Ten thousand rupees
-
పదివేల రూపాయలకే ఆక్సిజన్ యంత్రం!
కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనే లక్ష్యంతో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన యంత్రాన్ని తయారు చేశారు. పరిసరాల్లోని గాల్లోంచి శుద్ధమైన ఆక్సిజన్‌ను తయారుచేసే ఈ యంత్రం గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం మార్కెట్లో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఒక్కొక్కటి రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు ఖరీదు చేస్తాయి. అయితే అందుబాటులో ఉన్న పదార్థాలతోనే చౌకైన ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాన్ని తయారుచేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని ఐఐఎస్సీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ ప్రవీణ్ రామమూర్తి గుర్తించారు. ఇందుకు తగ్గట్టుగా డాక్టర్ అరుణ్‌రావు, కె.భాస్కర్‌తో కలిసి పదివేల రూపాయలు ఖరీదుచేసే ఆక్సిజన్ తయారీ యంత్రాన్ని సిద్ధం చేశారు. మనం పీల్చే గాలిలో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు. కచ్చితంగా చెప్పాలంటే దాదాపు 78 శాతం నైట్రోజన్ ఉంటే 21 శాతం ఆక్సిజన్ ఉంటుంది. మిగిలిన ఒక శాతంలో కొన్ని ఇతర వాయువులు ఉంటాయి. ఈ గాలి ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన యంత్రంలోకి ప్రవేశించినప్పుడు అవి జియోలైట్ అనే పదార్థం గుండా ప్రయాణిస్తాయి. చౌకగా లభించే ఈ జియోలైట్ గాల్లోని నైట్రోజన్‌ను పీల్చుకునే లక్షణం కలది. అంటే.. యంత్రం నుంచి బయటకు వచ్చే గాలిలో ఆక్సిజన్ మోతాదు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ యంత్రాన్ని తయారు చేసిన తరువాత మార్కెట్లో లభించే వాటర్ ఫిల్టర్లను ఉపయోగించి దాన్ని జియోలైట్‌తో నింపారు. ప్రస్తుతం ఈ యంత్రం ద్వారా 70 శాతం స్వచ్ఛతతో కూడిన ఆక్సిజన్ వెలువడుతుండగా.. దీన్ని 90 శాతానికి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యంత్రం నిర్వహణకు తాము అర్డినో కంప్యూటర్ బోర్డులను వాడామని ప్రొఫెసర్ రామమూర్తి తెలిపారు. -
కదం తొక్కిన ఆశ వర్కర్లు
సుల్తాన్‌బజార్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్నట్లు తమకు కూడా రూ.10,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని కోరుతూ ఆశ వర్కర్లు తలపెట్టిన ‘తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడి’కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌లోని కోఠి డీఎంఈ కార్యాలయానికి వస్తున్న ఆశ వర్కర్లను సుల్తాన్ బజార్ పోలీసులు కోఠి డీఎంహెచ్ఎస్ గేటు వద్ద అడ్డుకున్నారు. 865 మంది ఆశా వర్కర్లతో పాటు సీఐటీయూ నాయకులను అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు. ఘటనపై 8 కేసులను నమోదు చేశారు. తమ హక్కుల కోసం నిరసన తెలిపేందుకు వస్తున్న ఆశ వర్కర్లను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారని తెలంగాణ ఆశ యూనియన్ అధ్యక్షురాలు పి.జయలక్ష్మి ఆరోపించారు. ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ శుక్రవారం (13న) రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, 19న కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేస్తామని వెల్లడించారు. -
పూరిపాకకు పదివేల విద్యుత్ బిల్లా..!
కారంచేడు, న్యూస్‌లైన్ : అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొన్ని సందర్భాల్లో పేదలకు చిరిచెమటలు పడుతుంటాయి. పూరిపాకలో నివసిస్తున్న ఓ పేద వ్యక్తికి ఏకంగా పదివేల రూపాయలు కట్టమని విద్యుత్ బిల్లు రావడంతో ఆయన లబోదిబోమంటున్నాడు. మండలంలోని కుంకలమర్రు ఎస్సీ కాలనీకి చెందిన తలకాయల ఆదాంకు విద్యుత్ సిబ్బంది అక్షరాలా రూ.10,154లు కట్టమని బిల్లు చేతిలో పెట్టారు. గతంలో నెలకు రూ.150 నుంచి 200 వరకు బిల్లు వచ్చేది. విద్యుత్ మీటరు జంప్ అవుతోందని, మీటరు మార్చాలని కారంచేడు ఏఈకి బాధితుడు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. బిల్లు కట్టాల్సిందేనని విద్యుత్ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు ఆదాం ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పూరిపాకలో టీవీ, ఒక ఫ్యాను, రెండు బల్బులు మాత్రమే ఉన్న తనకు ఇంత బిల్లు రావడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నాడు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తనకు ఇంత బిల్లు వచ్చిందని, సమస్య పరిష్కరించి తనకు న్యాయం చేయాలని ఆదాం కోరుతున్నాడు. -
కనీస వేతనం పదివేలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ ఉపాధ్యాయులకు కనీస వేతనం పది వేల రూపాయలు చేయాలంటూ సీఐటీయూ అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో మంగళవారం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. సుధాభాస్కర్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రోజా మాట్లాడుతూ, పని గంటలు పెంచిన ప్రభుత్వం వేతనాలను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. పెన్షన్‌తో సహా పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. బీఎల్ఓ డ్యూటీ నుంచి మినహాయించాలని కోరారు. వారంరోజుల్లోగా తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. దీక్షకు ఎమ్మెల్సీలు బాలసుబ్రమణ్యం, బొడ్డు నాగేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, రైతు సంఘం కార్యదర్శి చంద్రారెడ్డి, సీఐటీయూ ప్రతినిధులు పాల్గొన్నారు. అంగన్వాడీలను క్రమబద్ధీకరించాలి: సీపీఎం అంగన్వాడీ కార్యకర్తల దీక్షకు మద్దతు తెలిపిన సీపీఎం.. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న లక్షా 80 వేల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు నేతృత్వంలో పార్టీ ప్రతినిధులు ముఖ్యమంత్రిని మంగళవారం క్యాంప్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అంగన్వాడీల కనీస వేతనాన్ని పదివేల రూపాయలకు పెంచాలని కోరారు.