సత్తాచాటడానికి సిద్ధం అంటున్న వారసురాలు | YG. Mahendran daughter Madhuvanthi entry in kollywood | Sakshi
Sakshi News home page

సత్తాచాటడానికి సిద్ధం అంటున్న వారసురాలు

Published Tue, May 24 2016 3:21 AM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

సత్తాచాటడానికి సిద్ధం అంటున్న వారసురాలు

సత్తాచాటడానికి సిద్ధం అంటున్న వారసురాలు

తమిళసినిమా: తమిళ సినిమా అనే పుస్తకంలో వైజీ.మహేంద్రన్‌కు ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పడం అతిశయోక్తి కాదు. హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన నటనతో సినీ ప్రియులను అలరించిన గొప్ప నటుడు వైవీఎం. నటుడిగా వెలుగొందుతుండగానే నాటక రంగానికి సేవలందించడానికి ఉపక్రమించారు. ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని మసక బారుతున్న నాటక రంగం అభివృద్ధికి పాటుపడుతున్నారు. ఇప్పటికీ అడపాదడపా చిత్రాల్లో నటిస్తున్నా పూర్తిగా నాటక  రంగానికే విశేష సేవ లందిస్తున్నారు. ఆయన వారసురాలు మధువంతి కూడా తండ్రి బాటలోనే పయనిస్తూ నాటక రంగానికి  జీవం పోస్తున్నారు.

నాటకాలు ప్రదర్శిస్తూ వాటి ఉనికి ని కాపాడుతున్నారు. ఒక విద్యాసంస్థను కూడా నడుపుతున్నారు. తాజాగా ఆమె వెండితెరపై నటనకు ఆసక్తి చూపుతున్నారు. శీను రామసామి దర్శకత్వంలో వజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న ధర్మదురై చిత్రంలో మధువంతి పోలీస్ అధికారిగా ముఖ్య పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా మంజాపై చిత్రం ఫేమ్ రాఘవన్ తాజా చిత్రంలోనూ ఈమె కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపై మంచి అవకాశాలు వస్తే వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధం అంటున్నారు వైజీఎం వారసురాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement