వివాహిత దారుణ హత్య | The assassination of married woman | Sakshi
Sakshi News home page

వివాహిత దారుణ హత్య

Published Tue, Jan 21 2014 4:31 AM | Last Updated on Sat, Sep 2 2017 2:49 AM

The assassination of married woman

తాడిపత్రి రూరల్, న్యూస్‌లైన్: తాడిపత్రి మండలంలోని భోగసముద్రం గ్రామంలో సరిత(20) అనే వివాహిత దారుణ హత్యకు గురయ్యింది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం మేరకు.. ఆదిలాబాద్ జిల్లా హసన్ గ్రామానికి చెందిన తిరుపతయ్య ఐదేళ్లుగా స్థానిక ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ లోని లోడింగ్ సెక్షన్‌లో పని చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం తన సొంత ప్రాంతానికి చెందిన సరితను పెళ్లి చేసుకున్నాడు.

అనంతరం భార్య, తన తమ్ముడితో కలిసి భోగసముద్రంలో నివాసం ఉంటూ విధులకు వెళుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తిరుపతయ్య యథావిధిగా ఫ్యాక్టరీకి వెళ్లాడు. రోజూలాగే విధులు ముగించుకుని సోమవారం తెల్లవారు జామున ఇంటికి చేరాడు. తలుపు తెరిచే ఉండడంతో లోపలకు వెళ్లి చూడగా, సరిత రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. తలపై ఎవరో బండరాయితో మోది హత్య చేశారు. రూరల్ సీఐ రాఘవన్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

 మరిది ప్రేమ వ్యవహారమే కారణమా?
 సరితను ఎవరైనా బంగారం కోసం హత్య చేశారా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ మరిది ప్రేమ వ్యవహారమే ఆమె ప్రాణం తీసిందనే అనుమానం వ్యక్తం అవుతోంది. తిరుపతయ్యతో పాటు లోడింగ్ సెక్షన్‌లో పని చేసే పోచయ్య కూతురుతో సరిత మరిది రమేష్ స్నేహంగా వ్యవహరిస్తున్నాడు.

ఈ విషయంలో రమేష్‌ను పోచయ్య హెచ్చరించినట్లు తెలిసింది. అయితే సరిత తన మరిదిని ప్రోత్సహిస్తుండటంతో పోచయ్య కక్ష పెంచుకుని ఆమెను హత్య చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోచయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement