శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యం
ఏటీ అగ్రహారం: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తానని రూరల్ జిల్లా కొత్త ఎస్పీ పీహెచ్‌డి.రామకృష్ణ చెప్పారు. లక్ష్య సాధన కోసం అధికారులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలిస్తానని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చిన ఆయన ప్రస్తుత ఎస్పీ జె.సత్యనారాయణ నుంచి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వా రంలో ఏడు రోజులూ, రోజులో 24 గంట లూ ప్రజలకు అందుబాటులో ఉంటాన ని చెప్పారు. పోలీస్ స్టేషన్‌లకు వచ్చే బాధితులకు నూరుశాతం న్యాయం చేయడమే లక్ష్యమని వివరించారు.
విధి నిర్వహణపై క్షేత్ర స్థారుు సిబ్బందికి అవగాహన కల్పించేందుకు డివిజన్‌వారీగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యమిస్తానని, వారి సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా తరహాలోనే ఇక్కడి సిబ్బందికి కూడా వీక్లీ ఆఫ్‌ను అమలు చేస్తామని ప్రకటించారు. సివిల్ వివాదాల్లో తలదూర్చితే ఎంతటివారినైనా ఉపేక్షించబోననీ, సివిల్ వివాదాల్లో క్రిమినల్ చర్యలు ఉంటేనే పోలీసుల ప్రమేయం ఉండాలని స్పష్టం చేశారు. సివిల్ పంచాయతీలు, వైట్ కాలర్ నేరాలకు పాల్పడేవారిపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామన్నారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.
సార్ ఎప్పటినుంచో తెలుసు.. ప్రస్తుత ఎస్పీ జె.సత్యనారాయణ తనకెప్పటినుంచో తెలుసని.ఇద్దరం కలిసి రాజమండ్రిలో విధులు నిర్వహించామని, తనకు గురువులాంటి వారని రామకృష్ణ చెప్పారు. ఉదయం ఆయన గుంటూరు పోలీస్ క్లబ్‌కు చేరుకున్నారు. 11 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీరభద్రస్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేకపూజల్లో పాల్గొన్నఅనంతరం సత్యనారాయణ నుంచి బాధ్యతలు తీసుకున్నారు.
పలువురి అభినందనలు.. కొత్త ఎస్పీ రామకృష్ణను ఏఎస్పీ డి.కోటేశ్వరరావు, ఏఆర్ ఏఎస్పీ కె.శ్రీనివాసరావు, ఓఎస్‌డీ వెంకటయ్య, అర్బన్ జిల్లా ఏఎస్పీలు జానకీ ధరావత్, బి.శ్రీనివాసులు, ఓఎస్‌డీ కె.జగన్నాథరెడ్డి, డీఎస్పీలు బి.సత్యనారాయణ, టి.పి.విఠలేశ్వర్, కె.గంగాధరం, టి.వి.నాగరాజు కలిసి అభినందించారు.