vadde sobhanadrisvara Rao
-
రైతును కరుణించని బడ్జెట్
విశ్లేషణ ఈ బలవన్మరణాల పరంపరను నిరోధించేందుకు, వ్యవసాయ అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి కారణాలు, పరిష్కారాలు చెప్పిన స్వామినాథన్ నివేదికను అమలు చేయడం నేటి అవసరం. కాబట్టి మళ్లీ కమిటీని నియమించి, అది ఇచ్చే నివేదిక కోసం వేచి ఉండడం వ్యర్థం. మోదీ ప్రభుత్వానికి రైతాంగం పట్ల శ్రద్ధాసక్తులు ఉన్నాయి. రైతుల ఆదాయాన్ని స్థిర ధరల సూచీతో పరిగణించినప్పుడు రెట్టింపు కావాలంటే కచ్చితంగా స్వామినాథన్ సిఫారసుల అమలే శరణ్యం. సమస్యలతో సతమతమవుతున్న భారత రైతాంగం ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2017–2018 బడ్జెట్‌తో మరింత నిరాశకు గురైంది. పాలకులు పెద్ద పెద్ద మాటలతో ఊరించారు. దీనితో రైతులు తమకు ఎంతో మేలు జరుగుతుందని ఆశించారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న వాగ్దానం కార్యరూపం దాల్చడానికి అవసరమైన చర్యల గురించి బడ్జెట్లో ప్రతిపాదించలేదు. మళ్లీ కొత్త కమిటీ ఎందుకు? దేశంలో వ్యవసాయం రంగ దుస్థితికి కారణాలను, వాటిని అధిగమించడానికి మార్గాలను అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని నియమిస్తున్నట్టు ఆ శాఖ మంత్రి రాధామోహన్‌సింగ్ ఇటీవల పార్లమెంటులో ప్రకటించారు. నిజానికి ఈ అంశాల అ«ధ్యయనం కోసమే విఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ నాయత్వంలో ఒక సంఘం గతంలోనే ఏర్పాటయింది. ఆ సంఘం 2006లోనే నివేదికను కూడా ఇచ్చింది. ప్రజల ఆహార అవసరాలను తీరుస్తూ, లక్షలాది చిన్న పెద్ద పరిశ్రమలకు ముడి వస్తువులు సరఫరా చేస్తూ దేశ ప్రగతికి వ్యవసాయ రంగం ఊతమిస్తున్నా, వ్యవసాయదారుల ఆర్థిక స్థితిగతులు మాత్రం నానాటికీ తీసికట్టు అన్నట్టు తయారవుతున్నాయి. సన్నకారు, చిన్నరైతులు, కౌలు రైతులు, ఆదివాసీ రైతులు వేలాదిగా బలవన్మరణాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ వాస్తవాలను కూలంకషంగా అధ్యయనం చేసిన స్వామినాథన్ కమిటీ వివరణాత్మకమైన నివేదికనే సమర్పించింది. వ్యవసాయేతర వర్గాల ప్రజల సగటు ఆదాయంతో పోలిస్తే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నవారి ఆదాయం– దీని అనుబంధ వ్యాపకాల మీద ఆధారపడిన వారి ఆదాయంతో కలిపి – రైతు కుటుంబానికి నెలకు రూ. 3,800 మాత్రమే దక్కుతున్నాయి. అప్పుల్లో పుట్టి, అప్పుల్లోనే చనిపోతున్నా రైతాంగం దుస్థితిలో మార్పు తెచ్చేందుకు ఈ కమిటీ ఆనాడే సూచనలు చేసింది. పంట ఉత్పత్తి వ్యయానికి 50 శాతం అదనంగా కలిపి ధరను నిర్ణయించాలనీ, పంట ఉత్పత్తి వ్యయాన్ని లెక్కించే తీరు సక్రమంగా లేదనీ, విధివిధానాలను సమీక్షించాలనీ కమిటీ చేసిన రెండు ప్రధాన సిఫారసులను యూపీఏ ప్రభుత్వం అమలు చేయలేదు. కానీ 2014 ఎన్నికలలో ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ ఎన్నో రైతు సంక్షేమ పథకాల గురించి హామీ ఇచ్చారు. అవన్నీ నెరవేరతాయని భారత రైతాంగం గంపెడాశతో ఉంది. అయితే రైతుల ఆదాయాన్ని పెంచడానికి నేరుగా వీలు కల్పించే స్వామినాథన్ ప్రధాన సిఫారసులను అమలు చేయడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొనడం పెద్ద దగా. ఎవరికీ పట్టని రైతన్న గోడు కొత్త బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించినది రూ. 51,026 కోట్లు. పెరిగిన 7 శాతం ద్రవ్యోల్బణాన్ని గమనంలో ఉంచుకుని, 2016–17 సవరించిన అంచనాలు రూ. 48,072 కోట్ల కంటే ఇది 6.14 శాతం మాత్రమే ఎక్కువ. ఇక మొత్తం బడ్జెట్ కేటాయింపులలో ఇది 2.3 శాతం మాత్రమే. వ్యవసాయ రంగానికి రూ. 10 లక్షల కోట్ల మేరకు రుణ వితరణను ఆర్థికమంత్రి లక్ష్యంగా ప్రకటించారు. వ్యవసాయంలో ధర తరువాత కీలకపాత్ర రుణానిదే. 2005లో రూ. లక్ష కోట్ల నుంచి 2015–2016లో రూ. 8.5 లక్షల కోట్లకు వ్యవసాయ రుణాల కేటాయింపు కొనసాగినా ఇందులో సన్నకారు, చిన్న రైతులకు చేరింది స్వల్పం. కౌలు రైతులకు, ఆదివాసీ రైతులకు చేరింది అతి స్వల్పం. మొత్తం వ్యవసాయ రుణాల ఖాతాలలో రూ. 2లక్షలకు లోపు ప్రత్యక్ష రైతు రుణ ఖాతాలు 68 శాతం ఉండగా 2013 నాటికి 44 శాతానికి తగ్గిపోయాయి. రూ. 10లక్షల లోపు, పైన రైతు రుణ ఖాతాలు అదే సమయంలో 21 శాతం నుంచి 25 శాతం వరకు పెరిగాయి. కొద్దికాలం క్రితం వరకు ప్రాధాన్యతా రంగంలోని వ్యవసాయ రంగానికి 18 శాతం కేటాయింపులు ఉండగా అందులో సన్నకారు, చిన్న రైతులకు 8 శాతం ఇవ్వవలసి ఉంది. కానీ ఆచరణలో వారికి దక్కినది సుమారు 5 శాతం మాత్రమే. వ్యవసాయ ఆధారిత చక్కెర ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లులు, నూనె మిల్లులు మున్నగు ప్రాసెసింగ్ యూనిట్లకు వాటిని సరఫరా చే సే పంపిణీదారులకూ, వ్యాపారవేత్తలకూ అందజేస్తున్న రుణాలను పరోక్ష వ్యవసాయ రుణాలుగా పేర్కొంటూ వేలకువేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. 2013 నుంచి 2 కోట్ల రూపాయల లోపు కార్పొరేట్లకు, పార్టనర్షిప్ ఫారమ్స్‌కు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లకు ఇచ్చే రుణాలను కూడా ప్రత్యక్ష వ్యవసాయ రుణం క్రింద చూపించడం పరిపాటైంది. తాజాగా నీతి ఆయోగ్ సిఫార్సును అనుసరించి రిజర్వుబ్యాంక్ ప్రత్యక్ష, పరోక్ష వ్యవసాయ రుణాల మధ్య విభజన రేఖను చెరిపి వేసింది. పర్యవసానంగా సన్నకారు, చిన్నరైతులు, కౌలు రైతులకు రుణాలు అందటం భవిష్యత్తులో మరింత కష్టమవుతుంది. కౌలు రైతులకు, సన్న చిన్నకారు రైతులకు రుణాలు అందిం^è డానికి రైతుమిత్ర గ్రూపులు ఏర్పాటు చేసి, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణ అర్హత కార్డులను కొంత మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు అందించినా బ్యాంకులు కుంటిసాకులు చెబుతూ రుణాలు అందించేందుకు తిరస్కరిస్తూ వస్తున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో 16.5 లక్షల కౌలు రైతులు ఉండగా, ఇప్పటికి 5 లక్షల మందికి రుణ అర్హత కార్డులు ఇచ్చి, కేవలం రూ. 240 కోట్లను లక్ష మంది కౌలు రైతులకు బ్యాంకులు ఇచ్చాయి. వాటన్నింటి పర్యవసానంగానే మొత్తం వ్యవసాయ రుణాలలో వడ్డీ వ్యాపారుల నుంచి పొందిన రుణ శాతం 1992లో 17.5 శాతం ఉండగా 2013 నాటికి 29.6 శాతానికి పెరిగింది. దేశ వ్యాప్తంగా అందించిన వ్యవసాయ రుణాలలో 25 శాతం పట్టణాలు, మెట్రోపాలిటన్ నగరాలలో ఉన్న బ్రాంచిల ద్వారా ఇస్తున్నారు. అలాగే నేరుగా సన్న, చిన్న రైతులతో సహా సాధారణ రైతులు, కౌలు రైతులకు వ్యవసాయ అనుబంధ వ్యాపకాల కోసం ఇవ్వవలసి ఉన్న ప్రత్యక్ష వ్యవసాయ రుణాలలో 22 శాతం నగరాలు, పట్టణాలలోని బ్రాంచిల ద్వారా బట్వాడా అవుతున్నాయంటే ఎక్కువ భాగం బ్యాంకు రుణాలు గ్రామాలలోని సాధారణ రైతాంగానికి అందటం లేదన్నది సుస్పష్టం. ఫలితంగానే 1992 నుంచి 2011 వరకు 20 సంవత్సరాలలో దాదాపు 150 లక్షల మంది రైతులు వ్యవసాయ రంగాన్ని వదిలిపోయారు. దేశ వ్యాప్తంగా సగటున వంద రైతు కుటుంబాలలో 52 శాతం రుణభారంతో ఉండగా, తెలంగాణ 89, ఆంధ్రప్రదేశ్ 92 శాతాలతో అగ్రభాగాన ఉన్నాయన్న విషయం మరిచిపోరాదు. దేశవ్యాప్తంగా (బ్యాంకులు, సహకార బ్యాంకులు) ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 43.7 శాతం మాత్రమే వ్యవస్థీకృత రంగం నుంచి వస్తూ ఉండగా, 56.3 శాతం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు తీసుకోవలసి వస్తుందన్నది యధార్థం. అందువలన బడ్జెట్లో రూ. 10 లక్షల కోట్లకు పెంచినట్లు ప్రకటిస్తే సరిపోదు. కచ్చితంగా బ్యాంకు గడప ఎక్కే ప్రతి ఒక్క రైతుకు నూటికి నూరుపాళ్లు అతని ఆధార్ సమాచారంతో సాగు వివరణలను పరిగణనలో ఉంచుకొని, వ్యవసాయ అనుబంధ వ్యాపకాలను సకాలంలో స్వల్పకాలిక పంట రుణాలను, మధ్య–దీర్ఘకాలిక పెట్టుబడి రుణాలను అందించవలసిన బాధ్యత ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మీదనే ఉంది. అలాగే అమలు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. కొనసాగుతున్న బలవన్మరణాలు వ్యవసాయం ‘రిస్క్’తో కూడుకున్నది కాబట్టి రైతులకు రుణాలు ఇవ్వడంలో స్థానిక బ్యాంకు శాఖలు చూపుతున్న అలక్ష్య ధోరణికి రిజర్వుబ్యాంక్ అడ్డుకట్ట వేయాలి. కొన్ని ప్రముఖ పారిశ్రామిక–వాణిజ్య సంస్థల ఆర్థిక పరిస్థితులు సక్రమంగా లేవని తెలిసినా వందల, వేల కోట్ల రూపాయలు నూతనంగా మంజూరు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రైవేటు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాలలో చిక్కుకుని అధిక వడ్డీలతో తలదాకా మునిగిపోతున్న లక్షలాది మంది రైతులకు ఆ రుణాలను బ్యాంకులకు బదలీ చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా (2014లో) మహారాష్ట్రలో 4,004, తెలం గాణలో 1,347, మధ్యప్రదేశ్‌లో 1,198, ఛత్తీస్‌గఢ్‌లో 954, ఆంధ్రప్రదేశ్‌లో 916, తమిళనాడులో 606 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. దేశ వ్యాప్తంగా 12,601 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారని నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో వెల్లడించింది. ఈ బలవన్మరణాల పరంపరను నిరోధించేందుకు, వ్యవసాయ అనుబంధ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి కారణాలు, పరిష్కారాలు చెప్పిన స్వామినాథన్ నివేదికను అమలు చేయడం నేటి అవసరం. కాబట్టి మళ్లీ కమిటీని నియమించి, అది ఇచ్చే నివేదిక కోసం వేచి ఉండడం వ్యర్థం. మోదీ ప్రభుత్వానికి రైతాంగం పట్ల శ్రద్ధాసక్తులు ఉన్నాయి. రైతుల ఆదాయాన్ని స్థిర ధరల సూచీతో పరిగణించినప్పుడు రెట్టింపు కావాలంటే కచ్చితంగా స్వామినాథన్ సిఫారసుల అమలే శరణ్యం. 1970 నాటి ధరలతో పోలిస్తే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఇప్పటికి 22 రెట్లు మాత్రమే పెరిగాయి. అదే ప్రభుత్వోద్యోగుల జీతభత్యాలు సుమారు 150 రెట్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయుల వేతనాలు దాదాపు 125 నుంచి 175 రెట్లు పెరిగిన వాస్తవాలు కళ్ల ముందు ఉన్నాయి. ఇక పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు తమకు లభించే జీతభత్యాలను, ఇతర సౌకర్యాలను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటున్నారు. అయినా సమాజంలో ముఖ్య భాగమైన రైతులపట్ల చూపుతున్న అశాస్త్రీయ, అన్యాయ పూరితమైన వివక్షను భారత రైతాంగం ఇంకా సహిస్తూ మిన్నకుండలేదన్న వాస్తవాన్ని ఇప్పటికైనా ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. వడ్డే శోభనాద్రీశ్వరరావు (వ్యాసకర్త మాజీ వ్యవసాయ మంత్రి) ఈమెయిల్: vaddesrao@yahoo.com -
హోదా గొంతు నొక్కితే మూల్యం తప్పదు
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ఉయ్యూరు: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణగదొక్కితే భవిష్య త్తులో టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు హెచ్చరించారు. ఉయ్యూరులోని ఆయన నివాసంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. వైజాగ్ ఆర్కే బీచ్‌లో స్వచ్ఛందంగా యువత చేస్తున్న ప్రదర్శనను ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. పార్లమెంట్లో చట్టం చేసినప్పుడు దాన్ని అమలు చేయమని అడిగే హక్కు తెలుగు ప్రజలకు లేదా? అన్నారు. యువత స్వచ్ఛందంగా చేస్తున్న ఉద్యమంలో పాల్గొని సంఘీభావం తెలిపేందుకు వచ్చిన జగన్‌ను రన్‌వేపైనే ఆపడం తప్పని వడ్డే అన్నారు. -
‘చంద్రబాబు పోర్టు విస్తీర్ణం1,900 ఎకరాలే’
ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆదర్శమైన సింగపూర్‌లోనూ ఆయనకు 1,900 ఎకరాల్లోనే 84 బెర్తుల పోర్టు నడుస్తోందని వడ్డే శోభనాద్రీశ్వర రావు తెలిపారు. బందరు పోర్టుకు 4,800 ఎకరాల భూమి అక్కర్లేదని.. ప్రస్తుతం కేవలం 1,800 ఎకరాల్లో మాత్రమే గంగవరం పోర్టు నడుస్తోందని ఆయన అన్నారు. బందరుపోర్టు బాధితుల పక్షాన అఖిలపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతుల భూములతో వ్యాపారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్న చంద్రబాబూ... రైతుల ఉసురుపోసుకోవద్దని హితవు పలికారు. అభివృద్ధి పేరుతో అరాచకాలు తగవని చెప్పారు. బందర్‌పోర్టు బాధితుల పక్షాన అన్ని పార్టీలు కలసి ఉద్యమించాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేత ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. అవసరానికి మించి ప్రభుత్వం తలపెట్టిన భూసేకరణను అడ్డుకోవాలని ఆయన కోరారు. రైతులపై పోలీసులను ఉసిగొల్పుతున్న దుర్మార్గ ప్రభుత్వమని ధర్మాన మండిపడ్డారు. చంద్రబాబుకు భూమి పిచ్చి పట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యద ర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు. ప్రశ్నిస్తే రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలపై దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు రైతులంటే పడదు..ఆయనది మాట నిలబెట్టుకునే నైజం కాదని కాంగ్రెస్ శాసనమండలి సభానేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. రాష్ట్రంలో 4.5 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వం చేతిలో ఉందంటూప్రపంచం అంతా తిరుగుతున్నారని సీఎంపై ధ్వజమెత్తారు. ఎవరి భూములను హరిస్తాడో తెలియకుండా ఉంది..ఆఖరికి శ్మశానలకుకూడా స్థలం లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ కాళ్లు పట్టుకుని.. పవన్ కల్యాణ్ గడ్డం పట్టుకున్నా.. ఎన్నికల్లో బాబుకు ప్రతిపక్షం కన్నా కేవలం ఒక్కశాతం మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయని మరవొద్దని హెచ్చరించారు. -
స్వరాజ్ మైదాన్ పరిరక్షణకు ఉద్యమం
- వడ్డే శోభనాద్రీశ్వరరావు విజయవాడ విజయవాడలోని స్వరాజ్ మైదానాన్ని కాపాడుకునేందుకు నగర ప్రజలతో కలసి ఉద్యమిస్తామని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. స్వరాజ్ మైదానాన్ని చైనా కంపెనీకి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుతోపాటు వివిధ పార్టీల నాయకులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. చారిత్రక స్థలాన్ని చైనా కంపెనీకి ఎలా అప్పగిస్తారని సమావేశంలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. వందల కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని విదేశీ కంపెనీకి దారాదత్తం చేస్తారా అని నిలదీశారు. గతంలో ఎంటర్టైన్మెంట్ పేరుతో విలువైన కెనాల్ గెస్ట్‌హౌస్‌ను ఎంపీ గంగరాజుకు కేటాయించారని.. కావాలంటే దాన్ని స్వాధీనం చేసుకుని చైనా సంస్థకు ఇచ్చుకోవాలన్నారు. -
రైతు గోడు పట్టని ప్రభుత్వాలు!
వ్యవసాయ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో ఇటీవలి సర్వేలు మరోసారి దేశప్రజల కళ్లకు కట్టాయి. తెలంగాణలో 89%, నవ్యాంధ్రలో 93% రైతులు రుణగ్రస్థులై ఉన్నారు. సగం మంది రైతులకు కూడా సంస్థాగత రుణాలు అందదకపోవడం ఈ అప్పులకు ఒక ముఖ్య కారణం. సన్న, చిన్నకారు, కౌలు రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు రుణాలపై ఆధారపడుతున్నారన్నది నగ్నసత్యం. బ్యాంకులను జాతీయం చేసినా.. అవసరానికి అనుగుణంగా సకాలంలో రుణ పరపతి అందినప్పుడే రైతులు వ్యవసాయ పనులను సకాలంలో పూర్తిచేసి సత్ఫలితాలు పొందగలుగుతారు. కానీ, 1970వ దశకంలో బ్యాంకులను జాతీయం చేసినా ఇప్పటికీ చిన్న, సన్నకారు, కౌలు రైతులకు ఇప్పటికీ బ్యాంకులు పంట రుణాలను, భూమి మెరుగుదలకు దీర్ఘకాలిక రుణాలను తగినంతగా అందించడం లేదు. మెట్రో నగరాల్లో, పట్టణాల్లో వ్యవసాయాధార, ప్రోసెసింగ్ పరిశ్రమలకు అందించే రుణాలనూ వ్యవసాయ రుణాల లెక్కలో చేర్చి లక్ష్యాలు సాధించామని బ్యాంకులు ప్రకటించుకోవటం గమనిస్తూనే ఉన్నాం. రైతుమిత్ర గ్రూపులు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు ఏర్పాటు చేసినా.. కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చినా ప్రభుత్వం ఆశించిన దాంట్లో కనీసం 5వ వంతు కూడా బ్యాంకులు సహకరించడం లేదు. ఇందువల్లే రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేస్తున్నారు.. ఆత్మహత్యల పాలవుతున్నారు. ఇది అత్యంత దురదృష్టకరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి అనేకసార్లు రుణమాఫీ కార్యక్రమం చేపట్టినా రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. అతలాకుతలం చేస్తున్నది సర్కారు విధానాలే వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెడుతూ రైతుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నది ప్రభుత్వ విధానాలే. వీటిని మార్చుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయకపోవడం బాధాకరం. రైతులు అష్టకష్టాలు పడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వటానికి నిరాకరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రసాయనిక ఎరువులు, పురుగుమందుల ధరలను ఇష్టానుసారం పెంచుకోవడానికి కంపెనీలకు స్వేచ్ఛనిచ్చారు. ఫలితంగా ఫాస్పేట్, పొటాష్ ధరలు 3 నుంచి 4 రెట్లు పెరిగాయి. దిగుబడులు మాత్రం పెరగటం లేదు. ఫలితంగా వ్యవసాయం గిట్టుబాటు కాని వ్యాపకంగా మారింది. అనుసరణీయమైనది ప్రకృతి వ్యవసాయం ఈ పరిస్థితుల్లో వ్యవసాయ ఖర్చులు తగ్గించుకుంటూ, అధికోత్పత్తిని సాధించగలిగే వ్యవసాయం రైతులకు లాభసాటిగా ఉంటుంది. ప్రధానంగా భూసారాన్ని పెంపొందించవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. రసాయనిక ఎరువుల వాడకాన్ని బాగా తగ్గించి.. పచ్చిరొట్ట ఎరువులు, చెరకు ఆకు, వరి గడ్డితోపాటు పత్తి, జొన్న, మొక్కజొన్న మొదలగు పంటల వ్యర్థాలను భూమిలో కలిపి దున్నటం ద్వారా భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంపొందించాలి. అప్పుడే భూముల్లో హ్యూమస్(జీవనద్రవ్యం) పెరిగి అధిక దిగుబడులు లభిస్తాయి. సుభాష్ పాలేకర్ బోధిస్తున్న పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానం ఎంతైనా అనుసరణీయం. ఒక్క దేశీ ఆవుతోనే దాదాపు 20 ఎకరాలకు ఎరువు అందించగలిగే వీలుంది. ఆవుమూత్రం, ఆవు పేడతో ఘన, ద్రవ జీవామృతాలను తయారు చేసుకొని వినియోగించుకోవచ్చు. పాలేకర్ చెప్పే బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం, నీమాస్త్రం తదితర కషాయాలను ఉపయోగించి చీడపీడలను నివారించుకోవచ్చు. వ్యవసాయ సంక్షోభం పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపరమైన చర్యలివి: ► డా. ఎమ్మెస్ స్వామినాథన్ సారథ్యంలోని జాతీయ రైతు కమిషన్ చేసిన సిఫారసులను ఆమోదించినప్పుడే దేశవ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ► వ్యవసాయ ధరల కమిషన్‌ను పునర్వ్యవస్థీకరించి ‘టరమ్స్ ఆఫ్ రిఫరెన్స్’ను పునఃసమీక్షించాలి. పంట ఉత్పత్తి వ్యయంపై 50 శాతాన్ని కలిపి మద్దతు ధర ప్రకటించాలి. అప్పుడే రైతు కుటుంబం సమాజంలోని ఇతర వర్గాల స్థాయిలో గౌరవప్రదంగా జీవించగలుగుతుంది. ► రైతు భరించగలిగిన స్థాయిలో ప్రీమియం నిర్ణయించి.. పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి. జీ వ్యవసాయోత్పత్తుల మార్కెట్ ధరల్లో ఒడిదుడుకులు తట్టుకునేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. జీ వ్యవసాయోత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల వల్ల మన రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించకుండా ఉండేందుకు ‘ఇండియన్ ట్రేడ్ ఆర్గనైజేషన్’ను ఏర్పాటు చేయాలి. ► {పకృతి వైపరీత్యాల బారిన పడిన రైతులను ఆదుకొనేందుకు ‘వ్యవసాయ విపత్తు నిధి’ని ఏర్పాటు చేయాలి. ► రైతులకు, వ్యవసాయ కార్మికులకు, కౌలు రైతులకు ఉచిత జీవిత బీమా సదుపాయం కల్పించాలి. ► {V>Ò$×ులు, రైతులకు చైనాలోని ‘టౌన్ విలేజ్ ఎంటర్ప్రైజెస్’ మాదిరిగా నైపుణ్యాన్ని మెరుగుపరిచే శిక్షణ ఇవ్వాలి. ► వ్యవసాయ రంగం అభివృద్ధికి కొలమానం పంట ఎన్ని టన్నులు పండింది అని కాకుండా.. రైతు సంతోషంగా, ఆనందంగా ఉన్నాడా లేడన్నది ప్రామాణికం కావాలని స్వామినాథన్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్చించి 8 ఏళ్లు గడచింది. పార్లమెంటులో ఈ నివేదికపై చర్చించడం కానీ, ఆమోదించడం కానీ చెయ్యలేదు. 60 కోట్ల మంది రైతాంగం, గ్రామీణ ప్రజానీకం పట్ల కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యానికిది నిలువుటద్దం పడుతోంది. ► కోట్లాది మంది రైతులు, గ్రామీణ చేతివృత్తుల వారి ఆదాయం, కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగితేనే పారిశ్రామిక, సేవారంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని తెలిసీ.. చర్యలు చేపట్టకపోవటం రైతుల దౌర్భాగ్యం. (వ్యాసకర్త ఏపీ వ్యవసాయ శాఖ మాజీమంత్రిర్యులు) మొబైల్: 93929 59999) రెతుకు సక్రమంగా సంస్థాగత రుణాలివ్వడం.. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం.. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు గిట్టుబాటు ధర కల్పించడం వంటి నిర్మాణాత్మక చర్యలు అమలు చేస్తే తప్ప వ్యవసాయ సంక్షోభాన్ని సమూలంగా పెకలించడం అసాధ్యమని స్పష్టం చేస్తున్నారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు -
చంద్రబాబు మాటల్ని నమ్మేదెలా?
రాజధాని కమిటీని నిలదీసిన రైతులు మంచినీళ్ల కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నా ఫలితం లేదు.. 9 నెలల్లోనే కోట్లు వచ్చేలా చేస్తామంటే ఎలా నమ్మాలి? ఉద్యోగం రాక వ్యవసాయం చేసుకుంటున్నా.. ఆ భూమి కూడా లాక్కుంటారా? తుళ్లూరు మండల గ్రామాల్లో భూ సమీకరణ అవగాహన సదస్సులు తుళ్లూరు: రాజధాని నిర్మాణానికి అవసరమైన భూములు సమీకరించేందుకు ముందస్తుగా నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయి. బతుకునిస్తున్న భూములు తీసుకునేందుకు సర్కారు చేస్తున్న యత్నాలపై రైతులు మండిపడుతున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని ఐనవోలు, శాఖమూరు, నేలపాడు గ్రామాలకు సంబంధించిన సమావేశాన్ని నేలపాడు గ్రామ పంచాయితీ కార్యాలయంలో, బోరుపాలెం, అబ్బురాజు పాలెం, దొండపాడు గ్రామాలకు సంబంధించిన సమావేశాన్ని దొండపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. గురజాల ఆర్డీవో మురళీ, గుంటూరు ఆర్డీవో భాస్కరనాయుడు సభల్లో పాల్గొన్నారు. తుళ్ళూరు మండలాన్ని రాజధాని నిర్మాణంలో భాగం చేయడానికి గల కారణాలు వివరించారు. ఐనవోలు గ్రామ రైతు పాలకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డిగ్రీ చదివినా ఉద్యోగం రాకపోవడంతో వ్యవసాయం చేసుకుంటున్నట్లు చెప్పారు. పలు గ్రామాలకు మంచి నీరందించేందుకు శాఖమూరులో తాగునీటి పథకం నిర్మించి ఏడేళ్ళు కావస్తున్నా ఒక్క గ్రామానికీ తాగునీరు ఇవ్వలేదని, 9 నెలల్లో అభివృద్ధి చేసి రైతులకు కోట్ల ఆదాయం వచ్చేలా చూస్తామని అధికారులు, సీఎం చెబితే ఎలా నమ్మాలని ప్రశ్నించా రు. రైతు రంగారావు మాట్లాడుతూ రాజకీయ నాయకులకు రైతులు గొర్రెల్లా కనిపిస్తున్నారా? అంటూ నిలదీశారు.ప్రభుత్వం తొలుత రైతులకు ఆమోదయోగ్యమైన ప్యాకేజీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంపీ పొలాన్ని మినహాయిస్తారా? నేలపాడు రైతు ధనేకుల రామారావు మాట్లాడుతూ తుళ్ళూరు మండలంలోని వెంకటపాలెం లో ఓ ఎంపీ వందలాది ఎకరాలు పొలం కొనుగోలు చేయడం వల్ల ఆ గ్రామాన్ని ల్యాండ్ పూ లింగ్ నుంచి మినహాయించినట్లు తెలుస్తోంద ని, ఈ పరిస్థితి ఉంటే రైతులు సహకరించరని తెగేసి చెప్పారు. కృష్ణానది ఒడ్డున వున్న బోరుపాలెం, అబ్బురాజుపాలెం గ్రామాల్లో ఎక రం నిమ్మతోటకు రూ.లక్షకు పైగా కౌలు వస్తుందని, ప్రభుత్వం రూ. 25 వేలు కౌలు ఇస్తే ఎలా సరిపోతుందని దొండపాడులో జరిగిన సమావేశంలో రైతులు ప్రశ్నించారు. దొండపాడు మాజీ గ్రామ సర్పంచ్ కొమ్మినేని కృష్ణారావు మాట్లాడుతూ తమ భూములపై ఇప్పటికే ప్రైవేట్‌గా అప్పులు తీసుకున్నామనీ, ఆ భూములు ప్రభుత్వం తీసుకుంటే బాకీలు ఎలా తీర్చాలో అధికారులు చెప్పాలని కోరారు. బాబు అక్రమంగా లక్ష ఎకరాలు రైతుల నుంచి తీసుకుని లక్షమంది రైతులను చంపుతారా అని ఓ రైతు ప్రశ్నించారు. రైతులను భయపెడితే భూ సమీకరణ సాగదు మాజీ మంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజం విజయవాడ బ్యూరో: రాజధాని నగర నిర్మాణానికి ప్రభుత్వం అవలంబిస్తున్న భూ సమీకరణ విధానం సరైన పద్ధ్దతిలో లేదని మాజీ మంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. రైతులను భయపెడితే భూ సమీకరణ సాగదన్నారు. రాజధాని కోసం 30 వేల ఎకరాలు అవసరమన్న మాట అర్థరహితమన్నారు. సీఎం చంద్రబాబుకు ఎవరో తప్పుడు సలహాలిస్తున్నారన్నారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో తుళ్లూరు మండల రైతులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అవసరమంటే 3 వేల ఎకరాల వరకు రైతులు ముందుకొచ్చే పరిస్థితి ఉందిగానీ, ఏడాదికి మూడు పంటలు పండే 30 వేల ఎకరాలను ఇవ్వమంటే పొలాలను ఇవ్వబోరని స్పష్టం చేశారు. నయారాయ్‌పూర్‌లో 750, గాంధీనగర్‌లో 12 వేలు, చండీగఢ్‌లో 2,500 ఎకరాల్లో రాజధాని నగరం నిర్మాణం జరగ్గా ఇక్కడ లక్ష ఎకరాలెందుకని ప్రశ్నించారు. గుంటూరు జాతీయ రహదారి పక్కన మంగళగిరి సమీపంలో 3 వేల ఎకరాలు సేకరిస్తే మంచిదన్నారు. తుళ్లూరు మండలం లింగాపురం రైతు అనుమోలు గాంధీ మాట్లాడుతూ, ప్రభుత్వం తుపాకీ ఎక్కు పెట్టి భూముల బేరం చేస్తోందనీ, ఇది మంచిపద్ధతి కాదన్నారు. ఓ మంత్రి పది మంది రైతుల్ని గెస్ట్ హౌస్‌కు పిలిపించుకుని మాట్లాడి, మండల రైతులందరూ అనుకూలమని ప్రకటనలు చేయడం సమంజసం కాదన్నారు. పంట పరిహారం కింద ఏడాదికి రూ.25 వేలిస్తామంటోన్న ప్రభుత్వం రెండో ఏడాది నుంచి ఇవ్వకపోతే తమ పరిస్థితేంటని మల్కాపురం రైతు హనుమంతరావు ప్రశ్నించారు. భూ సేకరణ చట్టం ప్రకారం వందకు 70 మంది రైతులు సమ్మతిస్తేనే సేకరణ జరుగుతుందన్న విషయాన్ని ప్రభుత్వం విస్మరించకూడదనీ, బలవంతంగా భూ సేకరణ జరపాలని ప్రయత్నిస్తే అందరం కలిసి ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. సదస్సుల రద్దుకు నిరసనగా ధర్నా భూ సమీకరణపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన సదస్సు అర్ధంతరంగా రద్దు చేయడానికి నిరసనగా ఆరు గ్రామాల రైతులు ధర్నా చేశారు. బుధవారం నాలుగు కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తొలుత ప్రకటించారు. ఆ మేరకు రైతులను సమీకరించే ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు నేలపాడు, దొండపాడుల్లో సమావేశాలు నిర్వహించినా.. ఉద్దండ్రాయునిపాలెం, మందడంలలో నిర్వహించాల్సిన సదస్సులు అత్యవసరంగా కలెక్టర్ మీటింగ్ ఉందంటూ అధికారులు వెళ్లిపోవడంతో రద్దయ్యూరుు. దీంతో ఉదయం నుంచి నిరీక్షించిన ఆయూ గ్రామాల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాము వ్యతిరేకిస్తామేమోనన్న అనుమానంతోనే వారు సమావేశాలు రద్దు చేశారంటూ రైతులు విజయవాడ-అమరావతి కాలచక్ర రహదారిపై బైఠాయించారు.