చిత్తూరు మునిసిపల్ ఎన్నికల్లో గందరగోళం | tension prevailed in chittoor municipal elections | Sakshi
Sakshi News home page

చిత్తూరు మునిసిపల్ ఎన్నికల్లో గందరగోళం

Published Thu, Jul 3 2014 9:47 AM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM

చిత్తూరు మునిసిపల్ ఎన్నికల్లో గందరగోళం

చిత్తూరు మునిసిపల్ ఎన్నికల్లో గందరగోళం

మదనపల్లి మునిసిపల్ ఎన్నికలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మునిసిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నా.. తమ వద్ద ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారంటూ టీడీపీ ప్రగల్భాలు పలుకుతోంది. విజయం తమదేనని చెబుతోంది. ప్రలోభాలకు లోను చేయడం ద్వారా మునిసిపాలిటీని కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తోంది.

మరోవైపు ఇదే జిల్లా నగరి మునిసిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇండిపెండెంట్ సభ్యులను టీడీపీ ప్రలోభాలకు గురిచేస్తోంది. పుత్తూరు, నగరి చైర్మన్ ఎన్నికల్లో అభ్యర్థులను తాను పంపే కవర్లో సూచించినవారినే ఎన్నుకోవాలంటూ టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు మెలిక పెట్టారు. అయితే అందుకు టీడీపీలోని కొన్ని వర్గాలు ససేమిరా అంటున్నాయి. దాంతో ఇక్కడ టీడీపీలోని రెండు వర్గాల మధ్య వివాదం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement