తిరుమలలో టెంపో ట్రావెలర్ దగ్ధం | Tempo traveller burnt on Road | Sakshi
Sakshi News home page

తిరుమలలో టెంపో ట్రావెలర్ దగ్ధం

Published Fri, Oct 9 2015 6:38 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

తిరుమలలోని గరుడాద్రి నగర్‌లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ టెంపో ట్రావెలర్ వాహనం శుక్రవారం సాయంత్రం దగ్ధమైంది.

తిరుమల : తిరుమలలోని గరుడాద్రి నగర్‌లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ టెంపో ట్రావెలర్ వాహనం శుక్రవారం సాయంత్రం దగ్ధమైంది. 11 మంది తమిళనాడు భక్తులతో వాహనం తిరుమల నుంచి తిరుపతికి బయలుదేరగా.. జీఎంసీ టోల్‌ గేట్ దాటిన వెంటనే అకస్మాత్తుగా వాహనంలో మంటలు లేచాయి. డ్రైవర్ అప్రమత్తమై వెంటనే వాహనాన్ని నిలిపివేయగా, అందులోని వారందరూ దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement