Finance Business
-
ముత్తూట్‌కు ఆర్బీఐ షాక్
ఫైనాన్షియల్ కార్పొరేషన్ ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. వెహికిల్స్ విభాగానికి సంబంధించిన ముత్తూట్ వెహికిల్ అండ్ అస్సెట్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు ఆథరైజేషన్ సర్టిఫికెట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నియంత్రణ అవసరాలకు అనుగుణంగా లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. అంతేకాదు చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్ (PSO)గా ఉన్న మరో కంపెనీ ఈకో(EKO) ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు సైతం సీవోఏను రద్దు చేసేసింది. ఇదిలా ఉంటే ఎస్బీఐ, ఐసీసీఐ బ్యాంక్‌తో పాటు యస్ బ్యాంక్ తరపున సేవలు అందిస్తోంది ఈకో. సర్టిఫికేట్ ఆఫ్ ఆథరైజేషన్ (CoA) రద్దు చేయబడిన తరువాత.. ముత్తూట్ వెహికిల్ ఫైనాన్స్, ఈకో కంపెనీలు ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల జారీ, నిర్వహణ లాంటి వ్యాపారాలకు అర్హత కోల్పోయినట్లు అయ్యింది. అయితే, ఈ కంపెనీలపై PSOలుగా చెల్లుబాటు అయ్యే క్లెయిమ్ ఉన్న కస్టమర్లు, వ్యాపారులు.. రద్దు చేసిన తేదీ నుండి మూడు సంవత్సరాలలోపు తమ క్లెయిమ్‌ల పరిష్కారం కోసం వారిని సంప్రదించవచ్చు. ఇదిలా ఉంటే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లోని విచక్షణ అధికారాల్ని వినియోగించి బ్యాంకుల పెద్దన్న ఈ నిర్ణయం తీసుకుంది. సీవోఏ క్యాన్సిలేషన్ డిసెంబర్ 31నే జరిగినప్పటికీ.. అధికారిక ప్రకటన మాత్రం జనవరి 4న చేసింది ఆర్బీఐ. చదవండి: బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ! -
బ్యాంకింగ్ సేవలు మరింతగా విస్తరించాలి
ముంబై: అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు చాలాకాలంగా ప్రత్యేక కృషి జరుగుతున్నా ఇప్పటికీ బ్యాంకింగ్ సదుపాయం అందుబాటులో లేని జిల్లాలు దేశంలో చాలా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. భారీ స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు జరిగే కొన్ని ప్రాంతాల్లో సైతం బ్యాంకింగ్ సరీ్వసులు లభించకపోతుండటం ఆశ్చర్యకరమని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ సర్వీసులను మరింతగా విస్తరించేందుకు అన్ని బ్యాంకులు నడుం బిగించాలని మంత్రి సూచించారు. ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయి శాఖలనో లేదా కనీస సరీ్వసులైనా అందించే అవుట్పోస్ట్లనో ఏర్పాటు చేయాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) 74వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) ఆమె పేర్కొన్నారు. ‘‘నేటికీ పలు జిల్లాల్లో పెద్ద పంచాయతీల్లో కూడా బ్యాంకు శాఖ అనేది ఉండటం లేదు. ఇకనైనా ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రాలుగా ఉంటున్న ప్రాంతాలను గుర్తించడంపై దృష్టి పెట్టాలి. గ్రామీణ ప్రాంతమే కావచ్చు ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా ఉన్న ప్రాంతాల్లో ఎంతో కొంతైనా బ్యాంకింగ్ సదుపాయాలు అందుబాటులో ఉండాలి కదా’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. బ్యాడ్ బ్యాంక్ అని పిలవొద్దు.. మొండిబాకీల పరిష్కారానికి ఉద్దేశించిన నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్)ను ‘బ్యాడ్ బ్యాంక్’గా పిలవొద్దని నిర్మలా సీతారామన్ సూచించారు. ప్రస్తుతం బ్యాంకుల ఖాతాలు మరిం త మెరుగ్గా ఉన్నాయని, దీనితో వాటికి అదనంగా మూలధనం సమకూర్చాల్సిన అవసరం తగ్గుతుం దని, తద్వారా ప్రభుత్వంపైనా ఆ మేరకు భారం తగ్గుతుందని ఆమె తెలిపారు. అన్ని రకాల వ్యాపార సంస్థల అవసరాలను బ్యాంకులు గుర్తెరిగి, తగు రీతిలో సహాయాన్ని అందిస్తేనే 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్ల ఎగుమతుల భారీ లక్ష్యాన్ని దేశం సాధించగలదని మంత్రి పేర్కొన్నారు. ఎస్బీఐ సైజు బ్యాంకులు నాలుగైదు ఉండాలి పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమ అవసరాలను తీర్చడానికి దేశీయంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ‘‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) స్థాయి’’ బ్యాంకులు 4–5 ఉండాలని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలికంగా డిజిటల్ ప్రక్రియలపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆమె తెలిపారు. కాబట్టి, స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా భారతీయ బ్యాంకింగ్ ఎలా ఉండాలన్నది పరిశ్రమ వర్గాలు నిర్దేశించుకుని, తగు రూపం ఇవ్వాలని మంత్రి సూచించారు. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ సజావుగా సాగేలా బ్యాంకర్లు కృషి చేశారని ప్రశంసించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలోనూ విధులు నిర్వర్తిస్తూ, మహమ్మారికి బలైన బ్యాంకింగ్ సిబ్బందికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆర్థికమంత్రికి జ్ఞాపికను బహూకరిస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈఓ రాజ్‌కిరణ్ -
నడ్డి విరిచిన అధిక వడ్డీ ఆశ
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో సత్యనారాయణపేటలో నివాసముంటున్న విజయలక్ష్మి చిట్టీలు నిర్వహించేది. హిందూపురం, పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్లతో పాటు కర్ణాటక ప్రాంతాలకు చెందిన దాదాపు 300 మంది నుంచి అధిక వడ్డీ ఆశ చూపి అప్పుల రూపంలో తీసుకుంది. ఈ డబ్బుతో ఫైనాన్స్ కంపెనీ నడుపుతోంది. రూ.50 కోట్లు పోగయ్యాక ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. దీంతో తాము మోసపోయామని బాధితులు టూటౌన్ పోలీసుస్టేషన్ సీఐ మన్సూరుద్దీన్‌కు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 100 మంది ఫిర్యాదులు అందజేశారు. వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోనూ ఫిర్యాదులు అందాయి. విజయలక్ష్మి భర్త చనిపోయాడని, ఆమెకు కుమారుడు అశోక్‌కుమార్ ఉన్నాడని బాధితులు తెలిపారు. కొడుకుతో కలిసే ఆమె ఈ మోసాలకు పాల్పడిందన్నారు. విజయలక్ష్మి కుటుంబం ఎక్కడి నుంచో వచ్చి హిందూపురంలో సెటిల్ అయ్యారని చెప్పారు. హిందూపురానికి వచ్చిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఈ వ్యవహారంపై విచారణ చేయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
బ్యాంక్ షేర్ల జోరు
బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు శుక్రవారం దుమ్ము రేపాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు కూడా తోడవడంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా లాభపడ్డాయి. దీంతో మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటంతో సెన్సెక్స్ కీలకమైన 41,500 పాయింట్లపైకి, ఎన్ఎస్ఈ నిఫ్టీ 12,200 పాయింట్ల ఎగువకు ఎగబాకాయి. జనవరి సిరీస్ డెరివేటివ్స్ పటిష్టమైన లాభాలతో ఆరంభమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 411 పాయింట్ల లాభంతో 41,575 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 119 పాయింట్ల ఎగసి 12,246 వద్ద ముగిశాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 4 పైసలు తగ్గి 71.36ను తాకినప్పటికీ, (ఇంట్రాడేలో) మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. అయితే వారం మొత్తంగా చూస్తే మాత్రం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. బుధవారం క్రిస్మస్ సెలవు కారణంగా ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగింది. ఈ నాలుగు రోజుల ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 107 పాయింట్లు, నిఫ్టీ 26 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి. నాలుగు సెన్సెక్స్ షేర్లకే నష్టాలు.... శుక్రవారం సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. ట్రేడింగ్ జరుగుతున్న కొద్దీ లాభాలు పెరుగుతూ పోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 447 పాయింట్ల లాభంతో 41,611 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. మొత్తం 411 పాయింట్ల సెన్సెక్స్ లాభాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ.. ఈ నాలుగు షేర్ల లాభాలే సగానికి (240 పాయింట్లు) పైగా ఉన్నాయి. మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లే (అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, టీసీఎస్, కోటక్ బ్యాంక్) నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్ 2.6% లాభంతో రూ.755 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. లాభాలు ఎందుకంటే.... 1. బ్యాంక్ షేర్ల ర్యాలీ... ఆపరేషన్ ట్విస్ట్‌లో భాగంగా ఆర్బీఐ సోమవారం నాడు రూ.20,000 కోట్ల విలువైన బాండ్ల క్రయ, విక్రయాలు జరపనుంది. ఫలితంగా బ్యాంక్‌ల ట్రెజరీ లాభాలు పెరుగుతాయి. పనితీరు, వ్యాపార వృద్ధి తదితర అంశాలపై చర్చించడానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (శనివారం) భేటీ కానున్నారు కూడా. ఈ సమావేశం నుంచి సానుకూల వార్తలు రానున్నాయన్న అంచనాలు పెరిగాయి. మరోవైపు మూడు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు (అలహాబాద్ బ్యాంక్, యూకో బ్యాంక్, ఐఓబీ) కేంద్రం పెట్టుబడులు అందించింది. దీనితో బ్యాంక్ షేర్లు జోరుగా పెరిగాయి. 2. అమెరికా– చైనా మధ్య ఒప్పందం అమెరికా– చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం తొలి దశ ఒప్పందంపై త్వరలోనే సంతకాలు జరగనున్నాయన్న తాజా వార్తలు మార్కెట్లో సెంటిమెంట్‌ను మెరుగుపరిచాయి. 3. కొనసాగుతున్న విదేశీ కొనుగోళ్లు.... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటిదాకా విదేశీ ఇన్వెస్టర్లు రూ.6,251 కోట్ల మేర నికర పెట్టుబడులు పెట్టారు. నవంబర్‌లో రూ.25,231 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విదేశీ మదుపర్లు మొత్తం మీద ఈ ఏడాదిలో మన స్టాక్ మార్కెట్లో రూ. లక్ష కోట్ల మేర పెట్టుబడుల పెట్టారు. -
ఫైనాన్స్ చేస్తున్న కానిస్టేబుల్ అరెస్టు
చిత్తూరు అర్బన్: ప్రజలకు సేవ చేయాల్సిన పోలీసు కానిస్టేబుల్ అక్రమ వడ్డీ వ్యాపారంలోకి దిగాడు. ద్విచక్ర వాహనాలకు ఫైనాన్స్ చేస్తూ ఉన్నతాధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. అతన్ని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్పీరాజశేఖర్‌బాబు అతన్ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకెళితే.. చిత్తూరు నగరంలోని ఆర్టీసీ డిపో రోడ్డులో ఉంటున్న గిరివాసులు (46) ఆర్ముడు విభాగం (ఏఆర్)లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతను పలువురు ఎమ్మెల్యేల వద్ద గన్‌మెన్‌గా పనిచేయడంతో బాగా పరిచయాలు పెంచుకున్నాడు. ఐదేళ్ల క్రితం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఫోన్ వెయిటింగ్ విభాగంలో సైతం పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో ఎన్ఎన్ కన్సల్టెన్సీ పేరిట ఏడేళ్ల క్రితం ఫైనాన్స్ కంపెనీ ప్రారంభించాడు. దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు. తన బంధువుల సాయంతో కన్సల్టెన్సీ నడుపుతూ ద్విచక్ర వాహనాలతోపాటు, కార్లకు ఫైనాన్స్ ఇస్తున్నాడు. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని రూ.50 వేలకు కొనడం.. దాని అవసరం ఉన్న వారికి రూ.10 వేలు కట్టించుకుని మిగిలిన రూ.40 వేలను ఫైనాన్స్ రూపంలో చెల్లించాలని ప్రామిసరీ నోటు రాయించుకునే వాడు. ఈ నేపథ్యంలో చిత్తూరు నగరానికి చెందిన ఓ వ్యక్తి రూ.50 వేలు చెల్లించి ఇన్నోవా వాహనాన్ని కొనుగోలు చేశాడు. మిగిలిన రూ.6 లక్షలను బయట ఫైనాన్స్ తీసుకుంటానని చెప్పాడు. మాట ప్రకారం అతను డబ్బు చెల్లించలేదు. దీంతో ఆగ్రహించిన గిరివాసులు ఇన్నోవా వాహనాన్ని తన వద్ద ఉంచుకున్నాడు. దీనిపై బాధితుడు ఎస్పీ రాజశేఖర్‌బాబును కలిసి ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాలతో గిరివాసులు ఇంటిని సోదా చేసి ఏం జరుగుతోందో నివేదిక ఇవ్వాలని చిత్తూరు డీఎస్పీ సుబ్బారావు తన సిబ్బం దిని ఆదేశించారు. రంగంలోకి దిగిన వన్, టూటౌన్ సీఐలు శ్రీధర్, వెంకటకుమార్, పది మంది సిబ్బంది గిరివాసులు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 200లకు పైగా ప్రామిసరీ నోట్లు, పలు వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల(ఆర్సీ)ను పోలీసులు సీజ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు, డబ్బులు చెల్లించకుంటే వారిపై భౌతిక దాడులకు దిగుతున్నందుకు గిరివాసులును అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. చాలా మంది తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఎస్పీ ఆగ్రహం.. విషయం తెలుసుకున్న ఎస్పీ రాజశేఖర్‌బాబు కానిస్టేబుల్ గిరివాసులు వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. గిరివాసులు నేరం చేసినట్లు ప్రాథమిక ఆధారాలు ఉండడంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులు ప్రజలకు సమాజానికి వారధిగా ఉండాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే దాని పర్యవసనం ఇలాగే ఉంటుందని హెచ్చరించారు. -
పట్టపగలు యువకుడి దారుణ హత్య
అంబర్‌పేట: పట్టపగలు యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన గురువారం అంబర్‌పేట పోలీస్‌ష్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించింది. ఇన్స్పెక్టర్ ఆనంద్‌కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గోల్నాక తిరుమలనగర్‌కు చెందిన సతీష్‌గౌడ్(27) పెయింటింగ్ పనులతో పాటు ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడు. ఇతనికి భార్య హిమబిందు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం సతీష్ గౌడ్ భార్యతో కలిసి బైక్‌పై దిల్‌శుక్‌నగర్ వెళుతుండగా బైక్‌ను అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు సతీష్‌గౌడ్‌ను బలవంతంగా తమ వెంట తీసుకెళ్లారు. దీంతో హిమబింధులు బంధువులకు సమాచారం అందించింది. చంపి రోడ్డుపై పడేశారు.. గోల్నాక కొత్తబ్రిడ్జి అమ్మవారి ఆలయం వద్ద యువకుని మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం అందడంతో అంబర్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా అప్పటికే అతను మృతి చెంది ఉన్నాడు. స్థానికుల సహకారంతో మృతుడిని సతీష్‌గౌడ్‌గా గుర్తించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కాగా సతీష్‌గౌడ్‌ను హత్య చేసిన వ్యక్తులు అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. -
ఖతర్నాక్ పావని!
- పైకి చీరల వ్యాపారం.. చేసేది వడ్డీ వ్యాపారం - ముత్తూట్‌లో 244 ఖాతాల్లో 8 కిలోల బంగారం తాకట్టు - పావనికి చింటూ అండ.. కస్టడీకి కోరనున్న పోలీసులు చిత్తూరు: నగరంలోని ఎస్బీఐ కాలనీకి చెందిన పావని గురించి బాధితుల్ని విచారిస్తున్న పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలుస్తున్నాయి. మూడేళ్లుగా పావని చిత్తూరులో చీరల వ్యాపారం చేస్తోంది. ఆమె భర్త చరణ్ అలియాస్ చెర్రీ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పావని కాలనీలోని మహిళలతో సన్నిహితంగా మెలుగుతూ వారి నుంచి అప్పులు తీసుకునేది. మూడేళ్ల కాలంలో చిత్తూరు నగరంతో పాటు శ్రీకాళహస్తి ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు మహిళల నుంచి నగదు, బంగారు ఆభరణాలు అప్పుగా తీసుకుంది. 2013 నవంబరు నుంచి 2015 డిసెంబరు వరకు చిత్తూరులోని ముత్తూట్ గోల్డ్ ఫైనాన్స్‌లో 244 ఖాతాలు తెరిచి 7.882 కిలోల బంగారు ఆభరణాలు కుదువ పెట్టింది. ఇందులో 1.30 కిలోల బంగారు ఆభరణాలను ముత్తూట్ సంస్థ వేలం వేయగా, 4.308 కిలోల ఆభరణాలను రూ.91 లక్షలు చెల్లించి పావని విడిపించుకుంది. 1.600 కిలోల ఆభరణాలను వారం క్రితం చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మూడు నెలల క్రితం శ్రీకాళహస్తి కోర్టులో ఐపీ దాఖలు చేసిన పావనిని నగల యజమానులు ఆభరణాలను ఇచ్చేయమని ఒత్తిడి తెచ్చారు. పావని తనను మోసగించి 406 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకెళ్లినట్లు నగరానికి చెందిన ఓఎం. రాందాస్ భార్య జ్యోత్న్స పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ బండారం బయటపడింది. చింటూపై కేసు ఈ నేపథ్యంలో పావని హరిదాస్ ద్వారా చింటూ వద్దకు వెళ్లి పరిచయం పెంచుకుంది. రాందాస్ భార్య జ్యోత్న్సతోపాటు పలువురు మహిళలను చింటూ బెదిరించినట్లు పోలీసుల రికార్డుల్లో నమోదయ్యింది. దీంతో పోలీసులు చింటూ, హరిదాస్, పావని, చెర్రీలపై ఐపీసీ 420, 384, 109 ఆర్డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారించడానికి చింటూ, హరిదాస్‌ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మేయర్ దంపతుల హత్యకు వారం ముందే పావనిని చింటూ బయటకు పంపించేశాడని, తరువాత ఇతను కూడా ఆమె వద్దకు వెళ్లనున్నట్లు సమాచారం రావడంతో ఆ దిశగా కూడా నెలక్రితం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు చెబుతున్నారు. -
ఖాకీల కిరికిరి..!
జిల్లాలోనూ పోలీసుల వడ్డీవ్యాపారం! బాధితులపై దౌర్జన్యం, బెదిరింపులు దృష్టి సారించిన పోలీస్ ఉన్నతాధికారులు పీఎస్‌లను తరచుగా తనిఖీ చేయనున్న ఎస్పీ, పైస్థాయి అధికారులు ఖమ్మం : కరీంనగర్లో అక్రమ వడ్డీ వ్యాపారం, బెదిరింపులు, దౌర్జన్యాలతో భూములు, ఇళ్లు, ఇళ్లస్థలాల స్వాధీనం వంటి ఆరోపణలతో కరీంనగర్ ఏఎస్సై మోహన్‌రెడ్డిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. జిల్లాలో కూడా పలువురు ఖాకీలు వడ్డీవ్యాపారం, గిరిగిరి, ప్రైవేట్ చిట్టీలు నడుపుతూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రూ.5 వడ్డీ నుంచి రూ.10 వడ్డీ వరకు కూడా వారు బాధితుల నుంచి వసూలు చేస్తున్నారు. వడ్డీకి నగదు ఇచ్చే సమయంలో వారి ఆస్తులను, నగలను తాకట్టు పెట్టుకోవడంతోపాటు వడ్డీలు కట్టలేని బాధితులను బెదిరించి చక్రవడ్డీలు వేస్తూ వారి ఆస్తులను తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నట్లు సమాచారం. కొంతమంది ఖాకీలు వారి కుటుంబ సభ్యులతో ప్రైవేట్ చిట్టీలు, గిరిగిరి నడుపుతూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తూ.. బాధితుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. మరికొంతమంది ఖాకీలు ఏకంగా ప్రైవేట్ సెటిల్మెంట్లలో తల దూరుస్తూ బినామీల పేర్లతో బాధితుల భూములను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో రంగనాథ్ ఎస్పీగా పనిచేసిన సమయంలో అక్రమ వడ్డీవ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులపై దాడులు నిర్వహించిన విషయం విదితమే. ఇందులో పలువురు పోలీసులు ఫైనాన్స్ వ్యాపారం, అక్రమ వడ్డీలు వసూలు చేస్తున్న పత్రాలను కూడా స్వాధీన పరుచుకున్న విషయం తెలిసిందే. దీనిపై గతంలో పలు పోలీస్స్టేషన్లలో సైతం బాధితులు ఫిర్యాదు చేశారు. ఖాకీల్లో అక్రమ వడ్డీ వ్యాపారాలు చేస్తున్న వారు బయట వారికే కాకుండా తోటి సిబ్బందికి కూడా వారి అవసరాన్ని బట్టి అధిక వడ్డీలకు నగదు ఇస్తూ వారి వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని సిబ్బందే వాపోతుండటం గమనార్హం. పలువురు ఖాకీల వద్ద బాధితులకు సంబంధించి వందల్లో ప్రామిసరి నోట్లు, చెక్‌లు ఉన్నట్లు సమాచారం. పోలీస్ హెడ్క్వార్టర్లలో కొన్నేళ్లుగా కొంతమంది ఖాకీలు ఈ వడ్డీ వ్యాపారాలు, ప్రైవేట్ చిట్టీలు నడుపుతున్నారని విమర్శలున్నా ఇప్పటి వరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు యథేచ్ఛగా తమ దందా కొనసాగిస్తున్నారు. కొంతమంది ఇలా సంపాదించిన డబ్బులతో భూములు, ఇళ్లు కొనుగోలు చేస్తున్నట్లు కూడా తెలిసింది. ఉన్నతాధికారుల నజర్ కరీంనగర్లో మోహన్‌రెడ్డి కేసు బయటపడటంతో పోలీస్ ఉన్నతాధికారులు జిల్లాపై కూడా ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిసింది. జిల్లావ్యాప్తంగా ఎవరెవరు వడ్డీ, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారు? ఇతర వ్యాపారాలతో సంబంధాలున్నాయా? అనే వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. బాధితులు ఎవరైనా ఖాకీల దందాలపై పోలీస్ ఉన్నతాధికారులకు నేరుగా ఫిర్యాదు చేస్తే అలాంటి వారిపై కఠినచర్యలు తీసుకోవడానికి కూడా ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు తెలిసింది. కరీంనగర్ ఘటన నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణలోని అన్ని జిల్లాల డీఐజీలు, ఎస్పీలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ, డీఐజీ స్థాయి అధికారులు తరచుగా ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ఆ స్టేషన్లలో జరిగే కార్యకలాపాలన్నింటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి ప్రతీ పోలీస్‌స్టేషన్‌ను ఉన్నతాధికారులు తనిఖీ చేసే అవకాశం ఉంది. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం, ప్రైవేట్ చిట్టీలు, రియల్ ఎస్టేట్ దందాలు, ప్రైవేట్ సెటిల్మెంట్లలో తలదూరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు డీజీపీ అనురాగ్‌శర్మ జిల్లా ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. -
ఐపీ పెట్టిన ఫైనాన్స్ వ్యాపారి
హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : గ్రామంలో ఓ వ్యక్తి రూ.50 వేలతో ప్రా రంభించిన ఫైనాన్స్ వ్యాపారం రెండేళ్లకు లక్ష ల టర్నొవర్‌కు చేరింది. ఆ మరుసటి ఏడాదే వ్యాపారి మెడలో బంగారు చైన్.. చేతికి ఉంగ రాలు వచ్చారుు. దీంతో అతడి ఫైనాన్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు గ్రామస్తులు ముం దుకొచ్చారు. ఇదే అదనుగా సదరు ఫైనాన్షియర్ సుమారు 70 మంది నుంచి సుమారు రూ.కోటి వరకు సేకరించాడు. ఐదేళ్లతో అతడి వ్యాపారం కోట్లకు చేరింది. కాని చివరికి తాను ఫైనాన్స్ వ్యాపారంలో నష్టపోయాయనని అతడు కోర్టును ఆశ్రయించాడు. విషయం ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. హసన్‌పర్తి మండలం వంగపహాడ్ గ్రామానికి చెందిన గండు రమేష్ అలియాస్ దుబాయి శ్రీనివాస్ అలియాస్ డాన్ శ్రీనివాస్ గ్రామంలో ఐదేళ్ల క్రితం ఫైనాన్స్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. వివిధ వర్గాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు లు సేకరించాడు. దీంతోపాటు వివిధ ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగాలు, ఆర్టీసీలో కండక్టర్ పోస్టులు, హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. సదరు వ్యాపారి విలాసవంతమైన జీవితం గడపడంతో అతడి మాటలను నమ్మి లక్షలాది రూపాయలు ఇచ్చారు. జల్సాలతోనే నష్టం.. వివిధ వర్గాల ద్వారా ఫైనాన్స్ వ్యాపారంలో డబ్బులు సేకరించిన గండు రమేష్ జల్సాలకు అలవాటుపడ్డాడు. వ్యాపారంలో నష్టం రావడంతో ఎవరికీ తెలియకుండా కోర్టును ఆశ్రయించాడు. తన వ్యాపారాన్ని యథావిధిగా కొనసాగిస్తూ వచ్చాడు. వారం రోజుల క్రితం కోర్టు నుంచి ఐపీ పొందాడు. తనకు ఇల్ల్లు, ఎకరంన్నర వ్యవసాయ పొలం, రెండు సీలింగ్ ఫ్యాన్లు, పది కుర్చీలు ఉన్నట్లు సదరు ఫైనాన్స్ వ్యాపారి కోర్టుకు విన్నవించాడు. ఐపీ పొందిన వెంటనే అతడు పరారయ్యూడు. కోర్టు నుంచి నోటీ సులు అందుకున్న బాధితులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కొక్కరు కనీసం రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు అతడి వద్ద డబ్బులు దాచుకున్నారు. కూతుళ్ల పెళ్లిళ్ల కోసం ఫైనాన్స్‌లో డబ్బులు దాచుకున్నవారు లబోదిబోమంటున్నారు.