ఐపీ పెట్టిన ఫైనాన్స్ వ్యాపారి | The Finance merchant IP | Sakshi
Sakshi News home page

ఐపీ పెట్టిన ఫైనాన్స్ వ్యాపారి

Published Mon, Feb 24 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM

The Finance merchant IP

హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : గ్రామంలో ఓ వ్యక్తి రూ.50 వేలతో ప్రా రంభించిన ఫైనాన్స్ వ్యాపారం రెండేళ్లకు లక్ష ల టర్నొవర్‌కు చేరింది. ఆ మరుసటి ఏడాదే వ్యాపారి మెడలో బంగారు చైన్.. చేతికి ఉంగ రాలు వచ్చారుు. దీంతో అతడి ఫైనాన్స్‌లో పెట్టుబడులు  పెట్టేందుకు గ్రామస్తులు ముం దుకొచ్చారు. ఇదే అదనుగా సదరు ఫైనాన్షియర్ సుమారు 70 మంది నుంచి సుమారు రూ.కోటి వరకు సేకరించాడు. ఐదేళ్లతో అతడి వ్యాపారం కోట్లకు చేరింది. కాని చివరికి తాను ఫైనాన్స్ వ్యాపారంలో నష్టపోయాయనని అతడు కోర్టును ఆశ్రయించాడు.

విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. హసన్‌పర్తి మండలం వంగపహాడ్ గ్రామానికి చెందిన గండు రమేష్ అలియాస్ దుబాయి శ్రీనివాస్ అలియాస్ డాన్ శ్రీనివాస్ గ్రామంలో ఐదేళ్ల క్రితం ఫైనాన్స్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. వివిధ వర్గాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు లు సేకరించాడు. దీంతోపాటు వివిధ ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగాలు, ఆర్టీసీలో కండక్టర్ పోస్టులు, హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. సదరు వ్యాపారి విలాసవంతమైన జీవితం గడపడంతో అతడి మాటలను నమ్మి లక్షలాది రూపాయలు ఇచ్చారు.
 
జల్సాలతోనే నష్టం..
 
వివిధ వర్గాల ద్వారా ఫైనాన్స్ వ్యాపారంలో డబ్బులు సేకరించిన గండు రమేష్ జల్సాలకు అలవాటుపడ్డాడు. వ్యాపారంలో నష్టం రావడంతో ఎవరికీ తెలియకుండా కోర్టును ఆశ్రయించాడు. తన వ్యాపారాన్ని యథావిధిగా కొనసాగిస్తూ వచ్చాడు. వారం రోజుల క్రితం కోర్టు నుంచి ఐపీ పొందాడు. తనకు ఇల్ల్లు, ఎకరంన్నర వ్యవసాయ పొలం, రెండు సీలింగ్ ఫ్యాన్లు, పది కుర్చీలు ఉన్నట్లు సదరు ఫైనాన్స్ వ్యాపారి కోర్టుకు విన్నవించాడు. ఐపీ పొందిన వెంటనే అతడు పరారయ్యూడు. కోర్టు నుంచి నోటీ సులు అందుకున్న బాధితులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కొక్కరు కనీసం రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు అతడి వద్ద డబ్బులు దాచుకున్నారు. కూతుళ్ల పెళ్లిళ్ల కోసం ఫైనాన్స్‌లో డబ్బులు దాచుకున్నవారు లబోదిబోమంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement