తెలంగాణ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా తెలుగుదేశం పార్టీ సభ్యుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. ఆయన వ్యాఖ్యలపై ప్రతిస్పందించేందుకు వీలుగా తమకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ మనోహర్ను కోరారు. అయితే అందుకు ఆయన అంగీకరించకపోవడంతో స్పీకర్ పోడియంను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చుట్టుముట్టారు.
కాగా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు శాసనభలో మొత్తం 9,024 సవరణలు అందినట్లు అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. బిల్లుపై సోమవారం నాడు మొత్తం సభ్యులందరికీ సవరణ ప్రతిపాదనలు అందిస్తామని ఆయన అన్నారు.
గాలి వ్యాఖ్యలపై భగ్గుమన్న వైఎస్సార్సీపీ
Published Sat, Jan 18 2014 12:37 PM | Last Updated on Tue, May 29 2018 2:55 PM
Advertisement
Advertisement