muddu krishnama naidu
-
ట్రంప్ పిలిస్తేనే వెళతారా? కలెక్టర్ పిలిస్తే రారా..
ఆయన ముఖం ప్రశాంతతకు చిహ్నం. పెదవిపై చిరునవ్వు... ఏ విషయాన్నైనా సావధానంగా వినడం... వాటికి సున్నితంగా సమాధానం చెప్పడం... ఇష్టం లేకుంటే ముభావంగా ఉండటం... ఇదీ నిత్యం మనం చూసే మన జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ విధానం. అంతటి శాంతస్వభావుడు ఒక్కసారిగా ఆగ్రహోదగ్రుడయ్యారు. ముఖం ఎర్రగా మారిపోయింది. తూటాల్లాంటి మాటలతో చెలరేగిపోయారు. టాప్ లేచిపోతుందా అన్నట్లు కేకలు వేశారు. ఏం చేస్తారోనన్న భయం కలిగించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన సమీక్ష సమావేశం ఇందుకు వేదికైంది. విజయనగరం గంటస్తంభం: ‘జిల్లాలో కలెక్టరు ఎందుకున్నారు? కలెక్టరుకు చెప్పాల్సిన అవసరం ఉందా? లేదా? జిల్లా పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌గారు పిలిస్తేనే వెళతారా? కలెక్టర్ పిలిస్తే రారా... మనిషికి స్వర్గం, నరకం ఉంటాయంటారు... నాకు నరకం చూపిస్తున్నారు... ప్రిపేర్ కాకుండా సమావేశానికి వచ్చేశారు? ఇది సమావేశం అనుకుంటున్నారా? ఆటలు పాటలు కార్యక్రమం అనుకుంటున్నారా?’ అంటూ కలెక్టర్ వివేక్‌యాదవ్ ఆగ్రహం తో ఊగిపోయారు. అధికారుల నిర్లిప్తతపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణుమనాయుడు ఆధ్వర్యంలో శాసనమండలి హామీల కమిటీ జిల్లాలో సోమవారం పర్యటించింది. సభలో ఇచ్చిన హామీల అమలుపై కమిటీ సమీక్షించనుంది. ఇందులో భాగంగా జిల్లాకు సంబంధించి ఇచ్చిన 33 హామీల గురించి సమీక్షించేందుకు సంబంధిత అధికారులతో ముందుగా కలెక్టర్ సమావేశమయ్యారు. అధికారుల వైఖరి ఆయన్ను తీవ్రంగా బాధించింది. అంతే వారి వైఫల్యాలపై తీవ్ర స్వరంతో మండిపడ్డారు. విద్యాశాఖలో ఉ పాధ్యాయ నియామకాలకు సంబంధించి జరిగిన చర్చలో డిప్యూటీ డీఈవోను జిల్లాలో డీఎస్సీలో భర్తీ చేస్తున్న పోస్టులపై ప్రశ్నించగా ఆయన సరైన సమాధానం చెప్పకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం మొదలైంది. సమాచారం లేకుండా ఎలా వచ్చారని, తెలియనపుడు సూపరింటెడెంట్‌ను తీసుకుని రావాల్సిందని మండిపడ్డారు. తర్వాత అదనపు తరగతి గదుల నిర్మాణం విషయంలో ఎస్ఎస్ఏ పీవో లక్ష్మణరావుపై విరుచుకుపడ్డారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రతిపాదనలు తనకు తెలియకుండా జెడ్పీ సమావేశంలో తెలియజేయడంపై మండిపడ్డారు. కలెక్టర్‌కు తెలియకుండా ఎలా వెల్లడిస్తారని ప్రశ్నించారు. ఆ సమాచారం తాను సమాచార హక్కు చట్టంలో తెలుసుకోవాలా? అంటూ నిప్పులు చెరిగారు. మత్స్యకారులకు జెట్టీల ఏర్పాటు విషయాన్ని మత్స్యశాఖ డీడీని ప్రశ్నించగా ఆయన మంత్రి ప్రతిపాదనలు పంపారనడంతో ఆశ్చర్యపోతూ మంత్రి ప్రతిపాదనలు చేస్తారా? పాలన గురించి తెలుసుకోండి... ఇలా ఎలా ఉద్యోగం చేస్తున్నారంటూ చిర్రెత్తిపోయారు. జలవనరులశాఖ ఎస్ఈపై ఫైర్ నీరుచెట్టు బిల్లుల పెండింగ్ ఎంత ఉందో తెలియని బొ బ్బిలి జలవనరులశాఖ ఎస్ఈపై కేకలు వేశారు. తెలి యకపోతే తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా అంటూ నిలదీశారు. అందరూ మోసం చేయడానికి ఇక్కడకు వ చ్చారంటూ నిట్టూర్చారు. ఎస్సీ కుల «ధ్రువీకరణ పత్రాలపై కేసుల విషయంలో డీఆర్వో రాజ్‌కుమార్‌ను సై తం గట్టిగా ప్రశ్నించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో క్రమశిక్షణ చర్యలకు సంబంధించి పెండింగ్ లేవంటూ ట్రైబుల్ వెల్ఫేర్ డీడీ చెప్పడంతో అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ‘అంతా సక్రమంగా ఉంది... అధికారులు పని చేయడం లేదు... మీరు నిద్రపోతున్నారు... అంతే’ అన్నారు. పీఐఏ ఈఈ సమావేశానికి రాకపోవడంపై మండిపడుతూ ‘కలెక్టరు పిలిస్తే రారా, మీరేమైనా రాష్ట్రపతి అనుకుంటున్నారా? ట్రంప్‌గారు పిలిస్తే వెళతారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం చేయాలని ఉందా? లేదా? వక్స్ బోర్డు భూములకు రక్షణపై మైనార్టీ వెల్ఫేర్ ఇన్స్పెక్టరు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో నీ వయస్సు ఎంత? ఎంత సర్వీసు ఉంది అంటూ ప్రశ్నించారు. సర్వీసంతా ఉద్యోగం చేయాలని ఉందా? లేదా? అని మండిపడ్డారు. ట్రైబుల్ వెల్ఫేర్ ఎస్డీసీ, సాంఘిక సంక్షేమశాఖ డీడీ, ఇతర అధికారులపై సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరంతా సుఖంగా ఉండాలి. శరీరం అలిసిపోకూడదు... కలెక్టరు మాత్రం పని చేయాలి. మాకు విజయవాడలో కూర్చోబెట్టి క్లాస్ పీకారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి రాని ఎక్సైజ్ సూరెండెంట్, మైనార్టీ ఏడీ, ఆర్అండ్బి ఈఈ, పీఐఏలకు నోటీసులు ఇవ్వాలని డీఆర్వోను ఆదేశించారు. అనుమతి లేకుండా వెళ్లిన అధికారులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని సూచించారు. ఈఎస్ ఏమయ్యారు? హామీల అమల్లో ఎక్కువ అంశాలున్న ఎక్సైజ్ అధికారులపైనా మండిపడ్డారు. యారక్ ఆపేయడంతో కుటుంబా లకు పరిహారం ఇవ్వాలని కలెక్టర్‌కు ప్రతిపాదిస్తూ చేతులు దులుపుకోవడంతో లబ్ధిదారులను ఎవరు గుర్తిస్తారని కలెక్టర్ ప్రశ్నించారు. ఆయా కుటుంబాల గురించి సహాయ ఈఎస్ శంభు ప్రసాద్ చెప్పలేకపోవడంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎక్కడని ప్రశ్నించారు. కమిషనరు సమావేశానికి విజయవాడ వెళ్లారని చెప్పడంతో ఎవరిని అడిగి వెళ్లారని మండిపడ్డారు. కలెక్టరును అడగాలా? వద్దా? అంటూ నిలదీశారు. ‘శంభుప్రసాద్‌గారు... మీరే చెప్పం డి... కలెక్టరు జిల్లాలో ఎందుకు?’ అని ప్రశ్నించారు. తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్‌లో మానిటరింగ్ కమిటీల గురించి కోఅర్డనేటర్ చంద్రావతితో మాట్లాడుతూ ఎన్నిసార్లు సమావేశాలు పెట్టారని ప్రశ్నించగా సమావేశాలు పెట్టలేదని అనగానే అంతకుముందు ఇచ్చిన నోట్లో కలెక్టర్ పెట్టాలని సూచిస్తూ రాయడంపై మండిపడ్డారు. వేలాది కమిటీలు జిల్లాలో ఉన్నాయని, అన్నీ తాను పెట్టాలంటే తన పదవీకాలం చాలదని, మీరు దగ్గరుండి చేయించుకోవాల్సిన బాధ్యత లేదా? అని ఊగిపోయారు. -
కాల్చేందుకు కాకపోతే.. ఆయుధాలెందుకు
-
కాల్చేందుకు కాకపోతే.. ఆయుధాలెందుకు
దోచుకుని పోతున్న వారిని కాల్చేందుకు కాకపోతే.. అసలు పోలీసులకు ఆయుధాలుండి ఉపయోగం ఏంటని మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. ఎర్రచందనం ఏపీ రాష్ట్ర సంపద అని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఇప్పటికే రూ. 50 కోట్లకు పైగా విలువ చేసే ఎర్ర చందనం తరలిపోయిందని ఆయన తెలిపారు. శేషాచలం ఎన్కౌంటర్ విషయాన్ని ప్రస్తావిస్తూ.. పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినది మంచిపనేనని ఆయన అన్నారు. -
చిత్తూరు మునిసిపల్ ఎన్నికల్లో గందరగోళం
మదనపల్లి మునిసిపల్ ఎన్నికలలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మునిసిపాలిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నా.. తమ వద్ద ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారంటూ టీడీపీ ప్రగల్భాలు పలుకుతోంది. విజయం తమదేనని చెబుతోంది. ప్రలోభాలకు లోను చేయడం ద్వారా మునిసిపాలిటీని కైవసం చేసుకోవాలని ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఇదే జిల్లా నగరి మునిసిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇండిపెండెంట్ సభ్యులను టీడీపీ ప్రలోభాలకు గురిచేస్తోంది. పుత్తూరు, నగరి చైర్మన్ ఎన్నికల్లో అభ్యర్థులను తాను పంపే కవర్లో సూచించినవారినే ఎన్నుకోవాలంటూ టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు మెలిక పెట్టారు. అయితే అందుకు టీడీపీలోని కొన్ని వర్గాలు ససేమిరా అంటున్నాయి. దాంతో ఇక్కడ టీడీపీలోని రెండు వర్గాల మధ్య వివాదం జరుగుతోంది. -
పుత్తూరు, నగరిలో టీడీపీ, కాంగ్రెస్‌లకు గడ్డుకాలం
తేలని చైర్మన్ అభ్యర్థుల ఎంపిక ముద్దుకృష్ణమనాయుడుకు చుక్కెదురు చెంగారెడ్డి చెప్పినా కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువు గందరగోళంలో ఆ రెండు పార్టీల శ్రేణులు జోరుగా వైఎస్ఆర్ సీపీ సాక్షి, చిత్తూరు: నగరి నియోజకవర్గంలోని పుత్తూరు, నగరి మున్సిపాలిటీల్లో టీడీపీ, కాంగ్రెస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. నామినేషన్ల ఘట్టం ముగిసినా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించలేని స్థితిలో ఆ పార్టీలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు, మాజీ మం త్రి రెడ్డివారి చెంగారెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. అయితే శ్రేణులపై పట్టు తప్పారు. విభజన వ్యవహారంలో టీడీపీ, కాంగ్రెస్ వ్యవహరించిన తీరు పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. విభజనను సమర్థించిన పార్టీలుగా ఈ రెండింటిని ప్రజలు చూస్తున్నారు. ప్రజల్లో పట్టున్న నాయకులు ఈ రెండుపార్టీలకు గుడ్‌బై చెప్పి తొలి నుంచి సమైక్యవాదంతో ముందుకెళ్లిన వైఎస్ఆర్ సీపీ వైపు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పుత్తూరు మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో అభ్యర్థులను వైఎస్ఆర్సీపీ బరిలోకి దించింది. టీడీపీ కన్నా ముందే చైర్మన్ అభ్యర్థిగా డీఎన్.ఏలుమలై(అమ్ములు)ను ప్రకటించింది. అలాగే నగరిలోనూ మాజీ చైర్మన్ కేజె.కుమార్ భార్యతో నామినేషన్ వేయించి చైర్పర్సన్ అభ్యర్థి రేసులో వైఎస్ఆర్సీపీ స్పష్టమైన వైఖరి వెల్లడించింది. పుత్తూరు మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థిగా చెప్పుకునేందుకు ఒక అభ్యర్థినీ టీడీపీ ఎంపిక చేసుకోలేక పోతోంది. ఇప్పటికే రెండు గ్రూప్‌లు చైర్మన్ అభ్యర్థిత్వం తమకు కావాలంటే తమకు కావాలని గొడవ పడుతున్నాయి. ఫలానా సామాజిక వర్గానికి చైర్మన్ పదవి ఇవ్వనున్నామనే కనీస సమాచారాన్నీ ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు చెప్పలేకపోతున్నారు. పుత్తూరు మున్సిపాలిటీలో వార్డులకు కాంగ్రెస్ తరపున నామినేషన్లు వేసే వారూ కరువయ్యారు. ఇక చైర్మన్ అభ్యర్థి సంగతి సరేసరి. నగరిలోనూ ఇదే పరిస్థితి కాంగ్రెస్ తరపున కాకుండా ఎవరికి వారు స్వతంత్రంగా నామినేషన్లు వేసుకోండని మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి తన అనుచరులకు సూచించారు. దీంతో నగరిలో కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువయ్యారు. అక్కడక్కడా అతికష్టం మీద కాంగ్రెస్ తరపున అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. టీడీపీకి సంబంధించి ఎవరికివారు నామినేషన్లు వేశారు. వీరిలో ఎవరికి బీఫారం ఇస్తారో తెలియని పరిస్థితి. ఇక్కడా ఫలానా వారు టీడీపీ అభ్యర్థి అని ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమనాయుడు ప్రకటించలేదు. రెండు మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఘట్టం ముగిసినా ఇద్దరు మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ఎంపిక చేయలేక తలలు పట్టుకుంటున్నారు. నగరిలో టీడీపీ సీనియర్ నాయకులు పాకా రాజా, శ్రీహరినాయుడు ఇలా ఒకరిద్దరు చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే వీరికి అధిష్టానం, ముద్దుకృష్ణమనాయుడు వైపు నుంచి భరోసా లభించడం లేదు. నగరిలో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థిని నిలబెట్టే పరిస్థితి పూర్తిగా లేదు. మొత్తం 27 వార్డులకు 11 మందే కాంగ్రెస్ తరపున నామినేషన్లు వేశారు. మొత్తం మీద కాంగ్రెస్, టీడీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. -
విభజన బిల్లుకు పూర్తి మద్దతు: బీజేపీ
గడువులోపు తిప్పిపంపాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు బిల్లుకు బీజేపీ పూర్తి మద్దతిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువు లోపు దాన్ని కేంద్రానికి పంపించాలని విజ్ఞప్తి చేశారు. శనివారం అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చలో భాగంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణకు బీజేపీ 2006లోనే తీర్మానం చేసిందని గుర్తు చేశారు. అప్పట్లో సరైన మెజారిటీ లేకపోవడం, చంద్రబాబు ఒత్తిడి కారణంగా 3 రాష్ట్రాల ఏర్పాటు సమయంలో తెలంగాణను ఇవ్వలేకపోయామన్నారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు ముద్దుకృష్ణమ జోక్యం చేసుకున్నారు. రాజధానిగా ఉన్న ప్రాం తాన్ని ప్రత్యేక రాష్ర్టం చేయబోమని హోం మం త్రి హోదాలో బీజేపీ నేత అద్వానీ పార్లమెంట్లో అన్నారని గుర్తు చేశారు. అది అద్వానీ అభిప్రాయమని, బీజేపీ అభిప్రాయం తెలంగాణకు అనుకూలమని యెండల బదులిచ్చారు. అద్వానీ హోం మంత్రి హోదాలో దేశ ప్రతినిధిగా ఆ మాట చెప్పారు తప్ప ఎంపీగా చెప్పలేదని సీఎం కిరణ్ అన్నారు. -
గాలి వ్యాఖ్యలపై భగ్గుమన్న వైఎస్సార్సీపీ
తెలంగాణ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. ఆయన వ్యాఖ్యలపై ప్రతిస్పందించేందుకు వీలుగా తమకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ మనోహర్‌ను కోరారు. అయితే అందుకు ఆయన అంగీకరించకపోవడంతో స్పీకర్ పోడియంను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చుట్టుముట్టారు. కాగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు శాసనభలో మొత్తం 9,024 సవరణలు అందినట్లు అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. బిల్లుపై సోమవారం నాడు మొత్తం సభ్యులందరికీ సవరణ ప్రతిపాదనలు అందిస్తామని ఆయన అన్నారు.