తెలుగు జాతి క్షమించదు | Telugu People for Never Give | Sakshi
Sakshi News home page

తెలుగు జాతి క్షమించదు

Published Thu, Oct 22 2015 5:32 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Telugu People for Never Give

రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీని మాటవరసకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అడగక పోవడం దురదృష్టకరమని జన చైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో తిరుపతి సభలో 10 సంవత్సరాలు ప్రత్యేక హాదా హామీ ఇచ్చిన సంగతి గుర్తు చేశారు.

బీజేపీ, కాంగ్రెస్ తో చేతులు కలిపి తెలుగు జాతిని విచ్ఛిన్నం చేసిందని.. తెలుగు జాతి వారిని ఎన్నడూ క్షమించదని అన్నారు. ప్రజల్లో మతాచారాలను, భావోద్వేగాలను రెచ్చగొట్టి.. మట్టి, నీరు తెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణంలో పంటల విధ్వంసం, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రధాని ప్రశ్నించక పోవడం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎంత ప్రజాధనాన్ని వెచ్చించారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement