స్వరాజ్ మైదాన్ పరిరక్షణకు ఉద్యమం | Swaraj Maidan conservation movement | Sakshi
Sakshi News home page

స్వరాజ్ మైదాన్ పరిరక్షణకు ఉద్యమం

Published Sun, May 29 2016 2:22 PM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM

Swaraj Maidan conservation movement

- వడ్డే శోభనాద్రీశ్వరరావు
విజయవాడ

విజయవాడలోని స్వరాజ్ మైదానాన్ని కాపాడుకునేందుకు నగర ప్రజలతో కలసి ఉద్యమిస్తామని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తెలిపారు. స్వరాజ్ మైదానాన్ని చైనా కంపెనీకి కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుతోపాటు వివిధ పార్టీల నాయకులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.

చారిత్రక స్థలాన్ని చైనా కంపెనీకి ఎలా అప్పగిస్తారని సమావేశంలో పాల్గొన్న నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. వందల కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని విదేశీ కంపెనీకి దారాదత్తం చేస్తారా అని నిలదీశారు. గతంలో ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో విలువైన కెనాల్ గెస్ట్‌హౌస్‌ను ఎంపీ గంగరాజుకు కేటాయించారని.. కావాలంటే దాన్ని స్వాధీనం చేసుకుని చైనా సంస్థకు ఇచ్చుకోవాలన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement