నెల్లూరురూరల్, న్యూస్‌లైన్: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా వేదాయపాళెం సెంటర్‌లో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని విగ్రహాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు గురువారం రాత్రి దర్శించుకున్నారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు జరిపి, ప్రసాదాలు స్వీకరించారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు రూరల్, నగర సమన్వయకర్తలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, స్థానిక నాయకులు భీమినేని మురహరి, పురుషోత్తంయాదవ్, నరసింహయ్యముదిరాజ్, రాజగోపాల్‌రెడ్డి, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
రూ.1.18 లక్షలు పలికిన లడ్డూ
వేదాయపాళెం సెంటర్‌లోని గణేష్ విగ్రహం వద్ద ఉంచిన స్వామి వారి లడ్డూకు వేలం నిర్వహించారు. స్థానికుడైన చంద్రమౌళినాయుడు రూ.1.18లక్షలకు ఆ లడ్డూను దక్కించుకున్నారు.
విఘ్నేశ్వరుని సేవలో వైఎస్సార్‌సీపీ నేతలు
Published Sat, Sep 14 2013 4:10 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement