హోదా గొంతు నొక్కితే మూల్యం తప్పదు
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
ఉయ్యూరు: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణగదొక్కితే భవిష్య త్తులో టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు హెచ్చరించారు. ఉయ్యూరులోని ఆయన నివాసంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. వైజాగ్ ఆర్‌కే బీచ్‌లో స్వచ్ఛందంగా యువత చేస్తున్న ప్రదర్శనను ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు.
పార్లమెంట్‌లో చట్టం చేసినప్పుడు దాన్ని అమలు చేయమని అడిగే హక్కు తెలుగు ప్రజలకు లేదా? అన్నారు. యువత స్వచ్ఛందంగా చేస్తున్న ఉద్యమంలో పాల్గొని సంఘీభావం తెలిపేందుకు వచ్చిన జగన్‌ను రన్‌వేపైనే ఆపడం తప్పని వడ్డే అన్నారు.