పూరిపాకకు పదివేల విద్యుత్ బిల్లా..! | Ten thousand rupees electric bill to a small hut | Sakshi
Sakshi News home page

పూరిపాకకు పదివేల విద్యుత్ బిల్లా..!

Published Sun, Jun 8 2014 1:10 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM

పూరిపాకకు  పదివేల విద్యుత్ బిల్లా..! - Sakshi

పూరిపాకకు పదివేల విద్యుత్ బిల్లా..!

కారంచేడు, న్యూస్‌లైన్ : అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని సందర్భాల్లో పేదలకు చిరిచెమటలు పడుతుంటాయి. పూరిపాకలో నివసిస్తున్న ఓ పేద వ్యక్తికి ఏకంగా పదివేల రూపాయలు కట్టమని విద్యుత్ బిల్లు రావడంతో ఆయన లబోదిబోమంటున్నాడు. మండలంలోని కుంకలమర్రు ఎస్సీ కాలనీకి చెందిన తలకాయల ఆదాంకు విద్యుత్ సిబ్బంది అక్షరాలా రూ.10,154లు కట్టమని బిల్లు చేతిలో పెట్టారు. గతంలో నెలకు రూ.150 నుంచి 200 వరకు బిల్లు వచ్చేది. విద్యుత్ మీటరు జంప్ అవుతోందని, మీటరు మార్చాలని కారంచేడు ఏఈకి బాధితుడు మొరపెట్టుకున్నా ఫలితం లేదు.
 
 బిల్లు కట్టాల్సిందేనని విద్యుత్ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు ఆదాం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పూరిపాకలో టీవీ, ఒక ఫ్యాను, రెండు బల్బులు మాత్రమే ఉన్న తనకు ఇంత బిల్లు రావడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నాడు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తనకు ఇంత బిల్లు వచ్చిందని, సమస్య పరిష్కరించి తనకు న్యాయం చేయాలని ఆదాం కోరుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement