raghavan
-
అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): ఖమ్మం ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి నెల్లూరు, తమిళనాడులో విక్రయాలు సాగిస్తున్న ఓ ముఠా గుట్టును నెల్లూరు ఎస్ఈబీ అధికారులు రట్టు చేశారు. ముఠాలోని ఏడుగురు సభ్యులతోపాటు నలుగురు వినియోగదారులను అరెస్ట్ చేసి వారివద్ద నుంచి రూ.15.83 లక్షలు విలువచేసే గంజాయి, కారు, 10 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ కె.తిరుమలేశ్వరరెడ్డి ఈ కేసు వివరాలను గురువారం వెల్లడించారు. చెన్నై ఆంజనేయనగర్ ఆరో వీధికి చెందిన రాఘవన్ కావలిలో తన అత్త వద్ద ఉంటున్నాడు. అతను ఖమ్మం జిల్లా భద్రాచలంలోని పేపర్‌మిల్లులో పనిచేస్తున్న సమయంలో గంజాయి సరఫరాదారులైన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం శారపాక గ్రామానికి చెందిన యు.బాలమురళీకృష్ణ, కె.సురేష్‌తో పరిచయం ఏర్పడింది. వారు ఏవోబీలో గంజాయి కేజీ రూ.3 వేలకు కొనుగోలు చేసి రూ.7,500కు రాఘవన్‌కు విక్రయించారు. ఆయన కావలితోపాటు తమిళనాడు రాష్ట్రంలో కేజీ రూ.15 వేలు చొప్పున విక్రయించి సొమ్ము చేసుకోసాగాడు. ప్రస్తుతం రాఘవన్ దంపతులు కావలి తుఫాన్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. గుట్టుగా సాగుతున్న ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డికి సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఎస్ఈబీ జిల్లా ఇన్చార్జ్ డి.హిమవతి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ హుస్సేన్‌బాషా, నెల్లూరు–1, కావలి ఎస్ఈబీ ఇన్స్పెక్టర్లు కేపీ కిశోర్, శ్రీనివాసరావు తమ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టారు. గురువారం తుఫాన్‌నగర్‌లో రాఘవన్ దంపతులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిచ్చిన సమాచారం మేరకు శారపాకకు చెందిన బాలమురళీకృష్ణ, సురేష్, తరుణ్, దుమ్మగూడు మండలం తూరుబాక గ్రామానికి చెందిన సతీష్‌ను అరెస్ట్‌చేసి వారి వద్ద నుంచి 25 కేజీల గంజాయిని, కారును స్వాదీనం చేసుకున్నారు. అలాగే కావలిలోని బాలకృష్ణారెడ్డినగర్‌లో గంజాయి విక్రయదారురాలైన డి.శారదను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుంచి 2 కేజీల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. నలుగురు వినియోగదారులు అదే క్రమంలో రాఘవన్ దంపతులు, శారదల వద్ద కావలిలోని పాతూరుకు చెందిన డి.చైతన్య, వెంగళరావ్‌నగర్‌కు చెందిన వై.లక్ష్మీప్రవీణ్కుమార్, ఆంధ్రావీధికి చెందిన జి.శ్రీకాంత్, శివాలయం ప్రాంతానికి చెందిన పి.ఎం.శ్రీనివాసులు గంజాయిని కొనుగోలు చేసి సేవిస్తున్నట్లు తెలియడంతో వారిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 4.2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
ఇన్ రాఘవన్
తమిళంలో టాప్ స్టార్స్ నుంచి యంగ్ హీరోస్ వరకు అందరితో యాక్ట్ చేశారు నయనతార. ఒక్క కమల్ హాసన్‌తో తప్ప. ఇప్పుడు ఈ కాంబినేషన్ కలవబోతోందని కోలీవుడ్ టాక్. దర్శకుడు గౌతమ్ మీనన్, కమల్ హాసన్ కాంబినేషన్లో 2006లో ‘వేట్టయాడు విలయాడు’ (తెలుగులో ‘రాఘవన్’గా విడుదలయింది) సినిమా వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ ను రూపొందిస్తున్నారు గౌతమ్ మీనన్. ఇందులో హీరోయిన్గా అనుష్క నటిస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి.. నయన ఇన్ రాఘవన్ వార్త నిజమేనా? ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. -
సీక్వెల్ మీద సీక్వెల్
డీసీపీ రామ్‌చందర్ మళ్లీ వస్తే? రాఘవన్ మళ్లీ కనిపిస్తే? సత్యదేవ్ మళ్లీ సందడి చేస్తే ఎంత బాగుండు అని ఆ క్యారెక్టర్స్‌ని ఇష్టపడినవాళ్లు అనుకోవడం సహజం. ‘ఘర్షణ’లో వెంకటేశ్ చేసిన స్టైలిస్ పోలీస్ క్యారెక్టర్ పేరు రామ్‌చందర్ అనీ, ‘రాఘవన్’లో కమల్‌హాసన్ పాత్ర పేరు రాఘవన్ అనీ, ‘ఎంతవాడు గానీ’లో అజిత్ పేరు సత్యదేవ్ అనీ గుర్తుండే ఉంటుంది. మంచి హిట్ సాధించిన ఈ చిత్రాలు, ఆ పాత్రలనూ మరచిపోలేం. అందుకే గౌతమ్ మీనన్ మళ్లీ ఈ క్యారెక్టర్స్‌ని కొనసాగించాలనుకుని ఉంటారు. ఈ మూడు చిత్రాలకూ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ‘ఘర్షణ’ తమిళ ‘కాక్క కాక్క’కు రీమేక్. అందులో సూర్య హీరో. అలాగే కమల్ ‘వేటై్టయాడు విలైయాడు’ తెలుగులో ‘రాఘవన్’గా, అజిత్ ‘ఎన్నై అరిందాల్’ తెలుగులో ‘ఎంతవాడు గానీ’ పేరుతో అనువాదమయ్యాయి. తమిళంలో ఈ మూడు చిత్రాలకు సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు గౌతమ్. ఇవి డబ్బింగ్ రూపంలోనో లేక తమిళ్‌తో పాటు తెలుగులో కూడా నిర్మిస్తే టాలీవుడ్ ప్రేక్షకులూ చూడొచ్చనుకోండి. ‘‘ముందు ‘ఎన్నై అరిందాల్’ సీక్వెల్ స్క్రిప్ట్ తయారు చేసి, అజిత్‌ను అప్రోచ్ అవుతాను’’ అన్నారు గౌతమ్. యాక్చువల్లీ ఈ మూడు హై వోల్టేజ్ పోలీస్ స్టోరీలు ఒక పోలీసాఫీసర్ లైఫ్‌లో వివిధ దశల్లో జరిగే కథలని, ఈ మూడు సినిమాలు ఒక ట్రయాలజీ అని, ఎన్నై అరిందాల్‌తో ఈ ట్రయాలజీ ముగుస్తుందని ఓ సందర్భంలో పేర్కొన్నారు గౌతమ్. మరి.. వీటి సీక్వెల్స్ ఎలా ప్లాన్ చేశారు? అన్నది తెలియాల్సి ఉంది. -
సత్తాచాటడానికి సిద్ధం అంటున్న వారసురాలు
తమిళసినిమా: తమిళ సినిమా అనే పుస్తకంలో వైజీ.మహేంద్రన్‌కు ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పడం అతిశయోక్తి కాదు. హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన నటనతో సినీ ప్రియులను అలరించిన గొప్ప నటుడు వైవీఎం. నటుడిగా వెలుగొందుతుండగానే నాటక రంగానికి సేవలందించడానికి ఉపక్రమించారు. ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని మసక బారుతున్న నాటక రంగం అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇప్పటికీ అడపాదడపా చిత్రాల్లో నటిస్తున్నా పూర్తిగా నాటక రంగానికే విశేష సేవ లందిస్తున్నారు. ఆయన వారసురాలు మధువంతి కూడా తండ్రి బాటలోనే పయనిస్తూ నాటక రంగానికి జీవం పోస్తున్నారు. నాటకాలు ప్రదర్శిస్తూ వాటి ఉనికి ని కాపాడుతున్నారు. ఒక విద్యాసంస్థను కూడా నడుపుతున్నారు. తాజాగా ఆమె వెండితెరపై నటనకు ఆసక్తి చూపుతున్నారు. శీను రామసామి దర్శకత్వంలో వజయ్సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న ధర్మదురై చిత్రంలో మధువంతి పోలీస్ అధికారిగా ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా మంజాపై చిత్రం ఫేమ్ రాఘవన్ తాజా చిత్రంలోనూ ఈమె కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై మంచి అవకాశాలు వస్తే వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధం అంటున్నారు వైజీఎం వారసురాలు. -
అన్వేషించండి.. ఆస్వాదించండి
భారత శాస్త్ర సాంకేతిక సలహాదారుడు రాఘవన్ పిలుపు అట్టహాసంగా ఏయూ స్నాతకోత్సవం 225 మందికి డాక్టరేట్ల ప్రదానం ఏయూక్యాంపస్: ‘అన్వేషించండి, ఆనందించండి, ఆస్వాదించండి, ఇతరులను సుసంపన్నం చేయండి.. మీ చుట్టూ ఉన్న అవకాశాలను గుర్తించి అందుకొనే ప్రయత్నం చేయండి’ అని భారత శాస్త్ర సాంకేతిక సలహాదారుడు ఆచార్య ఎస్.వి రాఘవన్ అన్నారు. సోమవారం జరిగిన ఏయూ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ జ్ఞానం, ఆరోగ్యంతో యువత సుసంపన్నం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. మీ భవిష్యత్తు, భారత దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది.. ఆధునిక భారతం నిర్మించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ పీహెచ్డీ విభాగంలో 225 డాక్టరేట్లు అందించడం జరిగిందన్నారు. 13 మంది విశ్రాంతి ఆచార్యులు ఎమిరిటస్ ఆచార్యుల హోదా పొందారన్నారు. వర్సిటీ ద్వారా అందిస్తున్న నూతన కోర్సులు, విదేశీ వర్సిటీలతో జరుపుతున్న పరిశోధనలను వివరించారు. ఏయూలో ప్రస్తుతం 500 మంది విదేశీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. బడ్జెట్లో అత్యధికంగా నిధులు మంజూరు చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులకు కృతజ్ఞతలు తెలిపారు. సందడిగా.. ఆంధ్ర విశ్వవిద్యాలయం 82వ స్నాతకోత్సవం సాయంత్రం 3.30 నుంచి 5.45 గంటల వరకు అంగరంగ వైభవంగా జరిగింది. సభావేదిక, సభామందిరం అతిథులు, ఆహ్వానితులతో కిక్కిరిసి పోయింది. వేదికపై వీసీ రాజు, ముఖ్యఅతిథి ఎస్.వి.రాఘవన్, రిజిస్ట్రార్ కె.రామ్మోహనరావు, అకడమిక్ సెనేట్ సభ్యులు, ఫ్యాకల్టీ చైర్మన్లతో 120 మందికి పైగా అతిథులు ఆశీనులయ్యారు. గవర్నర్ స్నాతకోత్సవానికి హాజరుకాకపోవడంతో వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు అధ్యక్షస్థానంలో స్నాతకోత్సవాన్ని నడిపించారు. ముందుగా ఆయన వార్షిక నివేదిక అందించారు. ముఖ్యఅతిథి భారత ప్రభుత్వ సాంకేతిక సలహాదారు ఎస్.వి.రాఘవన్‌కు డాక్టర్ ఆఫ్ సైన్స్‌ను ప్రదానం చేశారు. పట్టభద్రులచే ప్రమాణం చేయించారు. తరువాత డాక్టరేట్లు, మెడల్స్, బహుమతులు అందించారు. రిజిస్ట్రార్ ఆచార్య కె.రామ్మోహనరావు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఇ.ఏ నారాయణ, రిజిస్ట్రార్ ఆచార్య కె.రామ్మోహనరావు, ప్రిన్సిపాళ్లు పి.ఎస్.అవధాని, సి.వి రామన్, డి.సూర్యప్రకాశరావు, బి.గంగారావు, కె.గాయత్రీ దేవి, సి.హెచ్ రత్నం, మాజీ ఉపకులపతులు ఆచార్య కె.రామకృష్ణారావు, వై.సి.సింహాద్రి, కె.వి రమణ, బీలా సత్యనారాయణ, అకడమిక్ సెనేట్ సభ్యులు, ఫ్యాకల్టీ చైర్మన్లు పాల్గొన్నారు. డాక్టరేట్ల ప్రదానం పీహెచ్డీ విభాగంలో 225 డాక్టరేట్లు, 16 పతకాలు, 13 బహుమతులు అందించడం జరుగుతుందన్నారు. ఆర్ట్స్‌లో 50, సైన్స్ 64, కామర్స్ మేనేజ్మెంట్ 24, ఇంజినీరింగ్ 41, కెమికల్ ఇంజినీరింగ్ 5, ఎడ్యుకేషన్ 6, ఫిజికల్ ఎడ్యుకేషన్ 2, న్యాయశాస్త్రం 3, ఫార్మసీ 30 మందికి డాక్టరేట్ పట్టాలు అందించారు. ఎంఫిల్ విభాగంలో ఆర్ట్స్‌లో 7, సైన్స్‌లో 12, కామర్స్, మేనేజ్మెంట్లో ఒకరు పట్టాలను అందుకున్నారు. వీటితో పాటు డిగ్రీ, పీజీ కోర్సుల్లో 426 మంది బహుమతులు, 155 మంది మెడల్స్ అందుకున్నారు. ప్రముఖులకు డాక్టరేట్లు స్నాతకోత్సవంలో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి (పొలిటికల్ సైన్స్), రాష్ట్ర మాజీ మంత్రి వట్టి వసంత కుమార్(కామర్స్ మేనేజ్మెంట్), జీవీఎంసీ చీఫ్ ఇంజినీర్ బి.జయరామి రెడ్డి(సివిల్ ఇంజినీరింగ్) విభాగాలలో డాక్టరేట్లు అందుకున్నారు. -
వివాహిత దారుణ హత్య
తాడిపత్రి రూరల్, న్యూస్‌లైన్: తాడిపత్రి మండలంలోని భోగసముద్రం గ్రామంలో సరిత(20) అనే వివాహిత దారుణ హత్యకు గురయ్యింది. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం మేరకు.. ఆదిలాబాద్ జిల్లా హసన్ గ్రామానికి చెందిన తిరుపతయ్య ఐదేళ్లుగా స్థానిక ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ లోని లోడింగ్ సెక్షన్లో పని చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం తన సొంత ప్రాంతానికి చెందిన సరితను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం భార్య, తన తమ్ముడితో కలిసి భోగసముద్రంలో నివాసం ఉంటూ విధులకు వెళుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తిరుపతయ్య యథావిధిగా ఫ్యాక్టరీకి వెళ్లాడు. రోజూలాగే విధులు ముగించుకుని సోమవారం తెల్లవారు జామున ఇంటికి చేరాడు. తలుపు తెరిచే ఉండడంతో లోపలకు వెళ్లి చూడగా, సరిత రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. తలపై ఎవరో బండరాయితో మోది హత్య చేశారు. రూరల్ సీఐ రాఘవన్, ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మరిది ప్రేమ వ్యవహారమే కారణమా? సరితను ఎవరైనా బంగారం కోసం హత్య చేశారా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ మరిది ప్రేమ వ్యవహారమే ఆమె ప్రాణం తీసిందనే అనుమానం వ్యక్తం అవుతోంది. తిరుపతయ్యతో పాటు లోడింగ్ సెక్షన్లో పని చేసే పోచయ్య కూతురుతో సరిత మరిది రమేష్ స్నేహంగా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయంలో రమేష్‌ను పోచయ్య హెచ్చరించినట్లు తెలిసింది. అయితే సరిత తన మరిదిని ప్రోత్సహిస్తుండటంతో పోచయ్య కక్ష పెంచుకుని ఆమెను హత్య చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోచయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.