అక్రమ కట్టడాలపై హైకోర్టుకు.. | The High Court of illegal structures .. | Sakshi
Sakshi News home page

అక్రమ కట్టడాలపై హైకోర్టుకు..

Published Fri, Mar 4 2016 12:58 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

అక్రమ కట్టడాలపై హైకోర్టుకు.. - Sakshi

అక్రమ కట్టడాలపై హైకోర్టుకు..

రివర్‌బెడ్‌లో అక్రమ  నిర్మాణాలపై కోర్టుకెళ్లిన ఎమ్మెల్యే ఆర్కే
సక్రమం చేసేందుకు   అధికారుల యత్నం

 
తాడేపల్లి రూరల్: కృష్ణానది అమరావతి కరకట్ట లోపల రివర్ బెడ్ ప్రాంతంలో మొక్కలు నాటాలన్నా ఇరిగేషన్ అధికారుల అనుమతి తీసుకోవాలి. అలాంటి ప్రదేశంలో ఎటువంటి అనుమతులు లేకుండా భారీ కట్టడాలను నిర్మించిన బడాబాబులు తమ అధికార  జులుం ప్రదర్శించారు. మొదట తెలుగు దేశ ం నాయకులు రివర్ బెడ్‌లో అక్రమ కట్టడాలు నిర్వహించడమేటంటూ ధ్వజమెత్తారు. అనంతరం సీఎం నివాసం ఏర్పాటు చేయడంతో వీరు మిన్నకుండిపోయూరు. ఆ తర్వాత సీఎం నివాసం సహా 22 రకాల అక్రమ కట్టడాలకు 2015 ఫిబ్రవరి 6న తాడేపల్లి తహశీల్దార్ నోటీసులు జారీ చేశారు. మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి రివర్ బెడ్‌లో ఉన్న అక్రమ కట్టడాలపైనా.. సీఎం నివాసంపైనా హైకోర్టులో గత సోమవారం పిల్ దాఖలు చేయడంతో సీఆర్డీఏ ఉన్నతాధికారులు గత రెండు రోజుల క్రితం ఈ భవనాలన్నింటినీ పరిశీలించినట్లు సమాచారం.

అవి అక్రమ కట్టడాలేనంటూ ప్రభుత్వానికీ ఒక నివేదిక  సమర్పించినట్లు తెలిసింది. గత నెల 24న సీఆర్డీఏ రిలీజ్ చేసిన అమరావతి క్యాపిటల్ సిటీ ఫైన ల్ మాస్టర్ ప్లాన్‌లో సీఎం నివాసంతో సహా ప్రభుత్వ పెద్దలకు చెందిన మరి కొన్ని భవనాలను ఆర్1 గ్రామ కంఠం కింద మ్యాప్‌లో మార్కు చేశారు. ఎమ్మెల్యే హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో కృష్ణానదికి, బండ్(కర కట్ట)కు మధ్య నిర్మించిన భవనాలు ఆర్‌సీ యాక్టుకు విరుద్ధంగా ఉన్నారుు.

దీంతో బుధవారం సీఆర్డీఏ వర్గాలు ఆ భవనాలకు చెందిన ఆర్1 (గ్రామ కంఠం) జోన్ నుంచి పీ2 (యూక్టివ్ రిక్రియేషన్ జోన్), ఎస్ 2 (ఎడ్యుకేషన్ జోన్) కింద మార్పు చేస్తూ నూతన మ్యాప్‌తోపాటు వాటికి సంబంధించిన నోటిఫికేషన్ సైతం విడుదల చేశారు. దీంతో గ్రామస్తులందరూ అధికార పార్టీ నేతలు బడాబాబుల కోసమే పనులు చేస్తున్నారని మండిపడుతున్నారు. పిటీషన్ వేయపోతే ఆ సీఎం నివాస ప్రాంత గ్రామాలను గ్రామ కంఠం కింద చూపించే వారని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement