వైఎస్‌ఆర్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్‌ఎండీ ఇస్మాయిల్ ప్రారంభించిన ఆమరణ దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. సమన్యాయం కోసం గుంటూరులో వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా ఆయన దీక్ష చేపట్టారు. శనివారం ఇస్మాయిల్‌ను పరీక్షించిన వైద్యులు..ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు వెల్లడించారు.
కదిరి అర్బన్, న్యూస్‌లైన్ : వైఎస్‌ఆర్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్‌ఎండీ ఇస్మాయిల్ ప్రారంభించిన ఆమరణ దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. సమన్యాయం కోసం గుంటూరులో వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా ఆయన దీక్ష చేపట్టారు. శనివారం ఇస్మాయిల్‌ను పరీక్షించిన వైద్యులు..ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు వెల్లడించారు.
బీపీ, షుగర్ లెవల్స్ తగ్గతుండడంతో దీక్ష విరమించుకోవాలని వారు సూచించగా.. ఇస్మాయిల్ ససేమిరా అన్నారు. ఇస్మాయిల్‌తో పాటు మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ బయప్ప, కేజీఎన్ జిలాన్‌బాషా, చరణ్‌కుమార్‌రెడ్డి, ఆర్‌ఎంఎస్ ఆసిఫ్, నారాయణ దీక్ష కొనసాగిస్తున్నారు. వీరికి వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు.