పేదల సంక్షేమానికి కృషి
Published Sat, Sep 14 2013 11:43 PM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM
సాక్షి, న్యూఢిల్లీ: పేద, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అన్నారు. 45 పునరావాస కాలనీల్లో నివసిస్తున్నవారికి యాజమాన్య హక్కులు కల్పించడంతోపాటు పలు అనధికారిక కాలనీలను క్రమబద్ధీకరించామన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు అవసరమైన ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. దీంతోపాటు ఆహార భద్రత బిల్లు అమలుతో ఢిల్లీలోని 32 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు యూపీఏ ప్రభుత్వం తోపాటు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఆహార ధాన్యాలు అత్యంత చౌకధరలకు పంపిణీ చేస్తున్నట్టు తెలి పారు.
పేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఉచి తంగా 151 అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చినట్టు షీలా పేర్కొన్నారు. ఆహార భద్రత బిల్లు, అన్నశ్రీయోజన పథకాలతో రాజధాని నగరంలోని మహిళల స్థాయిని పెంచామన్నారు. రఘుబీర్‌నగర్ కాలనీలో మోడ్రన్ కమ్యూనిటీహాల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థాని కులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలి పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దేశంలోని అన్నిరాష్ట్రాల కన్నా ఎక్కువ వృద్ధాప్య పింఛన్లు ఢిల్లీలోనే ఇస్తున్నామన్నారు. మహిళలు సాధికారత సాధించేలా వారికి అన్ని వ న రులు కల్పిస్తున్నామన్నారు. కొత్తగా నిర్మించనున్న కమ్యూనిటీ సెంటర్‌ను రూ.2.20 కోట్లతో పూర్తిగా ఎయిర్ కండిషన్‌గా మారుస్తామన్నారు. షీలాదీక్షిత్ ఆధ్వర్యంలో 15ఏళ్లలో ఢిల్లీ ఎంతో అభివృద్ధి చెందిందని స్థానిక ఎంపీ మహాబల్ మిశ్రా అన్నారు.
త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మలారామ్ గంగ్వాల్ తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణానికి ఈ-రిక్షాలు మేలు
ఈ-రిక్షాల వాడకంతో పర్యావరణానికి మేలు జరగడంతోపాటు అత్యంత సమీపదూరాలు ప్రయాణించేవారికి సౌకర్యంగా ఉంటుందని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పేర్కొన్నారు. ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ఈ-రిక్షాలు అందుబాటులోకి రావడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాటరీతో నడిచే ఈ-రిక్షాలతో వాయు కాలుష్య స్థాయి సైతం తగ్గుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. శనివారం తన నివాసంలో కలసిన ఈ-రిక్షాడ్రైవర్లతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. తమకు కల్పిస్తున్న సదుపాయాలపై రిక్షా డ్రైవర్లు సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. మెట్రోస్టేషన్లకు సమీప కాలనీల నుంచి వెళ్లేందుకు అత్యంత అనువైన రవాణా సాధనంగా ఈ-రిక్షాలున్నాయని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరగనుందని చెప్పారు. అన్ని స్టాక్ హోల్డర్లతో మాట్లాడి ఈ-రిక్షా కొనుగోళ్లకు సంబంధించి విధివిధానాలు నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు.
Advertisement
Advertisement