సాక్షి, అనంతపురం : జిల్లాలోని తాడిపత్రిలో ప్రేమ వ్యవహారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. లక్ష్మీ, రఘు అనే యువతి, యువకులు ప్రేమించుకుని ఇటీవలే కులాంతర వివాహం చేసుకున్నారు. దీనిపై పెద్దలు పోలీసు స్టేషన్‌లో పంచాయతీ పెట్టించి ఆ జంటను విడదీశారు. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మీ ఆత్మహత్య చేసుకుంది.
అనంతరం రఘు కుటుంబ సభ్యులు, బంధువులు స్థానిక టీడీపీ నేతలతో కలిసి లక్ష్మీని ఆమె తల్లిదండ్రులే హత్య చేశారంటూ తాడిపత్రి పోలీసు స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. పోలీసు జీపు అద్దాలను పగలగొట్టి స్టేషన్‌లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. టీడీపీ నేతలు మీడియా ప్రతినిధులపై దౌర్జనానికి పాల్పడ్డారు. ప్రేమ వ్యవహారాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment