ismail
-
Dy CM సంచలన కామెంట్స్ పవన్ మనసులో ఏముంది?
-
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించేది వీరే
అమెరికా నుంచి సాక్షి టీవీ ప్రతినిధి ఇస్మాయిల్అమెరికా అధ్యక్ష ఎన్నికలపై అటు డెమొక్రాట్లు ఇటు రిపబ్లికన్లు పూర్తిగా విడిపోయిన నేపథ్యంలో ఒక వర్గం మాత్రం మౌనం వహిస్తోంది. అటు హారిస్‌కు కానీ ఇటు ట్రంప్‌కు గానీ మద్దతు ఇవ్వడంపై వీరు ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించడం లేదు. వారే స్వతంత్ర ఓటర్లు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను శాసించేది వీరే. నువ్వా నేనా అన్నట్టు జరుగుతున్న అమెరికా ఎన్నికల్లో ఏడు బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్లో విస్తరించి ఉన్న స్వతంత్ర ఓటర్లే నిర్ణాయకం కాబోతున్నారు. పెరుగుతున్న స్వతంత్ర ఓటర్ల సంఖ్యప్రముఖ శాంపిల్ సర్వే గాలప్ పోల్ డేటా ప్రకారం 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఓటు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిలో 43 శాతం తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా చెప్పుకుంటున్నారు. 27% మంది రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులుగా, మరో 27 శాతం మంది డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులుగా ప్రకటించుకున్నారు. 1990లో కేవలం 32 శాతం మంది ఓటర్లు మాత్రమే తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా ప్రకటించుకున్నారు. కాలంతో పాటు ఇండిపెండెంట్ ఓటర్ల సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి.7 రాష్ట్రాల్లో కీలకం⇒ అమెరికాలో పార్టీతో అనుబంధం అనేది చాలా సాధారణ మైన అంశం. ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ప్రైమ రీస్‌లో ఓటు వేసేందుకు చాలామంది పార్టీ ఓటర్లుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ప్రైమరీస్ అంటే ఒక పార్టీ నుంచి ఎవరు అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయాలనే విషయంపై జరిగే పోలింగ్. సాధారణ ఓటర్లు ఈ పోలింగ్‌లో పాల్గొంటారు. వీరు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలంటే చాలా రాష్ట్రాల్లో కచ్చితంగా ఏదో ఒక పార్టీ ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఈ డేటా ప్రకారమే చాలామందిని అమెరి కాలో డెమొక్రాట్ ఓటర్లు, రిపబ్లికన్ ఓటర్లుగా పిలుస్తారు.అమెరికాలో సర్వే సంస్థలు తాము చేసే సర్వేల ఆధారంగా పార్టీ ఓటర్ల సంఖ్యను లెక్కగడుతోంది. దీని ఆధారంగానే ఏ పార్టీకి ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనే విషయం తేలుతుంది. ఈ గణాంకాల ఆధారంగానే చాలా రాష్ట్రాలను బ్లూస్టేట్స్, రెడ్ స్టేట్స్‌గా తేలుస్తారు. డెమొక్రాట్ ఓటర్లు ఎక్కువగా ఉంటే అది బ్లూ స్టేట్ అని రిపబ్లికన్ ఓటర్లు ఎక్కువగా ఉంటే రెడ్ స్టేట్ అని తేలిపోతుంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు దాదాపు ఊహించిన దానికి అనుకూలంగానే ఉంటాయి. ఎక్కడైతే రెండుపార్టీల మద్దతు దారుల మధ్య తేడా మూడు శాతం కంటే తక్కువగా ఉంటుందో దానిని బ్యాటిల్ స్టేట్ లేదా పర్పుల్ స్టేట్‌గా పిలుస్తారు. ఇప్పుడు ఏడు బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్ ఉన్నాయని భావిస్తుండగా..వీటిల్లో ఈ ఇండిపెండెంట్ ఓటర్లే నిర్ణాయక శక్తిగా మారారు.కొత్త తరం ఓటర్లే ఎక్కువ..అమెరికాలోని కొత్త తరం ఎక్కువగా స్వతంత్ర భావాలు కలిగి ఉంది. ముఖ్యంగా మిలేనియల్స్ లేదా జనరేషన్ వై ఎక్కువగా ఇండిపెండెంట్ ఓటర్లుగా ఉన్నారని పరిశోధనలో తేలింది. స్వతంత్ర ఓటర్లలో 1981–96 మధ్యలో జన్మించిన జనరేషన్ వైకి చెందిన వారే 36% మంది ఉన్నారు. ఇక తరువాతి తరం అంటే 1997– 2012 మధ్య జన్మించిన జెన్‌జీ స్వతంత్ర ఓటర్లలో 26% ఉన్నారు. అంటే స్వతంత్ర ఓటర్లలో 52% మంది వై, జీ తరంవారే.ఇక ఓటర్ల మూలాలను పరిశీలిస్తే 31% మంది నల్ల జాతీయులు, 52% మంది లాటినోస్, 43% మంది ఏషియన్ అమెరికన్లు తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా ప్రకటించు కున్నారు. మాజీ సైనికులు సైతం పెద్ద ఎత్తున తమను తాము ఇండిపెండెంట్ ఓటర్లుగా చెప్పుకుంటున్నారు. 18–49 సంవత్సరాల మద్య ఉన్న దాదాపు 59% మంది మాజీ సైనికులు తమను తాము స్వతంత్ర ఓటర్లుగా చెప్పుకుంటున్నారు.పేరుకే స్వతంత్ర ఓటర్లు⇒ అమెరికన్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటువేసే ఈ స్వతంత్ర ఓటర్లపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సర్వేల్లో తమను తాము స్వతంత్ర ఓట ర్లుగా చెప్పుకునే వీరంతా నిజంగానే స్వతంత్ర ఓటర్లా? అన్న విషయంపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా మీరు ఏ పార్టీ భావ జాలాన్నినమ్ముతున్నారన్నప్పుడు వీరిలో చాలామంది రిపబ్లికన్ లేదా డెమొక్రాట్ పార్టీకి మద్దుతుదారు లుగా తేలిందని కీత్ అనే అమెరికన్ పొలిటికల్ అనలిస్ట్ ‘ది మిత్ ఆఫ్ ఇండిపెండెంట్ ఓటర్’పుస్తకంలో వివరించడం గమనార్హం. చాలామంది తమను తాము ఇండిపెండెంట్ ఓటర్‌గా చెప్పుకున్నప్పటికీ ఏదో ఒక స్థాయిలో రాజకీయ పార్టీలతో అనుబంధం కలిగి ఉన్నారని పరిశోధనల్లో బయటపడింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో 10 శాతానికి మించి నిజమైన స్వతంత్ర ఓటర్లు లేరని అక్కడి రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.కొత్త అభ్యర్థుల వైపే వీరి మొగ్గుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త అభ్యర్థుల వైపే ఇండిపెండెంట్ ఓటర్లు ఎక్కు వగా మక్కువ చూపుతున్నా రని గణాంకాలు చెబుతు న్నాయి. 2008లో బరాక్ ఒబామా పోటీ చేసిన సందర్భంగా దాదాపు 54% స్వతంత్ర ఓటర్లు ఆయనకు ఓటువేశారు. 2016లో ట్రంప్‌కు 52% మంది ఇండిపెండెంట్ ఓటర్లు మద్దతు పలికారు. ఇక 2020లో జో బైడెన్‌కు అత్యధికంగా 56.5 శాతం మంది మద్దతు తెలిపారు.⇒ ఇండిపెండెంట్ ఓటర్లలో 75శాతం మంది ఓటర్లు తమ వ్యక్తిగతమైన ఆర్థిక స్థితిని ప్రభావితం చేయగల అంశాలే తమ ప్రాధాన్యత అని చెబుతున్నారు. ⇒ 73 శాతం మంది నేరాలను అదుపు చేసేవారికే తమ ఓటు అని చెబుతున్నారు. ⇒ 63 శాతం మంది అమెరికా తన మిత్రదేశాల కోసం అత్యధికంగా ఖర్చు చేయడం సరికాదంటున్నారు. ⇒ 57 శాతం అబార్షన్ హక్కులే తమ ప్రాధాన్యత అంటున్నారు⇒ 56 శాతం జాత్యహంకారం తీవ్రమైన సమస్యగా పరిగణిస్తున్నారు. -
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ పై జనం ఆగ్రహం
-
సిన్వర్‌పై అమెరికాలో కేసు
వాషింగ్టన్: ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 7న జరిగిన నరమేధానికి సంబంధించి హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌తో పాటు ఆ ఉగ్రవాద సంస్థకు చెందిన మరో ఐదుగురు అగ్ర నేతలపై అమెరికాలో కేసు నమోదైంది. దాడికి ప్రణాళిక, మద్దతు, నిర్వహణ వెనక ఉన్నది వీరేరంటూ మంగళవారం క్రిమినల్ అభియోగాలు నమోదయ్యాయి. ఈ జాబితాలో హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనయా, మిలటరీ వింగ్ చీఫ్ మహ్మద్ దెయిఫ్, డిప్యూటీ మిలిటరీ కమాండర్ మార్వాన్ ఇస్సా, ఖలీద్ మెషాల్, అలీ బరాకా ఉన్నారు. వీరిలో హనయా, దెయిఫ్, ఇస్సా ఇప్పటికే ఇజ్రాయెల్ హతమార్చింది. ఖలీద్ మెషాల్ దోహాలో ఉంటూ గ్రూప్ డయాస్పోరాకు నాయకత్వం వహిస్తుండగా అలీ బరాకా లెబనాన్‌కు చెందిన సీనియర్ హమాస్ అధికారి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ బాంబు దాడిలో హనయా, గాజాపై జరిపిన వైమానిక దాడుల్లో మహ్మద్ దెయిఫ్, మరో దాడిలో ఇస్సా మరణించారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన పాశవిక మెరుపుదాడిలో 1,200 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకోవడం తెలిసిందే. వారిలో 40 మందికి పైగా అమెరికన్లున్నారు. ‘‘ఇజ్రాయెల్‌ను నాశనం చేయడానికి, ఆ లక్ష్యసాధన కోసం ఆ దేశ పౌరులను చంపడానికి హమాస్ చేస్తున్న ప్రయత్నాలకు నిందితులంతా నాయకత్వం వహించారు. ఇరాన్ నుంచి అందుతున్న ఆర్థిక, సాయుధ, రాజకీయ దన్నుతో, హిజ్బొల్లా మద్దతుతో ఇందుకు తెగించారు’’అని అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్ ఒక ప్రకటనలో తెలిపారు.చర్చలకు విఘాతం! అమెరికా తాజా చర్య గాజాలో కాల్పుల విరమణ యత్నాలకు విఘాతంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధానికి ముగింపు పలికేందుకు, ఖైదీల విడుదలకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్టు అమెరికా కొద్ది రోజులుగా ప్రకటనలు చేస్తుండటం తెలిసిందే. ఇలాంటి సమయంలో హమాస్ అగ్ర నేతలపై అమెరికా కేసులు పెట్టడం కాల్పుల విరమణ చర్చలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పరిశీలకులు అంటున్నారు. ‘‘గాజాలో ఇజ్రాయెల్ దాడులకు అమెరికా పూర్తి మద్దతిస్తోంది. తాజా అభియోగాల ద్వారా హమాస్‌నే వేలెత్తి చూపుతోంది. కానీ వేలమందిని పొట్టన పెట్టుకుంటున్న ఇజ్రాయెల్‌ను మాత్రం కనీసం తప్పుపబట్టడం లేదు. అమెరికావి ద్వంద్వ ప్రమాణాలని మరోసారి రుజువైంది’’ అని బీరుట్‌లోని అమెరికన్ యూనివర్సిటీ ఫెలో రామి ఖౌరీ అన్నారు. -
బెడ్రూంలో బాంబు
‘జింకను వేటాడేప్పుడు పులి ఓపికగా ఉంటది. అదే పులినే వేటాడాల్సొస్తే?! ఇంకెంత ఓపిక కావాలి?’ ఇది ఓ సినిమాలోని డైలాగ్. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేపై దాడి కోసం ఇజ్రాయెల్ నిఘా విభాగం మొసాద్ కూడా అచ్చం అలాగే ఓపిక పట్టింది. అది కూడా ఒక రోజో, రెండ్రోజులో కాదు.. ఏకంగా రెండు నెలలకు పైగా! ఆయన బస చేస్తారని భావించిన ఇంట్లో అప్పటికే బాంబు అమర్చి ఉంచింది. ఏ బెడ్రూంలోకి వెళ్తాడో పక్కాగా తెలుసుకుని మరీ అందులోనే బాంబును సిద్ధం చేసి పెట్టింది. అలా హనియే కోసం ముందస్తుగానే కాచుకుని కూచున్న మృత్యువు, సమయం రాగానే అమాంతంగా మింగేసింది...!ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో గత బుధవారం తెల్లవారుజామున జరిగిన పేలుడులో హనియే మరణించారు. అత్యంత కచి్చతత్వంతో కూడిన ఇజ్రాయెల్ క్షిపణి దాడే అందుకు కారణమని తొలుత వార్తలొచ్చాయి. క్షిపణిలాంటి వస్తువేదో హనియే గది కిటీకిని తాకడాన్ని ప్రత్యక్ష సాక్షులు చూశారని కొందరు చెప్పారు. అది క్షిపణి దాడేనని ఇరాన్ కూడా ఆరోపించింది. టెహ్రాన్‌లో కట్టుదిట్టమైన రక్షణలో ఉండే గెస్ట్ హౌస్‌ను హనియేకు కేటాయించారు. అలాంటి గెస్ట్ హౌస్‌పై సుదూరం నుంచి అంతటి కచి్చతత్వంతో క్షిపణి దాడి సాధ్యమేనా? పైగా క్షిపణి దాడితో భారీ విధ్వంసం జరుగుతుంది. కానీ ఆ గెస్ట్ హౌస్‌కు అంతటి నష్టమేమీ జరగలేదు. గది, పరిసర భాగాలే బాగా దెబ్బతిన్నాయి. అదే భవనంలో పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ నాయకుడు జియాద్ అల్ నఖలా బస చేసిన పక్క గది కూడా దెబ్బ తినలేదు. కనుక ఎలా చూసినా జరిగింది క్షిపణి దాడి కాదు.వామ్మో ఇజ్రాయెల్! హనియే మృతికి గది లోపలి పేలుడే కారణమని ఇరాన్ అధికారులు ఎట్టకేలకు గుర్తించారు. ఆ గదిలో రెండు నెలల కిందే బాంబు పెట్టారని తెలుస్తోంది. ఇరాన్ భద్రతలోని లోపాలనే అందుకు అనువుగా మార్చుకున్నారు. బాంబు పెట్టి రెండు నెలలపాటు ఓపికగా నిరీక్షించారు. ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు హనియే టెహ్రాన్ చేరుకున్నారు. అది ముగిశాక గెస్ట్‌హౌస్‌కు చేరుకుని ఆ గదిలోకే వెళ్లినట్టు పక్కాగా నిర్ధారించుకున్న తర్వాతే రిమోట్‌తో బాంబు పేల్చారు. పేలుడు ధాటికి భవనం ఒక్కసారిగా కదిలిపోయింది. గోడలో కొంత భాగం కూలింది. కిటికీలు పగిలాయి. పేలుడు తీవ్రతకే హనియే మృతి చెందారు. ఈ కోవర్ట్ ఆపరేషన్ వివరాలన్నింటినీ పాశ్చాత్య అధికారులతో మొసాద్ పంచుకుందని న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక పేర్కొంది. దేశం వెలుపల రాజకీయ ప్రత్యర్థులు తదితర టార్గెట్ల ఏరివేతకు మొసాద్ పాల్పడుతోంది. ఇజ్రాయెల్‌పై హమాస్ అక్టోబర్ 7 దాడుల తర్వాత దాని అగ్ర నేతలందరినీ వేటాడతామని ప్రధాని నెతన్యాహూతో పాటు మొసాద్ చీఫ్ డేవిడ్ బరి్నయా కూడా ప్రతిజ్ఞ చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ నేత కుమారుల మృతి
టెల్ అవీవ్: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హమాస్ ముఖ్యనేత ఇస్మాయిల్ హనియేహ్ కుమారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఖతర్ వంటి దేశాలు సంధి ప్రయత్నాలు చేస్తున్న వేళ హమాస్ కీలక నేత కుమారులు మరణించడంతో సయోధ్యపై మరోమారు నీలినీడలు కమ్ముకున్నాయి. ‘‘ జెరూసలేం, అల్–అఖ్సా మసీదుకు విముక్తి కలి్పంచే పోరాటంలో నా కుమారులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు’ అని అల్జజీరాకు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో ఇస్మాయిల్ వెల్లడించారు. ఇస్మాయిల్ ప్రస్తుతం ఖతార్‌లో ప్రవాసజీవితం గడుపుతున్నారు. కుమారులు మాత్రం గాజాలోని శరణార్థి శిబిరంలో ఉంటున్నారు. షాటీ శరణార్ధి శిబిరంపై జరిపిన దాడిలోనే ఆయన కుమారులు హజీమ్, అమీర్, మొహమ్మద్‌లు మరణించారని అల్–అఖ్సా టీవీ ప్రకటించింది. ముగ్గురూ తమ కుటుంబసభ్యులతో కలిసి ఒకే వాహనంలో వెళ్తుండగా ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురితోపాటు హజీమ్ కుమారులు, కుమార్తె, అమీర్ కుమార్తె సైతం ప్రాణాలు కోల్పోయారు. -
అమరావతిలో అతితెలివితో ఇరుక్కున్నారా?
-
చిన్న శిక్షతో సరిపెడతారా?
సాక్షి, అమరావతి : ఓ వ్యక్తి నిర్భంధం విషయంలో వాస్తవాలను తేల్చేందుకు నియమితులైన అడ్వొకేట్ కమిషనర్‌ను, అతనికి సాయంగా వెళ్లిన కోర్టు సిబ్బంది, ఇతరులపై చేయి చేసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లా, హిందూపురం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్‌పై నామమాత్రపు చర్యలు తీసుకున్నారంటూ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలీసులు సమాజానికి సంరక్షకులని, అలాంటి పోలీసు తప్పు చేసినప్పుడు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందని స్పష్టం చేసింది. రెండు ఇంక్రిమెంట్లలో కోత విధించడం చాలా చిన్న శిక్ష అని, ఇలాంటి శిక్ష విధించడం ద్వారా సమాజానికి ఏం సందేశం పంపిస్తున్నారని ప్రశ్నించింది. కింది కోర్టు ఉత్తర్వులను అపహాస్యం చేసిన పోలీసు అధికారికి చిన్న శిక్ష విధించడాన్ని ఎలా సమర్థించుకుంటారో తెలియచేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఇదే వ్యవహారంలో హైకోర్టు సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కార కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీఐని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వొకేట్ కమిషనర్, కోర్టు సిబ్బందిని ఇస్మాయిల్ కొట్టారంటూ అనంతపురం జిల్లా జడ్జి ఇచ్చిన నివేదికను హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా మలిచిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. గత విచారణ సమయంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు సీఐ ఇస్మాయిల్ స్వయంగా కోర్టు ముందు హాజరయ్యారు. తదుపరి విచారణకు సైతం హాజరు కావాలని ఇస్మాయిల్‌ను ధర్మాసనం ఆదేశించింది. -
మోస్ట్ వాంటెడ్ హిడ్మా.. చరిత్ర అంతా చిక్కడు దొరకడు..!
తెలంగాణ- ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులో మావోయిస్టు కీలక నేత హిడ్మా హతమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ గ్రేహౌండ్స్-ఛత్తీస్‌ఘడ్ సీఆర్పీఎఫ్కు చెందిన కోబ్రా టీం సంయుక్త ఆపరేషన్‌లో హిడ్మా ఎన్కౌంటర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లా ఎల్మాగూడ- బీజాపూర్ జిల్లా ఎగువసెంబి మధ్య ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్లో... పలువురు మావోలతో పాటు హిడ్మా హతమయ్యాడన్నది పోలీసు వర్గాల సమాచారం. ఈ ఎన్కౌంటర్ కోసం పోలీసులు హెలికాప్టర్ వాడినట్టు స్థానికులు కొందరు చెబుతున్నారు. 50లక్షల రివార్డు ఉన్న హిడ్మాను నాలుగు రాష్ట్రాల పోలీసులు గత రెండు దశాబ్దాలుగా వెతుకుతున్నారు. చేతిలో నెంబర్ వన్ బెటాలియన్ దాదాపు మూడు దశాబ్దాలుగా ఛత్తీస్‌ఘడ్ మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన హిడ్మా... ఆర్మీ స్ట్రాటజీలలో దిట్ట. మావో సిద్ధాంతాన్ని పెద్దగా చదువుకోకపోయినా... తుపాకి ద్వారా పార్టీలో హిడ్మా పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. సుక్మా జిల్లాలో పుట్టిన హిడ్మా 17ఏళ్ల వయసులోనే... పీపుల్స్‌వార్‌లో దళ సభ్యుడిగా పార్టీలో చేరాడు. ఆ తరువాత మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా కీలక పాత్ర పోషించాడు. మావోయిస్టు పార్టీలో ఉన్న నెంబర్-1 బెటాలియన్ ప్రస్తుతం హిడ్మా చేతిలో ఉంది. హిడ్మా ఆదేశాలు ఇస్తే ఈ బెటాలియన్ ఎక్కడైనా విరుచుకుపడుతుంది. మావోయిస్టు పార్టీకి చెందిన అత్యంత భయంకరమైన బెటాలియన్‌గా సుగ్మా టీంకు పేరుంది. టార్గెట్ 100% 2011లో ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన చింతల్నార్ దాడిలో దాదాపు 75మంది CRPF జవాన్లు చనిపోయారు. అప్పట్లో సంచలనంగా మారిన ఈ దాడికి హిడ్మా నాయకత్వం వహించాడు. ఇక 2017లో జరిగిన బూర్కపాల్ దాడిలోనూ హిడ్మా పాత్ర ఉందని మావోయిస్టు పార్టీయే ప్రకటించింది. వందలమంది మిలిటెంట్లను గెరిల్లా ఆర్మీతో ఏకం చేసి దాడి చేయడం ఇతడి ప్రత్యేకత. హిడ్మా దాడి చేస్తే ఎవరూ తప్పించుకోరని మావోయిస్టు పార్టీలో ఒక నమ్మకం. ఛత్తీస్‌ఘడ్‌లో గత రెండు దశాబ్దాల్లో జరిగిన ప్రధాన హింసాకాండలకు హిడ్మాయే కారణం అని అక్కడి పోలీసులు చెబుతారు. చదవండి: (తెలంగాణ గ్రేహౌండ్స్ ఆపరేషన్‌లో హిడ్మా హతం?) హింస vs సిద్ధాంతం చాలాకాలం పాటు పోలీసులకు ఫోటో కూడా దొరకకుండా జాగ్రత్తపడిన హిడ్మా గురించి మావోయిస్టు క్యాడర్లోనే చాలా మందికి తెలియదు. అయితే మావోయిస్టు కేంద్ర కమిటీలోకి హిడ్మాను తీసుకోవడంపై పార్టీలో చాలా విబేధాలు వచ్చాయి. మావోయిస్టు పార్టీలో అత్యంత నిర్ణాయకమైన కేంద్రకమిటీలోకి ఎలాంటి సిద్ధాంత జ్ఞానం లేని హిడ్మాను తీసుకోవడం అంటే హింసను ప్రోత్సహించడమే అని కొంత మంది మావోయిస్టు సానుభూతిపరులు విమర్శించారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాన్ని వదిలి పూర్తిగా హింసామార్గాన్ని అందుకుందని హిడ్మాకు వ్యతిరేకంగా వాదనలు వచ్చాయి. మనుషుల్ని చంపడంలో హిడ్మా చేసే హింస ఎంతో భయంకరంగా ఉంటుందని చెబుతారు. ముఖ్యంగా ఇన్ఫార్మర్ల నెపంతో హిడ్మా కిరాతక హత్యలకు పాల్పడినట్లు చాలా చర్చ ఉంది. తన నీడను కూడా హిడ్మా నమ్మడని... దాదాపు 10మంది వరకు రాత్రింభవళ్లు హిడ్మాకు పహరా కాస్తారని మాజీ మావోలు చెబుతారు. కేంద్ర కమిటీ వల్లే దెబ్బ తిన్నాడా? పార్టీ పుట్టుక నుంచి మావోయిస్టు పార్టీలో కేంద్రకమిటీలో ఒక్క గోండు కూడా లేడు. ఛత్తీస్‌ఘడ్‌లో ప్రస్తుతం 80శాతం మావోయిస్టులు గోండు తెగకు చెందిన గిరిజనులే. అయితే వీరికి నాయకత్వం ఇవ్వడంతో పార్టీలో పెద్ద చర్చ జరిగింది. వీరిలో చాలామందికి సైద్ధాంతిక ప్రాతిపదిక లేదని కొందరు విమర్శించారు. కేవలం చంపడంపైనే శిక్షణ పొందిన వీరు పార్టీని నడపలేరని చెబుతారు. ఇలాంటి సందర్భంలోనే హిడ్మా కేంద్ర కమిటీలోకి రావడం వల్ల... ఛత్తీస్‌ఘడ్ మావోయిస్టు పార్టీలో స్థానిక గిరిజనులు నాయకత్వం తీసుకోడానికి ఒక అవకాశంగా మారింది. నమ్మకం వమ్మయిందా? హిడ్మాను ఎవరూ చంపలేరని మావోయిస్టు పార్టీలో ఒక గుడ్డి నమ్మకం ఉంది. ఇప్పుడు హిడ్మా చనిపోతే అది క్యాడర్‌కు కూడా నైతికంగా ఎదురు దెబ్బేనని పోలీసులు చెబుతున్నారు. గతంలో చాలా ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్న హిడ్మా... ఎన్కౌంటర్లో ఎలా చనిపోతారనే చర్చ జరుగుతోంది. గతంలో చాలాసార్లు హిడ్మా చనిపోయాడని వార్తలు వచ్చాయి. అయితే హిడ్మా బ్రతికే ఉన్నాడని తర్వాత తేలింది. ప్రస్తుత హిడ్మా ఎన్‌కౌంటర్‌పై ఇప్పటివరకు తెలంగాణ -ఛత్తీస్గడ్ పోలీసులు ఎలాంటి ధృవీకరణ చేయలేదు. అటు మావోయిస్టు పార్టీ కూడా దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. - ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ -
పల్లె రఘునాథరెడ్డి నుంచి నుంచి ప్రాణహాని
ఓడీ చెరువు: మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి నుంచి తనకు, తన కుమారుడు మాజీ ఎంపీపీ ఇస్మాయిల్‌కు ప్రాణహాని ఉందని జిల్లా కోఆప్షన్ మాజీ సభ్యుడు అల్లాబకాష్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పోలీసులకు లిఖిత పూర్వకంగా తెలిపారు. అనంతరం పుట్టపర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ గంగన్నతో కలసి విలేకరులతో మాట్లాడారు. తనను, తన కుమారుడిని టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్లు మండల నాయకులు పత్రికా ప్రకటన చేయడంపై ధ్వజమెత్తారు. సస్పెండ్ చేయాలంటే వీరికి ఏ అధికారం ఉందని ప్రశ్నించారు. ఏ పార్టీలోనైనా సస్పెండ్ చేసే అధికారం జిల్లా అధ్యక్షుడికి ఉంటుందని, కనీస ఈ జ్ఞానం కూడా లేని ‘పల్లె’ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌కు పల్లె రఘునాథరెడ్డిని తానే పరిచయం చేశానన్నారు. 1982 నుంచి తాను టీడీపీలో ఉన్నానని, పార్టీ అభివృద్ధికి తాను, తన కుటుంబం ఎంతో కృషి చేసినట్లు చెప్పారు. తమ గృహ ప్రవేశానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, సైకం శ్రీనివాసరెడ్డి ‘పల్లె’పై విమర్శలు చేశారని, దీంతో తానేదో వారితో ఆయనపై విమర్శలు చేయించినట్లు ‘పల్లె’ భావించి తనపై కక్ష కట్టారన్నారు. చదవండి: (‘కుర్డుంగ్లా’పై నవరత్నాల రెపరెప) ఎంపీపీగా తన కుమారుడు అవినీతికి పాల్పడ్డారని, హిందూపురం బాలాజీ కళాశాలలో గుర్రప్పతో కలసి రికార్డులు చోరీ చేశారని పల్లె ఆరోపించారని, నిజంగా తన కుమారుడు ఈ పనులు చేసి ఉంటే అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తే తెలిసిపోతుందన్నారు. తాను గానీ, తన కుమారుడు గానీ అక్కడికి వచ్చినట్లు తేలితే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. పల్లె తన కార్యకర్తలకు పనులు ఇచ్చి వారి నుంచి రూ.కోట్ల కమీషన్‌న్ దండుకున్నారు. ఈ విషయాలు బయటకు వస్తాయనే తనను, తన కుమారున్ని చంపుతానని బెదిరిస్తున్నాడన్నారు. ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనకు పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. సమావేశంలో కొత్తచెరువు నిషార్, పవన్, భాస్కర్, అబ్దుల్ కలాం, రాజ, షామీర్‌బాషా, కోటబజార్ భాస్కర్, ఆంజనేయులు ఉన్నారు. -
హైకూలు
తెలుగు పాఠకులకు హైకూలను పరిచయం చేసిన కవి, ఇస్మాయిల్ (1928–2003). ఆయన్ని తలచుకోగానే ఒక నిశ్శబ్దం ఆవరిస్తుంది. చిలుకలు వాలిన చెట్టు, చెట్టు నా ఆదర్శం, రాత్రి వచ్చిన రహస్యపు వాన, పల్లెలో మా పాత ఇల్లు ఆయన కవితా సంపుటాలు. కవిత్వంలో నిశ్శబ్దం, కరుణ ముఖ్యం ఆయన విమర్శా వ్యాసాలు. హైకూల పుస్తకం, కప్పల నిశ్శబ్దం. కీచురాయి చప్పుడుతో గదంతా నిండిపోయింది. గదిలో నాకు చోటు లేదు. కొండ మీది కర్రి మబ్బూ దండెం మీది కాకీ రెక్కలు తెగ దులుపుకుంటున్నాయి. కోడిపుంజుల్ని కోసుకు తినేశారు మా ఊరివాళ్లు. ఇక తెల్లారకట్ట రైలు మిగిలింది. తలకి మబ్బూ కాళ్లకి సరస్సూ తొడుక్కోకపోతే కొండ కొండే కాదు. దారి పొడుగుతూ రైలు చక్రాలు నీ పేరే ఉచ్చరించాయి. లాంతరు వెలుతుర్లో పాప చదువుకుంటోంది ఎవరు ఎవర్ని వెలిగిస్తున్నారు? ఈ బాట మీద ఎవ్వరూ నడవగా చూడలేదు. ఇదిక్కడికి ఎలా వచ్చింది? బోటుని దాని నీడకి కట్టేసి పడవ సరంగు ఎటో పోయాడు. ఈ చెట్టు కింద రోజూ నిలబడతాను. చెట్టుకి నా పేరు తెలుసా? నేను దాని పేరడిగానా? అర్ధరాత్రివేళ కప్పల నిశ్శబ్దానికి హఠాత్తుగా మెలకువొచ్చింది. -ఇస్మాయిల్ -
లారీ క్లీనర్ బలవన్మరణం
గుంతకల్లు: పట్టణంలో 60 అడుగుల రోడ్డులో నివాసముంటున్న ఇస్మాయిల్ (28) అనే లారీ క్లీనర్ ఆదివారం సాయంత్రం భార్యాపిల్లలు బయటికి వెళ్లిన సమయంలో ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తమ్ముడు రసూల్ ఇంటికి రాగా అన్న ఉరికి వేలాడుతున్న ఇస్మాయిల్ కనిపించాడు. వెంటనే ఆయను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇస్మాయిల్ ముఖంపైన, చేతులపై ఉన్న గాయాలు అనుమానాలను రేకిత్తిస్తున్నాయి. ఇస్మాయిల్‌కు భార్య మాబున్నీ, ఇద్దరు సంతానం. టూటౌన్ ఎస్ఐ కేసు దర్యాప్తు చేపట్టారు. -
విద్యుత్ సవరణ బిల్లుతో నష్టమే
రాష్ట్ర ప్రయోజనాలకు భంగమేనన్న ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ బహుళ పంపిణీ విధానం సరికాదు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ వ్యవస్థ నుంచి డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను వేరు చేయాలని విద్యుత్ సవరణ బిల్లు (2014)లో పేర్కొన్న ప్రతిపాదనతో రాష్ర్ట ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని రాష్ర్ట విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ ఆందోళన వ్యక్తం చేశా రు. శుక్రవారం హైదరాబాద్ ఫ్యాప్సీ భవన్లో విద్యుత్ సవరణ బిల్లుపై జరిగిన జాతీ య సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్ పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వాల సామర్థాన్ని పరిగణలోకి తీసుకుని ఈ చట్టం రూపొందించాలన్నారు. ఒకేసారి కాకుండా దశలవారీగా అమలు చేస్తే మంచిదన్నారు. కొత్త చట్టం ద్వారా బహుళ పంపిణీ విధానం ప్రవేశపెట్టనున్నారని, దీని ద్వారా సామాన్యు లకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. విద్యుత్ మార్కెట్ వ్యవస్థ మెరుగయ్యేంత వరకు ఈ విధానం అమలు కాకుండా రాష్ర్ట ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. 10శాతం పునరుత్పాదక విద్యుత్‌ను బండ్లింగ్ ద్వారా పంపిణీ చేయాలన్న నిబంధన తెలంగాణలో సాధ్యపడదని వివరించారు. ప్రస్తు తం ఏపీ, తెలంగాణలో విద్యుత్ పరిస్థితి బాగానే ఉందని ఊర్జా గ్యాస్ ఫౌండేషన్ చైర్మన్ డి.రాధాకృష్ణ తెలిపారు. తూర్పు, పశ్చిమ విద్యుత్ కారిడార్లను దక్షిణ గ్రిడ్‌కు అనుసంధానం చేసే పనులు వేగవంత మయన్నారు. తెలంగాణలో విండ్, సోలార్ పవర్‌కు సంబంధించిన క్లస్టర్ పాలసీలున్నాయని, వీటితో 3 నుంచి 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయొచ్చన్నారు. ఏపీలోనూ సోలార్, విండ్ పవర్ పాలసీలు తీసుకొచ్చామని, వాటి అనుమతులకు సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టామని ఎన్‌ఆర్‌ఈడీ క్యాప్ జనరల్ మేనేజర్ కె.శ్రీనివాస్ చెప్పారు. సదస్సులో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఎనర్జీ ఏరియా చైర్పర్సన్ ఉషా రామచంద్రన్, ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి సభ్యుడు పి. రఘు తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి రోజేఆత్మహత్య
పహాడీషరీఫ్: జీవితాంతం కలిసి ఉంటానని ఏడడుగులు నడిచిన భర్త విడాకులివ్వడంతో మనస్థాపానికి గురైన ఓ గృహిణి పెళ్లి రోజున ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. ఎస్ఐ మహేందర్ వివరాల ప్రకారం....పహాడీషరీఫ్ గ్రామానికి చెందిన గౌసియా బేగానికి (28) తొమ్మిదేళ్ల క్రితం ఇస్మాయిల్‌తో వివాహం జరిగింది. వీరి మధ్య వివాదాలు ఏర్పడడంతో ఏడాది క్రితం గౌసియా బేగానికి ఇస్మాయిల్ విడాకులిచ్చాడు. చెల్లి, తమ్ముడుతో కలిసి పహాడీషరీఫ్‌లోనే గౌసియా బేగం నివాసముంటోంది. ఆదివారం ఆమె పెళ్లి రోజు ఉండడంతో ఉదయం నుంచి ముభావంగా ఉండిపోయింది. తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె రాత్రి 8 గంటల సమయంలో ఇంటి ఆవరణలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు మంటలార్పే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించిన పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోనూ...
నవంబర్ 25 ఇస్మాయిల్ 11వ వర్థంతి ఇస్మాయిల్ గారి కంటే ముందు ఆయన కవిత్వం పరిచయం. ఎలాగంటే ఇంటర్లో నా మిత్రుడు ముస్తఫాకి ఇస్మాయిల్‌గారి కుటుంబంతో ఏదో దూరపు చుట్టరికం వుంది. అప్పుడప్పుడే నేను కవిత్వం కాకరకాయలు రాయడం చూసి ముస్తాఫా ఒకరోజు ఇస్మాయిల్ గారి ‘మృత్యువృక్షం’ కవితా సంపుటిని తెచ్చి ఇచ్చాడు. నిజంగా ఆ పుస్తకం ఎంత అందంగా వుందో! పాండిచ్చేరి అరవిందాశ్రమంలో తయారైన ఊదారంగు హ్యాండ్ మేడ్ పేపర్‌పై శీలా వీర్రాజుగారి అక్షరాలంకరణ చూడగానే ఎంతో అపురూపం అనిపించింది. చదివితే ఏం అర్థం అయిందో తెలియదుగానీ అలా ఇస్మాయిల్ గారి కవిత్వ ప్రపంచంలోకి ప్రవేశం దొరికింది. ఆ తర్వాత ఆ ఉత్సాహంతో ముస్తఫాతో కలిసి కాకినాడ వెళ్లి ఇస్మాయిల్ గారిని కలిశాను. నాది మాట్లాడే వయసు కాదు. ఆయనది మాట్లాడే స్వభావం కాదు. ప్రథమ దర్శనంలో బ్లాక్ రోజ్‌వుడ్ కుర్చీపైన ఆయన కూర్చున్న ముద్ర గుర్తు. అక్కడే చిద్విలాసంగా నవ్వుతున్న కృష్ణశాస్త్రి ఫొటో, ఎదురుగా రెక్కల కింద పిల్లలను దాచుకున్న పిల్లల కోడిలా టీపాయ్! ఆ తర్వాత నేను కాకినాడలో స్పెషల్ తెలుగు బి.ఎ.లో చేరినపుడు అక్కడ ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో ఇస్మాయిల్గారు, దానికి కొంచెం అటుఇటుగా హిందీ విభాగంలో అన్నపురెడ్డిగారు, సంస్కృత విభాగంలో పేరాల భారత శర్మగారు, ఎప్పుడైనా సాయంకాలాలు ఇస్మాయిల్‌గారి ఇంటికి వెళ్తే మేకా సుధాకరరావు, రావుగారు, రవూఫ్, విన్నకోట రవిశంకర్ అక్కడే తారసపడేవారు. బి.ఎ. మూడు సంవత్సరాలు గొప్ప సాహిత్య సంరంభంతో గడిచిపోయాయి. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎం.ఎ చదువుతుండగా యానాం వచ్చేప్పుడు విశాఖ వెళ్లేటప్పుడు ఇస్మాయిల్‌గారిని కలిసి వెళ్లేవాణ్ణి. మధ్యలో ఉత్తరాలు కూడా నడిచేవి. ఎం.ఎ అయ్యాక నా తొలి పుస్తకం వేద్దాం అంటే అత్తలూరి మాస్టారు ఒక సంవత్సరం ఆగమన్నారు. 1987లో పుస్తకం వేద్దామని ఇస్మాయిల్‌గారిని ముందు మాట రాయమని అడిగాను. ఒప్పుకున్నారుగాని ఎంతకీ రాయడం లేదు. ఒకసారి కాకినాడ వచ్చి ఈ రోజు ఎలాగైనా మీ పీకల మీద కుర్చుందామని వచ్చాను అనంటే మీకా శ్రమ అక్కర్లేదు నా పీకల మీద నేనే కూర్చున్నా. అయినా కదలడం లేదు అన్నారు. ఒక దశలో ఈయన రాస్తాడా నే పుస్తకం వేస్తానా అనే సంశయం కూడా కలిగింది. కరుణ ముఖ్యం అన్న కవి కదా. ఒక మంచి రోజు ముందుమాట రాసి పంపారు. అది అందిన రోజున ఎన్నిసార్లు చదువుకున్నానో. ఇదంతా నా కవిత్వం గురించేనా ఇస్మాయిల్గారే రాశారా అని ఉబ్బితబ్బిబ్బయి పోయాను. అలా ‘మువ్వల చేతికర్ర’ను ముందుమాటతోనే వదిలేయలేదాయన. శీలా వీర్రాజుగారికి ఉత్తరం రాసి ముఖచిత్రం వేయమని కోరారు. అంతేనా? కాకినాడ మసీదు సెంటర్లో జిలానీ పాన్‌షాప్‌కు కాస్త ఎదురుగా వుండే శ్రీపతి ప్రెస్‌లో కంపోజింగ్‌కి యిచ్చారు. అప్పటికి కంప్యూటర్లు డి.టి.పి.లు గట్రా ఇంకా రాలేదు. సాయంత్రం అయ్యేటప్పటికి ప్రింటింగ్ ప్రెస్ నుండి ఓ కుర్రాడు ైసైకిల్ వేసుకుని నాలుగు ఫారాలు తెచ్చేవాడు. ఫారానికి ఎనిమిది పేజీలు. వాటి ని ఎంతో ఓపికగా ప్రూఫ్ చూసేవారు. అందుకే ఇస్మాయిల్ గారి పుస్తకాల్లాగే నా పుస్తకంలోనూ పదానికి పదానికి మధ్య స్పష్టమైన జాగా వుంటుంది. ఇస్మాయిల్ లాంటి గొప్పకవి నా కవిత్వానికి ప్రూఫ్ రీడింగ్ చేశారంటే అది నేనూ నా కవిత్వమూ చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఎంత గొప్ప కవిత్వాన్ని సృజించిన ఆ మహానుభావుడి చేతివేళ్లు చేతుల్లోకి తీసుకొని కళ్ల కద్దుకుని, పాదాలకు నమస్కరించడం తప్ప ఏమిచ్చి కృతజ్ఞతలు చెప్పగలను. 1987 అక్టోబరు18న ఆంధ్ర విశ్వ విద్యాలయం తెలుగు శాఖా పక్షాన జరిగిన మువ్వల చేతికర్ర ఆవిష్కరణ సభలో ఇస్మాయిల్, వేగుంట మోహన ప్రసాద్ గార్లు మాట్లాడని అతిథులుగా హాజరయ్యారు. నా పుస్తకానికి ఇస్మాయిల్ గారితో పాటుగా ‘ఏ దారీ లేదే నాకీ జగాన’ అని ముందుమాట రాసిన మో గార్ని చూడటం అదే ప్రథమం. అప్పటి నుండి ఇస్మాయిల్గారితో వున్న కవిత్వానుబంధం ఆత్మీయ బంధంగా మారిపోయింది. 1991లో హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో నౌకరీలో కుదురుకున్నాక- అధికార భాషాసంఘం సభ్యునిగా ఇస్మాయిల్గారు హైదరాబాద్ వచ్చేవారు. బస ప్రభుత్వ అతిథి గృహంలో. ఇక చీకటి పడగానే పక్షులు చెట్టును చేరుకున్నట్టు కవులు, రచయితలు, అభిమానులతో కోలాహలంగా వుండేది. అందులో ఐ.ఎ.ఎస్ అధికారి గిర్గ్లాని, సి.ధర్మారావు, మంచిరాజు శ్యామలరావు, వెంకటరావు, స్మైల్, రంగారెడ్డి, నగ్నముని, విన్నకోట రవిశంకర్, సురేందర్‌రావు, కాశీ, సదాశివరావుగారు (ఈ జాబితా అసంపూర్తి) యిలా ఎంతో మంది ఎన్నో సాయింత్రాలను కవిత్వంగా వెలిగించారు. మిత్రుల సంభాషణల మధ్య ఆయన ఎక్కువగా శ్రోతగానే వుండేవారు. ఉండీ ఉండీ చివరికి ఒక సీమటపాకాయలాంటి మాట ముక్తాయింపుగా వొదిలేవారు. దాంతో వాతావరణం అంతా పగలబడి నవ్వుతుంది. ఒకసారి కొత్తగా వచ్చిన కవితా సంపుటాల గురించి చర్చకు వస్తే ‘ఆ గురుశిష్యులిద్దర్లో ఎవరో ఒక్కరే రాస్తే బాగుండును’ అన్నారు. ఇప్పుడున్న వాతావరణంలో ఆ పేర్లు చెప్పడం నాకంత శ్రేయస్కరం కాదు. నాకు తెలిసి ఆంధ్రదేశంలో ఉత్తరాలు రాయడం ఒక సాహిత్య సృజనగా మలిచినవారు ముగ్గురే ముగ్గురు. ఒకరు చలం, రెండోవారు సంజీవ్ దేవ్, మూడోవారు ఇస్మాయిల్. ఒకసారి ఆయన ఉత్తరం రాస్తూ ‘పాద నమస్కారాలు చేయించుకోడానికి మీ గురువుగారికి జెర్రిలాగా ఎన్ని పాదాలున్నాయేంటి?’ అని రాసారు. ఆ ఉత్తరం అందుకునే సమయానికి నా ఎదురుగా జర్నలిస్టు మిత్రుడు ఉండి ఈ ఉత్తరం అచ్చేస్తానని పట్టుకెళ్లాడు. తర్వాత ఆ వ్యాఖ్య ఎవరి గురించి చేశారో తెలిసికొని వెంటనే వెళ్లి తెచ్చుకున్నాను. ఒకసారి తులనాత్మక అధ్యయన కేంద్రంలో పొయిట్రీ వర్క్‌షాపు నిర్వహిస్తూ ఇస్మాయిల్ గారిని ఆహ్వానిస్తే ‘హైదరాబాద్‌లో స్మైల్ గారుంటారు. నేను ఉన్న రెండ్రోజులు ఆయన సంసారం చెయ్యకుండా మనతో వుంటారేమో కనుక్కోండి’ అని రాసారు. కవి సమ్మేళనాలు ఇష్టపడని ఇస్మాయిల్గారు నా ‘పెళ్లి-పుస్తకం’ కార్యక్రమం గురించి నాసర రెడ్డికి వుత్తరం రాస్తూ ‘కవి సమ్మేళనం పెడతానంటాడేమిటి శిఖామణి’ అని రాశారు. నాసరరెడ్డి ఇస్మాయిల్ గారిని కాకినాడలో మీ ఇంటికి ఎలా రావాలని అడిగాడో ఏమో... ‘చొక్కా మీద ఇస్మాయిల్, లచ్చిరాజు వీధి, కాకినాడ’ అని రాసుకొని పోస్టు బాక్స్‌లో కూచోండి అని రాశారు. ఇలాంటి ఉత్తరాలు మిత్రుల వద్ద వున్నాయి. సి.ధర్మారావు గారు బతికివుండగా ఇస్మాయిల్ గారి లేఖలు ప్రచురిద్దామని ప్రయత్నించారు గానీ కార్యరూపం దాల్చలేదు. వాడ్రేవు వరలక్ష్మిదేవి వంటి వారు ఆ పనికి పూనుకోవాలి. ఇస్మాయిల్ గారు వెళ్లిపోయిన సంవత్సరానికి కాబోలు సదాశివరావుగారు ఒక పున్నమిరాత్రి ఇస్మాయిల్ జ్ఞాపకాలను పంచుకుందామని కవులను తన ఇంటికి పిలిచారు. శివారెడ్డి, అబ్బూరి ఛాయాదేవివంటి పెద్దలతో సహా చాలామంది గుమిగుడాం! ఆ రాత్రి దాబా మించి ఆకాశంలోకి చూస్తే పున్నమి చంద్రుడులో నవ్వుతున్న ఇస్మాయిల్ గారు కన్పించారు. ‘వేసవి చంద్రుడు’ అని నేను రాసిన కవితలో ‘కాకినాడ చెట్టు కవి/ మేనిమేలిమి బంగారు ఛాయనూ/ గంటలకొద్ది ఆచరించే అతని స్నానక్రియనూ/ గుర్తుకు తెచ్చుకుంటే ఇప్పుడనిపిస్తుంది/ బహుశా అతని స్నానపుగది సబ్బుగూటీలో వున్నది జాబిల్లి అనీ సాదాసీదా సబ్బు బిళ్ల కాదనీ’ అని రాసుకున్నాను. ఇస్మాయిల్‌గారి జ్ఞాపకం అప్పుడే స్నానం చేయించిన పసిపిల్లాడి అజ్ఞాత ప్రాకృతిక పరిమళం! - శిఖామణి, 9848202526 -
అత్తారింటికి దారేది?
కాపురానికి పిల్చుకెళ్తామంటూ ఉన్నదంతా ఊడ్చుకున్నారు టీడీపీ నేత అండతో కోడలిని మోసగించిన అత్త, మామలు భర్త కోసం వెళ్తే చంపుతామంటూ బెదిరింపులు న్యాయం కోసం మళ్లీ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు వైవాహిక జీవితంపై అందరి ఆడపిల్లల్లాగే ఆమె ఎన్నో కలలు కంది. ఆ సమయం రానే వచ్చింది. కాబోయే భర్త కువైట్‌లో సంపాదిస్తున్నట్లు తెలిసి ఆమె ఆనందానికి అవధుల్లేవు. పెళ్లైంది. భర్తతో కలసి తనూ విమానం ఎక్కేసింది. అక్కడ దాంపత్య మధురిమలను ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపింది. అంతలోనే తమ ప్రతిరూపం కడుపులో పెరుగుతోందని తెలిసి సంబరపడింది. కాన్పు కోసమంటూ భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. ఆ తరువాత పండంటి మగబిడ్డతో తిరిగి అత్తారింటికి వెళ్లింది. అంతే అక్కడి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. బాధితురాలి కథనం ప్రకారం... రాయచోటి మహ్మద్పూరా వీధికి చెందిన దిల్షాద్, సుబక్తుల్లా దంపతుల కుమార్తె సుల్తాన వివాహం రాజంపేటకు చెందిన ఇస్మాయిల్‌తో మూడేళ్ల కిందట అయింది. పెళ్లైన కొత్తలో భార్యను వెంటబెట్టుకుని ఇస్మాయిల్ కువైట్‌కు వెళ్లాడు. అక్కడ ఆమె నెల తప్పింది. ఏడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు కాన్పుకోసమంటూ స్వదేశానికి వచ్చారు. నెలలు నిండాక పుట్టింటిలో సుల్తాన మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డతో కలసి అత్తగారింటికి వెళ్లిన సుల్తానకు చేదు అనుభవమే ఎదురైంది. ఇంట్లోకి రావొద్దంటూ అత్తమామ అడ్డుకున్నారు. ఊహించని ఈ సంఘటనతో ఆమె ఖంగుతింది. ఈ సంఘటనపై ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆయన సూచన మేరకు రాయచోటి పోలీసులు కేసు నమోదు చేశారు. కాపురానికి తీసుకెళ్తానని చెప్పి... సుల్తాన ఫిర్యాదు నేపథ్యంలో ఆమె భర్త కువైట్ నుంచి వచ్చి పోలీసుల ఎదుట హాజరయ్యాడు. తన భార్యను కాపురానికి పిల్చుకెళ్తానని నమ్మబలికాడు. పోలీసులు ఇద్దరినీ కూర్చోబెట్టి కౌన్సెలింగ్ ఇచ్చారు. వారిద్దరి అంగీకారంతో కాపురానికి పంపారు. ఆ తరువాత కువైట్‌కు వెళ్తానని ఇస్మాయిల్ చెప్పాడు. అంత దూరం వద్దంది. ఇక్కడే వ్యాపారం చేద్దామంటే తన వద్ద పైసల్లేవనడంతో సుల్తాన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు పెద్దమనుషులు సమక్షంలో పంచాయీతీ చేసి అదనంగా రూ.4 లక్షల నగదు, 30 తులాల బంగారం ఇచ్చి కాపురానికి పంపారు. ఆ పంచాయితీలో కడపకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఫిర్ధోసి అనే వ్యక్తికి ఇస్మాయిల్ పాస్‌పోర్టు అప్పగించేలా పెద్దలు ఒప్పందం కుదిర్చారు. అంతా అయ్యాక ఫిర్దోసి, ఇస్మాయిల్ ఇద్దరూ ఒక్కటయ్యారు. ఫిర్దోసి నుంచి తన పాస్‌పోర్టును ఇప్పించుకుని ఇస్మాయిల్ రెండు నెలల కిందట కువైట్‌కు చెక్కేశాడు. ఆ తరువాత సుల్తానను అత్తామామలు ఇంటి నుంచి వెళ్లగొట్టారు. దీనిపై సుల్తాన పుట్టింటి కొచ్చి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు మళ్లీ పంచాయితీ కోసం పెద్ద మనుషుల వద్దకు వచ్చారు. పంచాయితీకి ఇస్మాయిల్ తల్లిదండ్రులు ససేమిరా అనడగమే గాకుండా వియ్యంకులను, కోడలిని బెదిరించడం మొదలు పెట్టారు. దీంతో బాధితురాలు మళ్లీ న్యాయం కోసం రాయచోటి పోలీసులను బుధవారం రాత్రి ఆశ్రయించారు. గతంలో పంచాయితీ చేసిన పెద్ద మనుషులను పిలిపించి సయోధ్య కుదిర్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే అవతలి వారు టీడీపీ నాయకుని అండగా ఆమెను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నేత అనుచరుడు పోలీస్‌స్టేషన్‌లోనే బాధితురాలి బంధువులతో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమైంది. -
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి
కర్నూలు(లీగల్) : నవ్యాంధ్రప్రదేశ్ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని న్యాయవాదులు కోరారు. రాష్ట్ర బార్‌కౌన్సిల్ సభ్యులు పి.రవిగువేరా, కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి.లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో మంగళవారం పలువురు న్యాయవాదులు మంగళవారం ఉదయం డిప్యూటీ సీఎం, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో కర్నూలు అభివృద్ధికి నాందిగా రాష్ట్ర హైకోర్టును ఇక్కడే ఏర్పాటయ్యేలా కృషి చేయాలన్నారు. ఇందుకు స్పందించిన కేఈ విషయంపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తామని తెలిపారు. కేఈని కలిసినవారిలో సీనియర్ న్యాయవాదులు టి.నాగభూషణం నాయుడు, రంగారవి, బి.కృష్ణమూర్తి, ఎ.మాదన్న, కె.శ్రీధర్, డి.శివశంకర్‌రెడ్డి, పి.వెంకటేశ్వర్లు, ఎ.శ్రీనివాసులు, చెన్నయ్య తదితరులున్నారు. సీనియర్ న్యాయవాది ఇస్మాయిల్ మృతికి సంతాపం సోమవారం మరణించిన ఆదోనికి చెందిన సీనియర్ న్యాయవాది ఇస్మాయిల్(90)కు రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు పి.రవిగువేరా, బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి.లక్ష్మినారాయణ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
పోలీసుల అదుపులో ఇస్లామిక్ లిబరేషన్ ఫోర్స్ వ్యవస్థాపకుడు ఇస్మాయిల్
చెన్నై: ఉగ్రవాది ఇస్మాయిల్‌ను చెన్నై పోలీసులు విచారిస్తున్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో ఉగ్రవాదులు బిలాల్ మాలిక్, ఇస్మాయిల్ అలియాస్ మున్నాను ఆక్టోపస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నా విషయం తెలిసిందే. ఇస్లామిక్ లిబరేషన్ ఫోర్స్ వ్యవస్థాపకుడైన ఇస్మాయిల్ మధురై కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగించినట్లు తెలుస్తోంది. -
కొనసాగుతున్న ఇస్మాయిల్ దీక్ష
కదిరి అర్బన్, న్యూస్‌లైన్ : వైఎస్ఆర్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్ఎండీ ఇస్మాయిల్ ప్రారంభించిన ఆమరణ దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. సమన్యాయం కోసం గుంటూరులో వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా ఆయన దీక్ష చేపట్టారు. శనివారం ఇస్మాయిల్‌ను పరీక్షించిన వైద్యులు..ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు వెల్లడించారు. బీపీ, షుగర్ లెవల్స్ తగ్గతుండడంతో దీక్ష విరమించుకోవాలని వారు సూచించగా.. ఇస్మాయిల్ ససేమిరా అన్నారు. ఇస్మాయిల్‌తో పాటు మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ బయప్ప, కేజీఎన్ జిలాన్‌బాషా, చరణ్‌కుమార్‌రెడ్డి, ఆర్ఎంఎస్ ఆసిఫ్, నారాయణ దీక్ష కొనసాగిస్తున్నారు. వీరికి వైఎస్ఆర్సీపీ నేతలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు.