PHD ramakrishna
-
సింహపురి సింగం
పీహెచ్డీ రామకృష్ణ సింహపురి సింగంగా వినుతికెక్కారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తులు, వ్యక్తులపై ఉక్కుపాదం మోపారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, నేరస్తులు ఎంతటి వారైనా కటకటాలు లెక్కించాల్సిందేనని తన చర్యలతో నిరూపించారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు అవినీతి, అక్రమాలకు పాల్పడే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటూ సక్సెస్ ఫుల్ ఎస్పీగా అందరి మనన్నలు పొందుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తోనే సమస్యలు పరిష్కరించవచ్చని, నిస్వార్థ సేవతో పనిచేసే వారిని ప్రజలు ఎన్నటికి మరిచిపోరంటున్న జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ పాలనకు ఏడాది పూర్తయిన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నెల్లూరు: జిల్లా 41వ ఎస్పీగా పీహెచ్డీ రామకృష్ణ గతేడాది జూన్ 26వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందించడంతో పాటు సమాజంలో వేళ్లూనుకొని ఉన్న అసాంఘిక శక్తులు, కార్యకలాపాలను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు సాగారు. ప్రధానంగా ఎన్నో కుటుంబాలను బలి తీసుకొన్న క్రికెట్ బెట్టింగ్ మాఫియాపై దృష్టి సారించారు. బెట్టింగ్ మూలాలను వెలికి తీశారు. జిల్లా వ్యాప్తంగా 85 కేసులను నమోదు చేసి 439 మందిని కటకటాల వెనక్కి పంపారు. వారిలో 15 మంది జాతీయ, రాష్ట్ర స్థాయి బుకీలు, 40 మంది సబ్ బుకీలు, ఫెనాన్షియర్లుపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీంతో క్రికెట్ బెట్టింగ్‌కు బ్రేక్ పడింది. ఎర్రచందనంఅక్రమ రవాణా కట్టడిపై దృష్టి ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో కట్టడి చేసే దిశగా చర్యలు చేపట్టి రాష్ట్రంలోనే నెల్లూరు జిల్లాను మొదటి స్థానంలో ఉంచారు. ఏడాది కాలంలో 63 కేసులు నమోదు చేసి 860 మందిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు పాత కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న 400 మంది ఎర్రదొంగలను కటకటాల వెనక్కి పంపారు. వారి వద్ద నుంచి రూ.35 కోట్లు విలువ చేసే సుమారు 27 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా చైనా, టిబెట్, హాంకాంగ్, నేపాల్ దేశాలకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లతో పాటు, జాతీయ స్థాయిలో పేరొందిన స్మగ్లర్లందరిని దాదాపు కటకటాల వెనక్కి పంపారు. తీరుమారని 8 మంది ఎర్రస్మగ్లర్లపై పీడీ యాక్ట్‌లు నమోదు చేసి వారి ఆస్తులను సైతం జప్తు చేశారు. దీంతో స్మగ్లర్లు బెంబేలెత్తిపోయారు. అనంతపురం, నెల్లూరు జిల్లా మీదుగా ఎర్రచందనం అక్రమ రవాణా సాగుతుందన్న విషయాన్ని పసిగట్టి అంతర్ రాష్ట్ర ముఠాను ఇటీవల అరెస్ట్ చేశారు. సిలికా..ఇసుకాసురులపై.. జిల్లాలో ఇసుక, సిలికా అక్రమరవాణాను సాధ్యమైనంత మేర కట్టడి చేశారు. సిలికా, ఇసుక రవాణాచేసే వాహనాలకు జీపీఎస్‌ను అమర్చి అక్రమరవాణాకు గండికొట్టారు. ఈ క్రమంలో కొన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ ఎట్టిపరిస్థితుల్లోనూ సిలికా, ఇసుక అక్రమరవాణాను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అక్రమ రవాణాకు సహకరించే మైనింగ్ యజమానులపై సైతం కేసులు నమోదు చేయడం, పోలీసు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో అక్రమార్కుల గుండెళ్లో రైళ్లు పరుగెత్తించారు. అవినీతి,అక్రమార్కులపై రామాస్త్రం అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న, సహకరిస్తున్న సిబ్బందిపై రామాస్త్రాం సంధించారు. ఎన్నో ఏళ్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో పాతుకుపోయిన మినిస్టీరీయల్ సిబ్బందిపై బదిలీ వేటు వేసి తనదైన ముద్రవేసుకొన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జీడీలపై వేటు వేశారు. ఇద్దరు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, ఏడుగురు ఎస్సైలను సస్పెండ్ చేశారు. అనేక మందిని సిబ్బందిని వీఆర్‌కు పంపారు. ఒక వైపు అవినీతి సిబ్బంది ఆటలు కట్టిస్తూనే మరోవైపు సిబ్బంది సంక్షేమానికి తనవంతు కృషి చేస్తున్నారు. సిబ్బంది సమస్యల పరిష్కారానికి వారధి కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చారు. తద్వారా వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు ఎస్బీ ఇన్స్పెక్టర్, సీసీని ఏర్పాటు చేసి వారి ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా పోలీసు కుటుంబాల్లోని చిన్నారులకు సైతం ఫీజు రాయితీపై కార్పొరేట్ విద్యనందించేలా చర్యలు తీసుకున్నారు. పారదర్శకంగా సిబ్బంది బదిలీలు నిర్వహించి అందరి మనన్నలు పొందారు. సిబ్బంది అందరికి అన్ని విభాగాల్లో శిక్షణనిచ్చి సుక్షితులైన సైన్యంగా తీర్చిదిద్దారు. ఇంకా మరెన్నో చర్యలు ♦ గుట్కా విక్రయాలపై కఠినంగా వ్యవహరించారు. జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి 143 కేసులు నమోదు చేసి 283 మంది గుట్కా విక్రేతలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2.50 కోట్లు విలువ చేసే గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. ♦ రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు, సిబ్బందిని సమన్వయం చేసి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ప్రమాదాలకు మితిమీరిన వేగం, డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడపడం, మద్యం మత్తులో వాహనాలు నడపడం తదితర కారణాలను గుర్తించి వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. డ్రైవింగ్ లైసెన్సు లేని 8 వేల మందిపై కేసులు నమోదు చేశారు. దీంతో జిల్లాలో 60 వేల మంది వాహనచోదకులు ఏడాది కాలంలో లైసెన్సులు తీసుకున్నారు. పోలీసు చర్యలతో గతంతో పోల్చి చూస్తే ఈ ఏడాది ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. ఈ ఏడాది జనవరి నుంచి చేపట్టిన జాతీయ రహదారిపై స్టాఫ్ వాష్ అండ్ గో కార్యక్రమం సత్ఫలితాలిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై 9 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ♦ నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్ వ్యవస్థలో మార్పులు చేసి పూర్తిస్తాయిలో క్రమబద్ధీకరించారు. ♦ శాంతిభద్రతల పరిరక్షణలో రాజీలేని ధోరణి ప్రదర్శిస్తున్నారు. అసాంఘిక శక్తులపై పూర్తిస్థాయిలో ఉక్కుపాదం మోపారు. ఫలితంగా నేరాలు కొంత మేర తగ్గుముఖం పట్టాయి. ప్రాపర్టీ కేసులను గణనీయంగా తగ్గించారు. ఏడాది కాలంలో 700 మంది నేరస్తులను అరెస్ట్ చేసి రూ.7 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిíßంచి ప్రజలను చైతన్యవంతులను చేశారు. ♦ సైబర్‌ల్యాబ్‌కు జిల్లాకు రూ.2.50 కోట్లు ని«ధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పరిపాలనాపరమైన ఆమోదముద్ర లభించకపోవడంతో నిధులు విడుదల కాలేదు. దీంతో సైబర్‌ల్యాబ్ ఆవశ్యకతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రూ.30 లక్షలతో ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో సైబర్‌ల్యాబ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అటు ప్రజలు, ఇటు పోలీసు సిబ్బందిలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. డాదిపాలన సంతృప్తికరం జిల్లాలో పోలీసు విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిది. అయినప్పటికి అన్ని వర్గాల ప్రజల సహకారంతో ఏడాది పాలనను పూర్తి చేయడం సంతృప్తినిచ్చింది. ప్రధానంగా ప్రజల బతుకులను ఛిద్రం చేస్తోన్న క్రికెట్ బెట్టింగ్, బెల్టు షాపులు, గుట్కా, పేకాట తదితరాలను సాధ్యమైనంత మేరకు కట్టడి చేశాం. అన్ని ఒత్తిళ్లను అధిగమిస్తూ ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందిస్తున్నా. సిబ్బంది సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం. తాను ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాజకీయ పోస్టింగ్‌లు లేవు. అర్హత, సీనియార్టీ ప్రాతిపదికన పోస్టింగ్‌లు వేశా. అవినీతి పరులు ఏ స్థాయిలో ఉన్న ఉపేక్షించేదిలేదు. ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు అందించడమే ప్రధాన లక్ష్యం.– పీహెచ్డీ రామకృష్ణ, ఎస్పీ -
నెల్లూరు సరిహద్దుల్లో పార్ధిగ్యాంగ్..!
సాక్షి, నెల్లూరు(క్రైమ్) : దేశంలోనే అత్యంత కరుడు గట్టిన నరరూప రాక్షసులుగా పిలువబడే పార్ధిగ్యాంగ్ చిత్తూరు–తమిళనాడు, చిత్తూరు–నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో సంచరిస్తుందంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో జిల్లా పోలీసు యంత్రాగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ శుక్రవారం సిబ్బందితో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్ధిగ్యాంగ్ కదలికలపై నిఘా ఉంచాలన్నారు. జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారి వెంబడి, రైల్వేస్టేషన్ సమీప ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. నిందితులు దాడులకు తెగబడే అవకాశమున్న దృష్ట్యా గస్తీ సిబ్బంది విధిగా ఆయుధాలు (షాట్ వెపన్స్)ను వెంట ఉంచుకోవాలన్నారు. అవసరమైతే కాల్చివేయడానకి వెనుకాడవద్దని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బంది తనిఖీలు ముమ్మరం చేశారు. ఎవరీ పార్ధిగ్యాంగ్! మహారాష్ట్ర–మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన వారు. మహారాష్ట్రలోని చత్రీ, పర్బాని, నాసిక్, ఇంజన్‌ఘాట్, గుల్బర్గా, బాంబే, ఔరంగాబాధ్, మధ్యప్రదేశ్, భూపాల్ తదితర ప్రాంతాల్లో వీరు నివసిస్తుంటారు. వీరి కుటుంబాల్లో అందరూ దోపిడీలు, దొంగతనాలు చేయడంలో సిద్ధహస్తులు. కుటుంబాలతో ఉపాధి కూలీల్లా ఇతర ప్రాంతాలకు తరలి వెళుతారు. గ్రామ సరిహద్దులు, పట్టణ శివార్లు, ఫ్లై ఓవర్ బ్రిడ్జిల కింద, రైల్వేస్టేషన్, బస్స్టేషన్ల సమీపంలో గుడారాలు వేసుకుని సంచార జీవనం సాగిస్తారు. మహిళలు పగటి వేళల్లో పరిసర ప్రాంతాల్లో చిత్తుకాగితాలు ఏరుకోవడం, పిన్నీసులు, పూసలు అమ్మడం, యాచకుల్లా జీవనం చేస్తూ తమ పనులకు వీలుగా ఉండే ఇంటిని లక్ష్యంగా ఎం చుకుంటారు. రాత్రి వేళల్లో ఆ ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతారు. ఆ సమయంలో వారి కదలికలను ఎ వరూ గుర్తుపట్టకుండా ఉండేలా జాగ్రత్త పడుతారు. ఆనవాళ్లు దొరక్కుండా.. వీరు దొంగతనం చేసే ఇంటికి వెళ్లిన సమయంలో తమ ఆనవాళ్లను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. వీరి వ్యవహారశైలి అత్యంత క్రూరంగా ఉంటుంది. లక్ష్యంగా ఎంచుకొన్న ఇంట్లో భయానక వాతావరణం సృష్టిస్తారు. ఇంట్లో ఉన్న చిన్న, పెద్దా, వృద్ధులు, వికలాంగులు తేడా లేకుండా అందర్ని అతి క్రూరంగా (రాడ్లు, కర్రలతో తలపై విచక్షణా రహితంగా కొట్టడం, కత్తులతో గొంతులు కోయడం) మట్టుపెట్టి అందిన కాడికి దోచుకెళుతారు. నేరానికి పాల్పడే సమయంలో ఎవరు అడ్డొచ్చినా వారిని హత మారుస్తారు. పార్ధి గ్యాంగ్‌లు సుమారు 10 ఉండొచ్చని పోలీసులు అంచనా. ఒక్కో బృందంలో 14 నుంచి 20 మంది సభ్యులు ఉంటారని సమాచారం. గ్యాంగ్‌లో పురుషులే కాదు మహిళలు సైతం చురుగ్గా వ్యవహరిస్తారు. ఈ గ్యాంగ్‌కు సంబంధించిన పలువురిని 2014లో వరంగల్, 2015లో విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. 2015 ఆగస్టులో కండి జైలు నుంచి సంగారెడ్డి కోర్టుకు తరలిస్తున్న నలుగురు పార్థిగ్యాంగ్ సభ్యులు తప్పించుకున్నారు. 2005లో నెల్లూరులో దొంగతనం పార్ధిగ్యాంగ్ గతంలో నెల్లూరులో దొంగతనానికి పాల్పడింది. 2005లో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎంజీ బ్రదర్స్ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. రెండు రోజులు రెక్కీ నిర్వహించి చోరీకి పాల్పడ్డారు. ఇంటి కుక్కలకు మత్తు బిస్కెట్లు వేసి వాచ్‌మన్‌ను హత్య చేశారు. ఈ ఘటన అప్పట్లో జిల్లా వ్యాప్తంగా పెద్ద కలకలం సృష్టించింది. కావలిలోనూ ఇదే తరహాలో నేరానికి పాల్పడినట్లు సమాచారం. అప్రమత్తంగా ఉండాలి జిల్లా సరిహద్దులో పార్ధిగ్యాంగ్ సంచరిస్తుందన్న సమాచారం. ముందస్తు చర్యల్లో భాగంగా సిబ్బం దిని అప్రమత్తం చేశాం. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశాం. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. తమ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, కొత్తవారు తారసపడితే వెంటనే డయల్ 100కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. – పీహెచ్డీ రామకృష్ణ, జిల్లా ఎస్పీ -
ఆపరేషన్ లాడ్జి
నెల్లూరు(క్రైమ్): లాడ్జీలపై పోలీసు నిఘా కొరవడింది. అసాంఘిక శక్తులు లాడ్జీల్లో మకాం వేసి నేరాలకు పాల్పడుతున్నట్లు పలు ఘటనలపై విచారణలో వెలుగుచూసింది. దీంతో జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ లాడ్జీ లపై దృష్టి సారించారు. క్రమం తప్పకుండా లాడ్జీల్లో తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో శనివారం అర్ధరాత్రి జిల్లా వ్యాప్తం గా పోలీసులు తమ ప్రాంతాల్లోని లాడ్జీల్లో రెండు గంటల పాటు తనిఖీలు చేపట్టారు. నెల్లూరు నగరంలోని 40 లాడ్జీలు, నెల్లూరు రూరల్ పరిధిలో 11, గూడూరులో 15, కావలిలో 14, ఆత్మకూరులో 5 లాడ్జీల్లోని ప్రతి గదిని తనిఖీ చేశారు. తనిఖీల్లో పలువురు అనుమానాస్పదంగా దొరకడంతో వారి పూర్తి వివరాలను సేకరించారు. నగరంలోని బాబుఐస్‌క్రీం సమీపంలో గల ఓ లాడ్జీల్లో పోలీసు తనిఖీల సందర్భంగా ఒక మహిళ, ఇద్దరు విటులు పోలీసులకు చిక్కారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ లాడ్జీల్లో దిగేవారి పూర్తి వివరాలను సేకరించి విధిగా ప్రతిరోజు పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు వస్తే వెంటనే పోలీస్‌స్టేషన్‌కు ఫోను చేసి తెలపాని చెప్పారు. తనిఖీల్లో నగరంలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నాు. -
ఆ ఎస్ఐ తీరేవేరు !
ఏకపక్ష చర్యల్లో బి.మఠం పోలీసులు ఎస్పీ నిక్కచ్చిత్వాన్ని ప్రోత్సహిస్తున్నా... మారని కిందిస్థాయి అధికారులు కడప: నిజాయితీ, నిబద్ధత, బాధితులకు సమన్యాయం, విధి నిర్వహణలో నిక్కచ్చితత్వాన్ని కడప ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ప్రోత్సహిస్తున్నారు. కానీ కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి ఆ స్పృహ ఇప్పటికీ ఉండడం లేదు. అధికారపార్టీ నేతలు కనుసైగలు చేస్తే చాలు, చట్టాన్ని వారి చుట్టంగా మలుస్తున్నారు. నిందితుల పట్ల సమన్యాయం కరువవుతోంది. వివాదం ఒక్కటే అయినా సెక్షన్లు వర్తింపజేయడంలో వివక్ష చూపుతున్నారు. తుదకు ఆస్పత్రిలో చికిత్సలు చేయించుకుంటున్నా సరే...బలవంతంగా అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ కోవలోకి జిల్లాలోని బి.మఠం ఎస్ఐ ముందు వరుసలో నిలుస్తున్నారు. అనధికార ఎమర్జెన్సీ అమలు మైదుకూరు నియోజకవర్గ పరిధిలో గత కొంతకాలంగా అనధికార ఎమర్జెన్సీ అమలులో ఉంది. అందుకు పలు ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయి. ఫెస్టిసైడ్స్ వ్యాపారులు టీడీపీ తీర్థం పుచ్చుకోకపోతే వ్యవసాయాధికారులు తనిఖీలంటూ వేధింపులకు పాల్పడుతారు. రేషన్‌డీలర్లు పార్టీ మారకపోతే విజిలెన్సు కేసులు, రెవెన్యూ అధికారుల వేధింపులు ఉత్పన్నమౌతాయి. ఉపాధిహామీ పథకం పీల్డ్ అసిస్టెంట్లు జై కొట్టకపోతే తప్పుడు కేసులు నమోదు. పోలీసు అధికారులు కొందరు స్వయంగా పార్టీ ఫిరాయించాల్సిందిగా, పచ్చకండువా కప్పుకోవాల్సిందిగా నిసిగ్గుగా ఒత్తిడి తెస్తున్నారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అన్నీశాఖల అధికారులు 95శాతం ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడమే అందుకు కారణంగా తెలుస్తోంది. తుదకు అంత్యక్రియలు, కర్మక్రియలకు హాజరయ్యేందుకు కూడా ఆంక్షలు పెడుతున్న ఘటనలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మైదుకూరు నియోజకవర్గ ప్రజల్లో అధికారుల పట్ల క్రమేపీ విశ్వాసం సన్నగిల్లింది. ఎంతోకొంత పోలీసుశాఖ నిక్కచ్ఛిగా విధులు నిర్వర్తిస్తే ఆ భావన కనుమరుగయ్యే అవకాశం ఉంది. వారిలోనూ చిత్తశుద్ధి కొరవడింది. వివాదం ఒక్కటే.. వేర్వేరు సెక్షన్లు బి.మఠం మండలం డి.నేలటూరులో మన్నెం శంకర్‌రెడ్డి, మన్నెం సుబ్బారెడ్డి అనే దాయాదుల మధ్య వివాదం నెలకొంది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఇరువర్గాలు రాళ్ల దాడికి గురయ్యారు. ఈ ఘటన గత శనివారం చోటుచేసుకుంది. అయితే పోలీసులు మన్నెం సుబ్బారెడ్డి వర్గంపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. శంకర్‌రెడ్డి వర్గీయులపై మాత్రం బెయిల్‌బుల్ సెక్షన్లతో కేసు పెట్టారు. అంతటితో ఆగకుండా హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటున్న వారిని సైతం కేసులో చొప్పించడం గమనార్హం. ఇంతటి ఏకపక్ష చర్యలకు ఏకైక కారణం అధికారపార్టీ ఆదేశాలేనని తెలుస్తోంది. కేసు నమోదులోనే వివక్ష అనుకుంటే పొరపాటే. రిమ్స్‌లో చికిత్సలు పొందుతున్నా సుబ్బారెడ్డి, ఈశ్వరరెడ్డిలను బుధవారం మధ్యాహ్నం పోలీసులు పట్టుకెళ్లారు. బి.మఠం ఎస్ఐ రంగస్వామి తన సిబ్బందితో కలిసి వైద్యులు డిశ్ఛార్జి చేయకపోయినా బెడ్‌పై ఉన్న వారిద్దరిని కేసులో నిందితులంటూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అదే విషయాన్ని రిమ్స్ మెడికల్ రికార్డులో సైతం వైద్యసిబ్బంది పొందుపర్చారు. ఇప్పటికే మరో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నా వారిని అరెస్టు చూపడం విశేషం. కాగా రిమ్స్‌లో చికిత్స పొందుతున్న సుబ్బారెడ్డి, ఈశ్వరరెడ్డిలను స్టేషన్‌కు తీసుకెళ్లాక వారి ఆరోగ్యం దెబ్బతిన్నట్లు సమాచారం. స్థానికంగా ఓ ఆర్ఎంపీ ద్వారా చికిత్సలు చేయించినట్లు తెలుస్తోంది. పొద్దుపోయాక రిమ్స్‌కు తిరిగి అప్పగించాలనే దిశగా పోలీసులు ఆలోచనలో పడ్డట్లు సమాచారం. ఒకే కేసులో విపత్కర పరిస్థితులను బి.మఠం పోలీసులు సృష్టిస్తుండడం విశేషం. ఎస్పీ కొరడా ఝుళిపిస్తున్నా..... జిల్లా పోలీస్ బాస్‌గా వారం రోజుల క్రితం రామకృష్ణ బాధ్యతలు చేపట్టారు. తనదైన శైలిలో విధులు నిర్వర్తిస్తూ పోలీసు అధికారుల్లో అలసత్వాన్ని పోగొట్టేందుకు కృషిచేస్తున్నారు. మరోవైపు పోలీసుల సంక్షేమం వైపు దృష్టి సారిస్తూ పని ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించేందుకు వీక్లీ ఆఫ్ తీసుకోవాల్సిందిగాా ఉత్తర్వులిచ్చారు. పనితీరులో తప్పిదాలపై కఠిన వైఖరి ప్రదర్శిస్తూ ఛార్జి మెమోలు జారీ చేశారు. ఎస్పీ నిశితంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో సైతం కొందరు అధికారులు ఏకపక్ష చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. ఈక్రమంలో బి.మఠం పోలీసులు ఉదంతాన్ని పలువురు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికైనా ఎస్పీకి తగ్గట్లుగా యంత్రాంగం నడుచుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దారితప్పుతున్న పోలీసు అధికారులను నియంత్రించాల్సిన ఆవశ్యకత ఎస్పీపై మరింతగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్ఐ ఏమన్నారంటే..... బి.మఠం మండలం దిగువ నేలటూరులో పరస్పర ఘర్షణ చోటుచేసుకుంది. ఓ వర్గానికి చెందిన వారికి తలకు బలమైన గాయాలయ్యాయి. ఆకారణంతో హత్యాయత్నం కేసు నమోదు చేశాం. రిమ్స్‌లో ఎంఎల్సీ అడ్మిషన్లో ఉన్న నిందుతులు ఇదివరకే డిశ్ఛార్జి అయ్యారు. రిమ్స్ నుంచి మేము అదుపులోకి తీసుకోలేదు. -
పోలీసుల హైడ్రామా !
‘సరస్వతి’ భూముల కేసు * నిందితులను కోర్టుకు తరలింపులో ఆద్యంతం గోప్యం * తొలుత మధ్యాహ్నం అని చెప్పి రాత్రి వేళ వరకు తాత్సారం.... * బంధువులను స్టేషన్ నుంచి పంపి తరిమికొట్టిన పోలీసులు * సంబంధం లేని వారినీ కేసులో ఇరికించారని వెల్లువెత్తిన ఆరోపణలు * మీడియాకు సైతం వివరాలు వెల్లడించని వైనం పిడుగురాళ్ల: మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామంలో కొద్దిరోజుల కిందట జరిగిన సరస్వతి ఇండస్ట్రీస్ భూముల వివాదంలో నిందితులను కోర్టుకు తరలించటంలో హైడ్రామా నడిచింది. తొలుత మధ్యాహ్నం కోర్టులో హాజరు పరుస్తామని చెప్పిన పోలీసు అధికారులు నిందితులను బయటకు తీసుకువచ్చి రాత్రి వేళ వరకు తాత్సారం చేశారు. వారిని కోర్టుకు తీసుకువెళ్లేందుకు ఒక స్కూలు బస్సును మధ్యాహ్నం 3 గంటలకే రప్పించినా ఎంతకీ ఎక్కించలేదు. * తొలుత నిందితుల తరఫు బంధువులన స్టేషన్ నుంచి బయటకు పంపిన పోలీసులు, అక్కడ నుంచి వెళ్లి బయట కూర్చున్న వారిని ఆ ప్రాంతాల్లో లేకుండా తరిమి తరిమి కొట్టారు. * మీడియాకు కనీస సమాచారం ఇవ్వకుండా ఆద్యంతం గోప్యంగా వ్యవహరించారు. దీంతో నిందితులతోపాటు విలేకరులు కూడా గంటల తరబడి పోలీస్‌స్టేషన్ వద్ద వేచిచూడాల్సి వచ్చింది. * సాధారణంగా ఏ కేసులోనైనా నిందితులను మీడియా ముందుకు తీసుకువచ్చి కేసు వివరాలు వెల్లడించిన తర్వాత కోర్టుకు తరలించటం జరుగుతుంటుంది. ఈ కేసులో మాత్రం అటువంటిదేమీ లేకుండా, కేసు వివరాలు చెప్పకుండా గోప్యంగా వ్యవహరించటాన్ని బట్టి అధికార పార్టీ నాయకుల సూచనల మేరకే పోలీసు అధికారులు వ్యవహరించారని పలువురు విమర్శిస్తున్నారు. * ఈ కేసులో అసలైన నిందితులను కాకుండా, ఎలాంటి సంబంధం లేనివారిని ఇరికించారని, ఆ విషయం బయటపడుతుందనే ఉద్దేశంతో మీడియాకు సమాచారం ఇవ్వలేదని పలువురు ఆరోపిస్తున్నారు. తొలివిడతగా 29 మందిపై... * సరస్వతీ ఇండస్ట్రీస్ భూముల వివాదంలో మాచర్ల పరిసర ప్రాంతాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన పోలీసులు సుమారు 40 మందికి పైగా అరెస్టుచేసి స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. * వారిలో తొలివిడత గురువారం 29 మందిని కోర్టులో హాజరు పరిచేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. * వీరిలో ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, మిగిలినవారిపై 324 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెబుతున్నారు. * రాత్రి 8.30 గంటల వరకు నిందితులను కోర్టుకు తరలించే ప్రయత్నంలోనే అధికారులు ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది. అధికార పార్టీకి తొత్తులుగా... సాక్షి, గుంటూరు: పరిశ్రమ స్థాపించి వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో సరస్వతి సిమెంట్స్ యాజమాన్యం రైతుల వద్ద నుంచి మార్కెట్ కంటే రెట్టింపు ధరకు భూములు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంస్థ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురి చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. * దీనిలో భాగంగా ఈ నెల 7న తాము కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించుకున్న భూముల్లో వేసిన పంటలను తొలగించేందుకు వెళ్లిన సరస్వతి యాజమాన్యంపై టీడీపీకి చెందిన కొందరు దాడులకు దిగారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన సరస్వతి యాజమాన్యంపైనే అధికార పార్టీ నేతల అండతో పోలీసులు పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. * వివిధ గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీకి అనుకూలంగా ఉండే బలమైన వ్యక్తులను ఈ కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. * గొడవ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతంలో లేకపోయినప్పటికీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 307, 354, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారంటే పోలీసుల తీరు ఏవిధంగా అర్థం చేసుకోవచ్చు. అర్ధరాత్రి పూట వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లల్లోకి చొరబడి సోదాల పేరుతో పోలీసులు నానా యాగి చేస్తున్నారు. కేసులో అనేక లొసుగులు... * సరస్వతి భూముల వద్ద ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడినప్పటికీ కేవలం ఒక వర్గంపై మాత్రమే కేసులు నమోదు చేసి పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారు. * సరస్వతి భూములతో సంబంధం లేని బచ్చలపూరి రవి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుమారు 250 మందిపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అధికార పార్టీ చేపట్టిన కక్షసాధింపు చర్యల్లో పోలీసులు భాగస్వాములు అయ్యారనే ఆరోపణలు వినవస్తున్నాయి. * రైతులను రెచ్చగొట్టి భూముల వద్దకు తీసుకు వచ్చిన టీడీపీ నేతలు వారిని ఆత్మహత్యలకు ఉసిగొలిపి కిరోసిన్ పోసుకునేలా చేశారు. అయితే పోలీసు కేసుల్లో మాత్రం వారిపై హత్యాయత్నం జరిగినట్టుగా నమోదు చేశారు. * 250 మందిపై ఒకేసారి హత్యాయత్నం, ఎస్సీలను కులం పేరుతో దూషించడం, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చేయడం ఎలా సాధ్యమో పోలీసులు, అధికారపార్టీ నేతలకే తెలియాలి. కేసుకు సంబంధం లేని వారిని ఇరికించం సరస్వతి భూముల వద్ద ఈ నెల 7న జరిగిన సంఘటనలో గాయపడిన వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న వ్యక్తులు మినహా ఎవరిపై తప్పుడు కేసులు పెట్టే సమస్య లేదు. చట్టప్రకారం మా విధి మేము నిర్వర్తిస్తాం. - రూరల్ జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ -
ఇసుక మాఫియాకు సహకరిస్తే వేటు
రూరల్ జిల్లా ఎస్పీ రామకృష్ణ సాక్షి, గుంటూరు: జిల్లాలో ఇసుక మాఫియాపై కొరడా ఝుళిపించేందుకు రూరల్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ సిద్ధమయ్యారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు రీచ్‌లు ఉన్న పోలీస్స్టేషన్ల ఎస్హెచ్ఓలు, సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. ఇసుక అక్రమ రవాణాకు సహకరించినా, అరికట్టడంలో అలసత్వం వహించినా పోలీసు అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు. అక్రమ రవాణా అరికట్టేందుకు ఒక డీఎస్పీ, సీఐ, నలుగురు ఎస్సైలతో ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రూరల్ జిల్లా ఎస్పీ రామకృష్ణ శనివారం ‘సాక్షి’తో మాట్లాడారు..ఆ వివరాలు ఆయన మాటల్లోనే... ఇప్పటికే దాడులు నిర్వహించి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని, లారీలు, ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నాం. అక్రమ రవాణాను అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొల్లిపర ఎస్సై ప్రభాకర్‌ను వీఆర్‌కు పిలిచాం. ►శాంతి భద్రతల విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తా, పోలీసుల వైఫల్యం ఉంటే తప్పక చర్యలు తీసుకుంటా. లాటరీ, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలకు వెనుకాడం. ►పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాముఖ్యత ఇస్తున్నాం.. రూరల్ పరిధిలో సిబ్బంది కొరత వల్ల పనిభారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి, తొలిసారిగా సిబ్బందికి వీక్లీ ఆఫ్‌లు మంజూరు చేస్తున్నా. స్టేషన్‌లోని సిబ్బందిని బట్టి రోజుకు ముగ్గురు, నలుగురు చొప్పున సెలవు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చా. ►‘వారథి’ కార్యక్రమం ద్వారా సిబ్బందికి ఉండే పాలనాపరమైన సమస్య లు తెలుసుకునేందుకు ఒక సీఐతో టీమ్‌ను ఏర్పాటు చేసి ఎస్ఎంఎస్ సౌకర్యం కల్పించాం. ►సిబ్బంది నిత్యవసర వస్తువులు తదితర వాటిని కొనుగోలు చేసేందుకు త్వరలో గురజాలలో పోలీసు సబ్ క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇదే తరహాలో నరసరావుపేట, బాపట్ల, సత్తెనపల్లి, తెనాలిలలో కూడాఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 20 నుంచి 40 శాతం రాయితీతో నిత్యవసర వస్తువులు సరఫరా చేస్తాం. ►కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకున్న 15 మంది హోంగార్డులను విధుల్లోకి తీసుకోవడం లేదు. మేం కూడా కోర్టులో కౌంటర్ దాఖలు చేస్తాం. ఫ్యాక్షన్‌పై ఉక్కుపాదం ... ►జిల్లాలోని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఫ్యాక్షన్‌కు పాల్పడు తున్నవారిపై ఉక్కుపాదం మోపనున్నట్టు జిల్లా రూరల్ ఎస్పీ పి.హెచ్.డి. రామకృష్ణ తెలిపారు. ►గురజాల, మాచర్ల, నరసరావుపేట నియోజకవర్గాల్లోని గ్రామాల్లో ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. ►గొడవలకు పాల్పడేవారిని గుర్తించి తమదైన పద్ధతిలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, ఇప్పటికే ఆయా ప్రాంతాల పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. -
శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యం
ఏటీ అగ్రహారం: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తానని రూరల్ జిల్లా కొత్త ఎస్పీ పీహెచ్‌డి.రామకృష్ణ చెప్పారు. లక్ష్య సాధన కోసం అధికారులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలిస్తానని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చిన ఆయన ప్రస్తుత ఎస్పీ జె.సత్యనారాయణ నుంచి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వా రంలో ఏడు రోజులూ, రోజులో 24 గంట లూ ప్రజలకు అందుబాటులో ఉంటాన ని చెప్పారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకు నూరుశాతం న్యాయం చేయడమే లక్ష్యమని వివరించారు. విధి నిర్వహణపై క్షేత్ర స్థారుు సిబ్బందికి అవగాహన కల్పించేందుకు డివిజన్‌వారీగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యమిస్తానని, వారి సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా తరహాలోనే ఇక్కడి సిబ్బందికి కూడా వీక్లీ ఆఫ్‌ను అమలు చేస్తామని ప్రకటించారు. సివిల్ వివాదాల్లో తలదూర్చితే ఎంతటివారినైనా ఉపేక్షించబోననీ, సివిల్ వివాదాల్లో క్రిమినల్ చర్యలు ఉంటేనే పోలీసుల ప్రమేయం ఉండాలని స్పష్టం చేశారు. సివిల్ పంచాయతీలు, వైట్ కాలర్ నేరాలకు పాల్పడేవారిపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామన్నారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. సార్ ఎప్పటినుంచో తెలుసు.. ప్రస్తుత ఎస్పీ జె.సత్యనారాయణ తనకెప్పటినుంచో తెలుసని.ఇద్దరం కలిసి రాజమండ్రిలో విధులు నిర్వహించామని, తనకు గురువులాంటి వారని రామకృష్ణ చెప్పారు. ఉదయం ఆయన గుంటూరు పోలీస్ క్లబ్‌కు చేరుకున్నారు. 11 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని వీరభద్రస్వామి దేవాలయానికి వెళ్లి ప్రత్యేకపూజల్లో పాల్గొన్నఅనంతరం సత్యనారాయణ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. పలువురి అభినందనలు.. కొత్త ఎస్పీ రామకృష్ణను ఏఎస్పీ డి.కోటేశ్వరరావు, ఏఆర్ ఏఎస్పీ కె.శ్రీనివాసరావు, ఓఎస్డీ వెంకటయ్య, అర్బన్ జిల్లా ఏఎస్పీలు జానకీ ధరావత్, బి.శ్రీనివాసులు, ఓఎస్డీ కె.జగన్నాథరెడ్డి, డీఎస్పీలు బి.సత్యనారాయణ, టి.పి.విఠలేశ్వర్, కె.గంగాధరం, టి.వి.నాగరాజు కలిసి అభినందించారు.