ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం | The government betrayed the people are doing | Sakshi
Sakshi News home page

ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం

Published Thu, Nov 13 2014 3:04 AM | Last Updated on Mon, Aug 13 2018 7:32 PM

ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం - Sakshi

ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం

సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్
 
 రాయదుర్గంటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ విమర్శించారు. స్థానిక అజీజీయా షాదీమహల్‌లో ఆ పార్టీ నియోజకవర్గ సమావేశం బుధవారం  జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన జగదీష్ మాట్లాడారు. ఎన్నికల ముందు చంద్రబాబు అనేక వాగ్దానాలు ఇచ్చి, ఇప్పుడు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. నేటి వరకు అనంతపురాన్ని కరువు జిల్లాగా ప్రకటించలేదన్నారు. రుణాల మాఫీ, కొత్త అప్పులు మంజూరు నిలిచిపోరుునట్లు తెలిపారు.

పశువులకు మేత కొరత ఏర్పడిందని చెప్పారు. సుమారు 1200 గ్రామాల్లో తాగునీరు, పనులు లేక ప్రజలు వలసలు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంతో కయ్యానికి సిద్ధం కావాల్సిన అవసరం వచ్చిందన్నారు. న్యాయబద్ధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రారుుతీలు, ప్రత్యేక హోదాపై చంద్రబాబు నోరు మెదపడంలేదని ఆరోపించారు.

ప్రధాని మోదీకి అర్జీలు ఇస్తే సమస్యలు పరిష్కారం కావని, పోరాడి సాధించుకోవాలని సూచించారు. ప్రజా సంక్షేమాన్ని వదిలేసి కేవలం పత్రికా ప్రకటనలు, పర్యటనలకే ప్రభుత్వం పరిమితమైందని విమర్శించారు. ప్రజలను విస్మరించి కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం ఊడిగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజా సమస్యలపై కార్యకర్తలు, నేతలు పోరాటాలు చేయూలని పిలుపునిచ్చారు.

 ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమం
 రాయదుర్గం నియోజకవర్గంలోని డీ.హీరేహాళ్ మండలంలో ఉక్కు కర్మాగారం నిర్మాణం కోసం కలిసి వచ్చే రాజకీయ పక్షాలతో కలిసి ఉద్యమించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ తెలిపారు. యూపీఏ ప్రభుత్వం రాయదుర్గంలో కుద్రేముఖ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు.

ఎన్నికల తర్వాత కర్మాగారం ఊసే ఎత్తడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.  సీపీఐ తాలూకా ఇన్‌చార్జి నాగార్జున, నేతలు వెంకటేశులు, నరసింహులు, ఫకృద్దీన్, హనుమంతు, సిద్దమ్మ, నీలకంఠమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement