=భక్తజనసంద్రమైన జీడికల్
=హాజరైన కర్ణాటక పీఠాధిపతి మహాస్వామీజీ
=తలంబ్రాలు తీసుకువచ్చిన ఎమ్మెల్యే రాజయ్య
జీడికల్(లింగాలఘణపురం), న్యూస్‌లైన్ : మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు హాజరై కల్యాణ క్రతువును కనులారా తిలకించి భక్తిపారవశ్యంతో పొంగిపోయారు. ఏడాదిలో శ్రీరామ నవమి రోజున దేశవ్యాప్తంగా శ్రీరాముని కల్యాణం నిర్వహించ డం ఆనవాయితీ. జీడికల్‌లో మాత్రం నవమితోపాటు కార్తీక మాసంలో బ్రహోత్సవాలు నిర్వహించడం విశేషం.
యాదగిరి లక్ష్మీనరిసింహస్వామి ఆల యం నుంచి పంపిన పట్టువస్త్రాలు, తలంబ్రాలను మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఎమ్మెల్యే రాజయ్య, గ్రామ సర్పంచ్ అవ్వారు శ్యాంప్రసాద్, ఇన్‌చార్జ్ ఈఓ సదానందం తీసుకురాగా వేదపండితులు యాదగిరిస్వామి, బాలనర్సయ్య సీతారాముల కల్యాణం ప్రారంభించారు. రెండు గంటల పాటు 43 మంది కల్యాణ దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. జగదబిరాముడి వివాహ వేడుకను వేలాది మంది భక్తులు తిలకించి పులకించి పోయారు.
హాజరైన ప్రముఖులు
కల్యాణోత్సవానికి కర్ణాటక రాష్ట్రానికి చెందిన పరమహంస మహాస్వామిజీతోపాటు ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాజారపు ప్రతాప్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నాగేందర్, మాజీ చైర్మన్ నాగబండి సుదర్శనం, నాయకులు మనోహర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ హేమలత తదితరులు హాజరయ్యారు. దేవాలయ సిబ్బంది అతిథులకు పూర్ణకుంభతో స్వాగతం పలికారు. భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ల సేవలు
జీడికల్ జాతరలో జనగామ ఏబీవీ డిగ్రీ కళాశాలకు చెందిన 30 మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు సేవలు అందించారు. గర్భగుడిలో భక్తులను క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఎన్‌సీసీ ఏఎన్‌ఓ బి.రాజయ్య, ప్రిన్సిపాల్ బాలశేఖర్, ఎస్‌యూ ఓ నవీన్, క్యాడెట్లు తిరుపతి, సాయిరాం, వెంకటేశ్, రాజు, సాగర్, రాంగోపాల్, నవీన్‌తోపాటు పలువురు భక్తుల సేవలో తరించా రు. వెంకటేశ్వర ధార్మిక మండలి భజనలు, రాత్రి హరికథా కాలక్షేపం నిర్వహిస్తున్నట్లు భజన మండలి అధ్యక్షుడు సిద్ధేశ్వర్ తెలిపారు. ఎస్సై మధుకర్ ఆధ్వర్యంలో పోలీసులు శాంతి భద్రతలను పర్యవేక్షించారు.
కమనీయం సీతారాముల కల్యాణం
Published Sat, Nov 23 2013 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM
Advertisement
Advertisement