అదృశ్యమైన రైతు హత్య | The farmer killed | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన రైతు హత్య

Published Wed, Oct 7 2015 5:38 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

The farmer killed

అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బుక్కచెర్లలో ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ అదృశ్యమైన చెన్నారెడ్డి అనే రైతు హత్యకు గురైన సంగతి ఆలశ్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే..  బుక్కచెర్లకు చెందిన చెన్నారెడ్డి (55) వ్యవసాయం చేసుకుని జీవించేవాడు. ఇదే గ్రామానికి చెందిన 13 మంది జాలర్లు సమీపంలోని చెరువులో చేపలు పట్టేవారు.

సాయంత్రం చెరువులో వలలుచేసి వచ్చేసి ఉదయమేవెళ్లి చేపలు పట్టుకును అమ్ముకుని జీవనం సాగించేవారు. అయితే, ఈ విషయం గమనించిన చెన్నారెడ్డి రాత్రి పోద్దుపోయాక చెరువు వద్దకు వెళ్లి వలలను ధ్వంసం చేయడమేకాక, పడిన చేపలను తీసుకెళ్లేవాడు. రోజూ ఇలా జరగడంతో అనుమానం వచ్చిన జాలర్లు కాపు కాసి చెన్నారెడ్డిని హతమార్చి చెరువు పక్కన పూడ్చిపెట్టారు.

చెన్నారెడ్డి కనిపించకపోవడంతో ఆయన కుమార్తెలు రాప్తాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానించిన పోలీసులు జాలర్లను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు విషయం బయటపడింది. తామే హతమార్చి పూడ్చిపెట్టామని అంగీకరించారు. దాంతో పోలీసులు బుధవారం సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement