ రోజువారీ ఉపాధిని మానుకొని నగదులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. గం టల తరబడి నిలబడితే రూ.4500 ఇస్తున్నారని, ఇవి తీసుకున్నా చిల్లర కోసం మళ్లీ తిప్పలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తంలో కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలు జమచేసిందే కావడం గమనార్హం. పార్లమెంట్ సమావేశాలు కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ పెద్దనోట్ల చెలామణి రద్దు, పన్ను చెల్లిపుంపులపై ఏదైనా ఉపసమనం లభిస్తుందేమోనన్న ఆశాభావంతో ఉన్నారు. ఉదయం నుంచే ఏటీఎంల ముందు బారులు పెద్దనోట్లు చెలామణి లేకపోవడం..చేతిలో ఉన్న రెండు వేల నోటుతో చిన్నపాటి అవసరాలు తీర్చుకునే అవకాశం లేకపోవడంతో ప్రజలు ఏటీఎంల వద్ద క్యూలు కడుతున్నారు.జిల్లాలో ఉన్న 811 ఏటీఎంలలో కేవలం 30 శాతం ఏటీఎంలలో మాత్రమే సిబ్బంది నగదు పెడుతున్నారు. దీంతో ప్రజలు రూ.100 నోట్ల కోసం ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యాంకుల వద్ద ఉన్న ఏటీఎంలలో మాత్రమే నగదు అందుబాటులో ఉంచుతున్నారన్న సమాచారంతో ఆ వైపు పరుగులు తీస్తున్నారు. పేదలతో నగదు మార్చుతున్న పెద్దలు కొందరు రాజకీయ నేతలు తమ అనుచరులను ఉపయోగించి పేదల ద్వారా నగదు మార్చుతున్నారు. ఖాతా లేకపోయినా ఆధార్ కార్డు నకలు, బ్యాంకు ఫారం నింపి ప్రతి వ్యక్తి రూ.4500 విలువైన పెద్దనోట్లు మార్చుకునే వెలుసుబాటు ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న నేతలు నగదు మార్చి ఇచ్చిన వారికి 10 శాతం కమిష¯ŒS ఇస్తున్నారు. నేతల అనుచరలు తమ వెంట తిరిగే కుర్రాళ్లకు నగదు ఇచ్చి మహిళలతో బ్యాంకుల వద్దకు పంపిస్తున్నారు. వారు ఎనాగ్జర్–5 ఫారం నింపి ప్రతి ఒక్కరికీ రూ.4,500 చొప్పున ఇస్తున్నారు. నగదు మార్చిన తర్వాత అక్కడే తిరిగి తీసుకుంటున్నారు. ఈ విధంగా జిల్లాలో ఫైనా¯Œ్స వ్యాపారం నిర్వహిస్తున్న ఓ ప్రజా ప్రతినిధి తన వద్ద ఉన్న నగదు మొత్తాన్ని మార్చుకుంటున్నట్లు సమాచారం. ఉన్నోళ్లు లేనోళ్లు ఒకటేనా చేతిలో నగదు లేదు. పెద్దనోట్లు తీసుకోవడంలేదు. నగదు మార్చుకోవడానికి వచ్చాం. ఇంటి దగ్గర ఎవ్వరూ లేకపోవడంతో బాబును కూడా తీసుకొచ్చాను. నల్లధనం బయటకు తీయడానికి నోట్ల రద్దు అని చెబుతున్నారు. ఉన్నోళ్లు లేనోళ్లు ఒకటేనా?. మాకు మాత్రమే ఎందుకు ఈ కష్టాలు. – డి.ధనమ్మ, రాజమహేంద్రవరం అనుమతి తీసుకుని వచ్చా మాది గుంటూరు. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాను. డబ్బులు అయిపోయాయి. ప్రిన్సిపాల్ అనుమతి తీసుకుని వచ్చాను. నిన్న మధ్యాహ్నం వచ్చి క్యూలో నిలబడ్డాను. గంట తర్వాత ఏటీఎంలో నగదు అయిపోయింది. తిరిగి ఈ రోజు వచ్చాను. క్లాసులు పోతున్నా తప్పడంలేదు. – వి.పావని, బీఎస్సీ -
పేదలకు అండదండ
⇒ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వ నిర్ణయం ⇒4 లక్షల మందికి లబ్ధి చేకూరే అవకాశం ⇒సర్కారుకు భారీగా ఆదాయం ⇒సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలకు కార్యాచరణ ⇒మెట్రో అలైన్‌మెంట్‌పై మరోమారు సమావేశం సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ప్రభుత్వ స్థలాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న నిరుపేదలకు శుభవార్త. 80 నుంచి 125 చదరపు గజాల విస్తీర్ణంలో ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. సీఎం కేసీఆర్ సమక్షంలో మంగళవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల నగరంలోని సుమారు మూడు లక్షల నిరుపేద కుటుంబాలకు సాంత్వన కలగనుంది. 125 గజాలు దాటిన నిర్మాణాలను సైతం నిర్ణీత రుసుంతో క్రమబద్ధీకరించాలన్న అఖిల పక్షం నిర్ణయంతో మరో లక్ష మందికి మేలు కలగనుంది. గతంలో ఉచితంగా 80 గజాల ఇళ్లను క్రమబద్ధీకరించగా... ఈ మారు దాన్ని 125 గజాలకు పెంచడం విశేషం. గతంలోని నిబంధనలు అడ్డుగా పెట్టుకుని ఒకే కుటుంబ సభ్యులు, కొంతమంది పెద్దలు వివిధ పేర్లతో 80 గజాల స్థలాలను సొంతం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. ఊపందుకోనున్న మెట్రో పనులు సుల్తాన్‌బజార్, అసెంబ్లీ ప్రాంతాల్లో మెట్రో అలైన్మెంట్ మార్పునకు విపక్షాలు అంగీకరించడంతో ఆయా ప్రాంతాల్లో మెట్రో పనులు ఊపందుకోనున్నాయి. సుల్తాన్‌బజార్ నుంచి కాకుండా కోఠి ఉమెన్స్ కళాశాల మీదుగా మెట్రో మార్గం మళ్లనుంది. అసెంబ్లీ వెనక వైపు నుంచి మెట్రో మార్గాన్ని మళ్లించేందుకు అన్ని పక్షాలూ అంగీకారం తెలిపాయి. ఇక జేబీఎస్-ఫలక్‌నుమా (కారిడార్-2) రూట్లో అలైన్మెంట్ మార్పు చేయాల్సిందేనంటూ ఎంఐఎం పట్టుబట్టినట్లు తెలిసింది. లేనిపక్షంలో పాత నగరంలో వెయ్యికి పైగా నిర్మాణాలకు నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేసింది. ఈ విషయమై ఈనెల 16న నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశంలో మరోమారు అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు తెలపాలని సీఎం సూచించారు. దీంతో ఈ మార్గంలో అలైన్మెంట్ మార్పుపై వేచిచూడక తప్పని పరిస్థితి నెలకొంది. కాసుల పంట నగరంలోని యూఎల్సీ భూములను ఆక్రమించుకొని 1400 ఎకరాల్లో నిర్మించుకున్న 33,127 ఇళ్లు, భవనాలు, 200 ఎకరాల్లోని 1927 వాణిజ్య సంస్థలను క్రమబద్ధీకరించడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం ఈ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో సర్కారుకు కాసుల పంట పండనుంది. నగరంలో రెవెన్యూ శాఖ ఇప్పటికే గుర్తించిన యూఎల్సీ భూమి 114.22 ఎకరాలు, ప్రభుత్వ భూమి 25 ఎకరాలను విక్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రైవేటు వ్యక్తులు, సంస్థల కబంధ హస్తాల్లో ఉన్న ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకోవాలని సీఎం అధికార యంత్రాగాన్ని ఆదేశించినట్లు తెలిసింది సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు హుస్సేన్‌సాగర్ చుట్టూ బహుళ అంతస్తుల భ వన నిర్మాణానికి అన్ని పార్టీల నుంచి మద్దతు లభించడంతో ప్రభుత్వం త్వరలోనే ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసే అవకాశాలు ఉన్నాయి. అఖిలపక్ష సమావేశంలో ఇతర అంశాలపై కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ, సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాల నిర్మాణానికి మాత్రం ఎవరి నుంచీ వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అంతేకాకుండా నగర కీర్తిని ఇనుమడింపజేసేందుకు వాటిని నిర్మించాలని అభిప్రాయపడ్డారు. దీంతో పాటు పాటిగడ్డ, నర్సింగ్ కాలేజీ, దిల్కుష్ గెస్ట్ హౌస్, రాఘవ టవర్స్, లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్స్, బుద్ధభవన్ తదితర ప్రాంతాల్లో భారీ టవర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వినాయక సాగర్ నిర్మాణంపై ప్రతిష్టంభన హుస్సేన్‌సాగర్‌లోనే వినాయక నిమజ్జనం చేపట్టాలని బీజేపీ సహా పలు పార్టీలు అఖిలపక్ష సమావేశంలో పట్టుబట్టిన నేపథ్యంలో ఇందిరాపార్క్ దగ్గర వినాయకసాగర్ నిర్మాణంపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ అంశంపైనా ఈనెల 16న జరగనున్న సమావేశంలో స్పష్టత రానుంది. -
అలక్ష్యం
ఒక్క పైసా కట్టొద్దు..నేను అధికారంలోకి వచ్చేస్తున్నా.. మీ కష్టాలన్నీ తీర్చేస్తా.. మీ అప్పులన్నీ అణాపైసలతో సహా మాఫీ చేస్తానంటూ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ప్రచారం ఊదరగొట్టేశారు. తీరా పగ్గాలు చేపట్టగానే అబ్బే మాఫీ కాదు..లక్ష వరకు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని నమ్మబలికారు. ఇప్పుడు ఆ మ్యాచింగ్ గ్రాంట్‌కు కూడా దిక్కులేదు. సంఘానికి రూ.10వేల చొప్పున రివాల్వింగ్ ఫండ్ ఇస్తామంటూ మాఫీకి మంగళం పాడి డ్వాక్రా సంఘాలపై శఠగోపం పెట్టారు. * కొత్త రుణాలు ఇచ్చేందుకు ముఖం చాటేస్తున్న బ్యాంకర్లు * స్త్రీ నిధి రుణాలదీ అదే తీరు * మైక్రో ఉచ్చులో డ్వాక్రా మహిళలు * గగ్గోలు పెడుతున్న నిరుపేదలు * రుణమాఫీ పుణ్యమాని పేరుకుపోయిన బకాయిలు సాక్షి, విశాఖపట్నం: ఇటుక మీద ఇటుక కడుతూ ఇల్లు నిర్మించాలంటే ఆరేడు నెలలు పడుతుంది.. అదే ఇల్లు కూలగొట్టాలంటే కనురెప్పకాలం చాలు. ఇప్పుడు అదే తీరులో ఉంది డ్వాక్రా పొదుపు ఉద్యమం. మూడున్నర దశాబ్దాలుగా నిర్మితమైన ఈ ఉద్యమం సర్కారు తీరుపై కుప్ప కూలే పరిస్థితి ఏర్పడింది. కొండలా పేరుకుపోయిన రుణ బకాయిలు ఒక వైపు.. కొత్త అప్పులు పుట్టక ఆర్థిక ఇబ్బందులు మరో వైపు..వెరసి ప్రైవేటు ఫైనాన్స్ వ్యాపారులు, మైక్రో సంస్థల ఉచ్చులో నిరుపేద మహిళలు చిక్కుకునేలా చేసింది. జిల్లాలో 66,340 డ్వాక్రా సంఘాలున్నాయి. వీటిలో విశాఖ రూరల్ జిల్లా పరిధిలో 45,500 సంఘాలుంటే జీవీఎంసీ పరిధిలో 18,900 సంఘాలున్నాయి. ఇక నర్సీపట్నం, యలమంచిలి పట్టణాల్లో మరో 2,040 సంఘాలున్నా యి. వీటి పరిధిలో సుమా రు ఏడున్నర లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. జీవీఎంసీ పరిధిలోని సంఘాలకు రూ.260 కోట్లు, విశాఖ రూరల్ జిల్లా పరిధిలో రూ.620 కోట్లు, మెప్మా (నర్సీపట్నం, యలమంచలి మున్సిపాల్టీలు) పరిధిలో మరో ఆరు కోట్ల బకాయిలున్నాయి. ఈ రుణాలన్నీ మాఫీ అయిపోతాయని ఆయా సంఘాలు ఇన్నాళ్లు కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తం కాస్తా 14 శాతం వడ్డీతో వెయ్యి కోట్లు దాటి పోయిందని అంచనా. మొత్తం బకాయిలన్నీ వడ్డీతో సహా చెల్లించాలంటూ బ్యాంకర్లు ఒత్తిడి తీసుకొస్తున్నారు. కొన్ని బ్యాంకులైతే మరొకడుగు ముందుకేసి సంఘాల పొదుపు ఖాతాలో ఉన్న సొమ్మును జమచేసుకుంటున్నాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే మీ బకాయిలు చెల్లించండి.. లేదా వడ్డీ అయినా చెల్లించండంటూ లేకుంటే ఎంతకాలం ఎదురు చూస్తాం.. అంటూ నిలదీస్తున్నారు. అధికారులకు మొరపెట్టుకుంటే ఈవాళ కాకపోతే రేపైనా ప్రభుత్వం ప్రకటిస్తున్న మ్యాచింగ్ గ్రాంట్ మీ అకౌంట్లో జమవుతుంది కదా.. అప్పటివరకు ఎదురు చూస్తే మీ రుణాలపై వడ్డీ భారం తడిసి మోపెడవుతుంది..తక్షణమే చెల్లించండి లేకపోతే మీకే ఇబ్బంది అంటూ ఉచిత సలహా ఇస్తున్నారు. ఇటీవల విశాఖ కైలాసగిరిలో నిర్వహించిన కార్తీక వనసమారాధన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబును మహిళా సంఘాలు నిలదీస్తే మీ మ్యాచింగ్ గ్రాంట్ కోసమే ఆలోచిస్తున్నాం.. అందకా ఒక్కొక్క సంఘానికి రూ.10వేల చొప్పున రివాల్వింగ్ ఫండ్ రిలీజ్ చేయమని చెప్పాను..ఈ లోగా మీ రుణాలు చెల్లించేయండి అని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పది శాతం దాటని లక్ష్యం ఈ ఆర్థిక సంవత్సరంలో జీవీఎంసీ పరిధిలో రూ.155 కోట్లు, మెప్మా పరిధిలో రూ.19 కోట్లు, విశాఖ రూరల్ జిల్లా పరిధిలో రూ.581 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఎనిమిది నెలలు గడుస్తున్నా కనీసం 10 శాతం రుణ లక్ష్యం కూడా దాటని దుస్థితి నెలకొంది. ఇప్పటి వరకు జీవీఎంసీ పరిధిలోని సంఘాలకు రూ.48 కోట్లు రుణాలు ఇస్తే, రూరల్ జిల్లా పరిధిలోని సంఘాలకు రూ.51 కోట్లు, మెప్మా పరిధిలోని సంఘాలకు రూ. 5 కోట్ల మేర మాత్రమే రుణాలివ్వగలిగారు. ఈ లెక్కన రూ.755కోట్ల రుణాలు మంజూరు చేయాల్సి ఉండగా,ఇప్పటి వరకు అతికష్టమ్మీద రూ.104 కోట్ల రుణాలు మాత్రమే ఇవ్వగలిగారు. ఇక మిగిలింది నాలుగునెలలు మాత్రమే. ఆర్థికసంవత్సరం ముగిసేలోగా రూ.650 కోట్ల రుణాలు ఇవ్వడం కష్టసాధ్యమే. మరో పక్క కుటుంబ అవసరార్థం సంఘాల పరిధిలో రుణాలు తీసుకునే అవకాశం ఉన్న స్త్రీ నిధి రుణాల పరిస్థితి కూడా అదే రీతిలో ఉంది. గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన ఈ పథకం ద్వారా ఈ ఏడాది కేవలం 262 సంఘాలకు రూ.2 కోట్లు మాత్రమే రుణాలివ్వగలిగారు. మరో పక్క ఈ రుణాలకు కూడా ప్రస్తుతం 14 శాతం వడ్డీ వసూలు చేస్తుండడం వీరికి పెనుభారంగా పరిణమించింది. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు పాపం ‘బాబు’ మాయమాటలు నమ్మి డ్వాక్రా మహిళలు పదినెలలుగా వాయిదాలు చెల్లించడం మానేశారు. దీంతో వడ్డీ లేని రుణం కాదు కదా కనీసం పావలా వడ్డీ రాయితీని కూడా కోల్పోయారు. ఇప్పుడు 14 శాతం వడ్డీతో బకాయి మొత్తాన్ని చెల్లించాలంటూ బ్యాంకర్లు ఒత్తిడి తీసుకొస్తున్నారు. సర్కార్ గద్దెనెక్కి ఆర్నెల్లు దాటింది. రుణాలు మాఫీ కాలేదు.. కనీసం మ్యాచింగ్ గ్రాంట్ జమకాలేదు. ఒక పక్క బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. ఈ బకాయిలు చెల్లిస్తే కానీ కొత్త రుణాలు మంజూరు చేయబోమని బ్యాంకర్లు తెగే సి చెబుతున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని దుస్థితిలో డ్వాక్రా సంఘాలు కొట్టుమిట్టాడుతున్నారు. ఉచ్చు బిగిస్తున్న మైక్రో సంఘాలు ఇన్నాళ్లు బ్యాంకర్లు ఇబ్బడి ముబ్బడిగా రుణాలు మంజూరు చేసేవి. దీంతో మైక్రో సంఘాలు, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు కాళ్లావేళ్లాపడినా వీరి వడ్డీ బాదుడుకు జడిసి ఎవరూ వీరి వద్ద రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపేవారు కాదు.. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. బ్యాంకర్లు ముఖం చాటేస్తుండడంతో వ్యాపార, కుటుంబ అవసరాల నిమిత్తం డ్వాక్రా సంఘాలు మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, మైక్రోఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. వారికి అవసరం ఉన్నా లేకున్నా ఇళ్లకు వెళ్లి మరీ రుణాలందించడం మొదలు పెట్టారు. ఐదురూపాయలు..పది రూపాయల వడ్డీలు వసూలుచేస్తున్నా తమ అవసరాల కోసం వీర్ని ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. బేషరతుగా రుణమాఫీ అమలుచేయాలని లేకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోతున్న తమకు ఆత్మహత్యలే శరణ్యమని పలు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా రుణమాఫీ చేయడం లేదా..నిర్దిష్ట గడువులోగా రూ. లక్ష చొప్పున మ్యాచింగ్ గ్రాంట్యినా రిలీజ్ చేయాలని డ్వాక్రా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రూ.2లక్షలు బాకీ ఉన్నాం డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పడంతో ఐదు నెలలు వాయిదాలు చెల్లించలేదు. దీనివల్ల మా గ్రూ పులో ఇంకా ఇచ్చిన రుణంలో అస లు రూ.2 లక్షలు ఉండిపోయింది. దీనికి రూ.30 వేల వరకు వడ్డీ పడుతోందని చెబుతున్నారు. ఇలా అయి తే బయట వడ్డీలకు తెచ్చి రుణాలు చెల్లించడమే. -కాగిత అంబిక, మాకవరపాలెం -
రూ.30కే కిలో బియ్యం
నర్సాపూర్: పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30కే కిలో బియ్యం పథకం చేపట్టిందని స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిలో రూ.30కే బియ్యం కౌంటర్‌ను ఆయన జిల్లా పరిషత్ చైర్పర్సన్ రాజమణి మురళీధర్ యాదవ్‌తో కలిసి స్థానిక రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరువుతో ధరలు పెరిగినందున పేదలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం నిర్ణీత ధర కు బియ్యం అందేలా చర్యలు తీసుకుందని చెప్పారు. అందులో భాగంగా బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ రమణారావు, తహశీల్దార్ అన్వర్ మహమ్మద్, టీఆర్ఎస్ నాయకులు మురళీధర్ యాదవ్, రామాగౌడ్, రైస్‌మిల్లర్స్ జిల్లా మాజీ అధ్యక్షుడు కిషన్‌రావు, గౌరవ ఆధ్యక్షుడు మల్లారెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు ర్యాక వెంకటేశం, అశోక్, నోముల పాండు, శ్రీనివాస్, రాంరెడ్డి, సర్వర్ ఖా న్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రైస్ మిల్లర్లు మదన్‌రెడ్డి, రాజమణిని ఘనంగా సన్మానించా రు. జెడ్పీ చైర్‌పర్సన్‌కు సన్మానం నర్సాపూర్:జిల్లాపరిషత్ చైర్పర్సన్ ఎ.రాజమణిని సోమవారం నర్సాపూర్‌లోని రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. జిల్లా అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కె. కిషన్‌రావు, నర్సాపూర్ అసోసియేషన్ గౌరవఅధ్యక్షుడు మల్లారెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్, డెరైక్టర్ అశోక్, ఇతర ప్రతినిధులు మల్లారెడ్డి,రాంరెడ్డి ఆమెను ఘనంగా సన్మానించారు. ఆమె హయాంలో జిల్లా అభివృద్ధి చెందగలదనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆమె భర్త టీఆర్ఎస్ నాయకుడు మురళీధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల సంక్షేమానికి కృషి
సాక్షి, న్యూఢిల్లీ: పేద, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అన్నారు. 45 పునరావాస కాలనీల్లో నివసిస్తున్నవారికి యాజమాన్య హక్కులు కల్పించడంతోపాటు పలు అనధికారిక కాలనీలను క్రమబద్ధీకరించామన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు అవసరమైన ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. దీంతోపాటు ఆహార భద్రత బిల్లు అమలుతో ఢిల్లీలోని 32 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు యూపీఏ ప్రభుత్వం తోపాటు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఆహార ధాన్యాలు అత్యంత చౌకధరలకు పంపిణీ చేస్తున్నట్టు తెలి పారు. పేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉచి తంగా 151 అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చినట్టు షీలా పేర్కొన్నారు. ఆహార భద్రత బిల్లు, అన్నశ్రీయోజన పథకాలతో రాజధాని నగరంలోని మహిళల స్థాయిని పెంచామన్నారు. రఘుబీర్‌నగర్ కాలనీలో మోడ్రన్ కమ్యూనిటీహాల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థాని కులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలి పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేశంలోని అన్నిరాష్ట్రాల కన్నా ఎక్కువ వృద్ధాప్య పింఛన్లు ఢిల్లీలోనే ఇస్తున్నామన్నారు. మహిళలు సాధికారత సాధించేలా వారికి అన్ని వ న రులు కల్పిస్తున్నామన్నారు. కొత్తగా నిర్మించనున్న కమ్యూనిటీ సెంటర్‌ను రూ.2.20 కోట్లతో పూర్తిగా ఎయిర్ కండిషన్‌గా మారుస్తామన్నారు. షీలాదీక్షిత్ ఆధ్వర్యంలో 15ఏళ్లలో ఢిల్లీ ఎంతో అభివృద్ధి చెందిందని స్థానిక ఎంపీ మహాబల్ మిశ్రా అన్నారు. త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మలారామ్ గంగ్వాల్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణానికి ఈ-రిక్షాలు మేలు ఈ-రిక్షాల వాడకంతో పర్యావరణానికి మేలు జరగడంతోపాటు అత్యంత సమీపదూరాలు ప్రయాణించేవారికి సౌకర్యంగా ఉంటుందని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పేర్కొన్నారు. ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ఈ-రిక్షాలు అందుబాటులోకి రావడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాటరీతో నడిచే ఈ-రిక్షాలతో వాయు కాలుష్య స్థాయి సైతం తగ్గుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. శనివారం తన నివాసంలో కలసిన ఈ-రిక్షాడ్రైవర్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తమకు కల్పిస్తున్న సదుపాయాలపై రిక్షా డ్రైవర్లు సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. మెట్రోస్టేషన్లకు సమీప కాలనీల నుంచి వెళ్లేందుకు అత్యంత అనువైన రవాణా సాధనంగా ఈ-రిక్షాలున్నాయని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరగనుందని చెప్పారు. అన్ని స్టాక్ హోల్డర్లతో మాట్లాడి ఈ-రిక్షా కొనుగోళ్లకు సంబంధించి విధివిధానాలు నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు.