టీపీసీసీలో మనోళ్లు | The first TPCC The district was preferred | Sakshi
Sakshi News home page

టీపీసీసీలో మనోళ్లు

Published Wed, Mar 12 2014 2:44 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

The first TPCC The district was preferred

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : తెలంగాణ తొలి పీసీసీలో జిల్లాకు ప్రాధాన్యం లభించింది. వూజీ వుంత్రి, వుంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు చోటుదక్కింది. కాంగ్రెస్ పార్టీ ఆయునను తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా నియుమించింది. 23 వుందితో నియుమించిన ఎన్నికల కమిటీలో సీనియుర్ నాయుకుడు, ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు, కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు చోటు కల్పించింది.
 
 నిజానికి పీసీసీ అధ్యక్ష పదవి రేసులో వుుందు నుంచీ వివిధ దశల్లో ఈ వుుగ్గురి పేర్లు వినిపించారుు. తెలంగాణ బిల్లుపై చర్చకు వుుందు శ్రీధర్‌బాబును తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా నియుమించనున్నట్లు విసృ్తతంగా ప్రచారం జరిగింది. చివరి దశలో శ్రీధర్‌తో పాటు పొన్నం ప్రభాకర్ పేరు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరిగింది. చివరకు సీనియుర్ నాయుకుడు, మొన్నటిదాకా జిల్లా ఇన్‌చార్జి వుంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్యును పీసీసీ చీఫ్ పదవి వరించింది. దీంతో జిల్లాలోని పార్టీ నేతలను ఆ పదవి ఊరించి ఉసూరువునిపించినట్లయింది.
 
 మంథని నుంచి వరుసగా వుూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్‌బాబు కాంగ్రెస్ పార్టీలో క్రియూశీల పాత్ర పోషించారు. గతంలో రెండుసార్లు డీసీసీ అధ్యక్షునిగా ఉన్నారు. ప్రభుత్వ విప్‌గా, కీలక శాఖలకు వుంత్రిగా ప్రత్యేక గుర్తింపును అందుకున్నారు. ప్రస్తుతం మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా నియూవుకంతో పార్టీలో ఆయునకు వురింత ప్రాధాన్యత లభించింది. తనను మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా నియుమించినందుకు పార్టీ అధ్యక్షురాలు సోనియూగాంధీ, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు శ్రీధర్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement