కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి
కర్నూలు(లీగల్) : నవ్యాంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని న్యాయవాదులు కోరారు. రాష్ట్ర బార్‌కౌన్సిల్ సభ్యులు పి.రవిగువేరా, కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి.లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో మంగళవారం పలువురు న్యాయవాదులు మంగళవారం ఉదయం డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తిని ఆయన నివాసంలో కలిశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో కర్నూలు అభివృద్ధికి నాందిగా రాష్ట్ర హైకోర్టును ఇక్కడే ఏర్పాటయ్యేలా కృషి చేయాలన్నారు. ఇందుకు స్పందించిన కేఈ విషయంపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తామని తెలిపారు. కేఈని కలిసినవారిలో సీనియర్ న్యాయవాదులు టి.నాగభూషణం నాయుడు, రంగారవి, బి.కృష్ణమూర్తి, ఎ.మాదన్న, కె.శ్రీధర్, డి.శివశంకర్‌రెడ్డి, పి.వెంకటేశ్వర్లు, ఎ.శ్రీనివాసులు, చెన్నయ్య తదితరులున్నారు.
సీనియర్ న్యాయవాది ఇస్మాయిల్ మృతికి సంతాపం
సోమవారం మరణించిన ఆదోనికి చెందిన సీనియర్ న్యాయవాది ఇస్మాయిల్(90)కు రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు పి.రవిగువేరా, బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి.లక్ష్మినారాయణ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.