పహాడీషరీఫ్: జీవితాంతం కలిసి ఉంటానని ఏడడుగులు నడిచిన భర్త విడాకులివ్వడంతో మనస్థాపానికి గురైన ఓ గృహిణి పెళ్లి రోజున ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ మహేందర్ వివరాల ప్రకారం....పహాడీషరీఫ్ గ్రామానికి చెందిన గౌసియా బేగానికి (28) తొమ్మిదేళ్ల క్రితం ఇస్మాయిల్‌తో వివాహం జరిగింది. వీరి మధ్య వివాదాలు ఏర్పడడంతో ఏడాది క్రితం గౌసియా బేగానికి ఇస్మాయిల్ విడాకులిచ్చాడు. చెల్లి, తమ్ముడుతో కలిసి పహాడీషరీఫ్‌లోనే గౌసియా బేగం నివాసముంటోంది.
ఆదివారం ఆమె పెళ్లి రోజు ఉండడంతో ఉదయం నుంచి ముభావంగా ఉండిపోయింది. తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె రాత్రి 8 గంటల సమయంలో ఇంటి ఆవరణలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు మంటలార్పే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించిన పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి రోజేఆత్మహత్య
Published Mon, Dec 22 2014 12:21 AM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM
Advertisement
Advertisement