- రాష్ట్ర ప్రయోజనాలకు భంగమేనన్న ఈఆర్‌సీ చైర్మన్ ఇస్మాయిల్
- బహుళ పంపిణీ విధానం సరికాదు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ వ్యవస్థ నుంచి డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను వేరు చేయాలని విద్యుత్ సవరణ బిల్లు (2014)లో పేర్కొన్న ప్రతిపాదనతో రాష్ర్ట ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని రాష్ర్ట విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్‌సీ) చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ ఆందోళన వ్యక్తం చేశా రు. శుక్రవారం హైదరాబాద్ ఫ్యాప్సీ భవన్‌లో విద్యుత్ సవరణ బిల్లుపై జరిగిన జాతీ య సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కెట్ పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వాల సామర్థాన్ని పరిగణలోకి తీసుకుని ఈ చట్టం రూపొందించాలన్నారు. ఒకేసారి కాకుండా దశలవారీగా అమలు చేస్తే మంచిదన్నారు. కొత్త చట్టం ద్వారా బహుళ పంపిణీ విధానం ప్రవేశపెట్టనున్నారని, దీని ద్వారా సామాన్యు లకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. విద్యుత్ మార్కెట్ వ్యవస్థ మెరుగయ్యేంత వరకు ఈ విధానం అమలు కాకుండా రాష్ర్ట ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.
10శాతం పునరుత్పాదక విద్యుత్‌ను బండ్లింగ్ ద్వారా పంపిణీ చేయాలన్న నిబంధన తెలంగాణలో సాధ్యపడదని వివరించారు. ప్రస్తు తం ఏపీ, తెలంగాణలో విద్యుత్ పరిస్థితి బాగానే ఉందని ఊర్జా గ్యాస్ ఫౌండేషన్ చైర్మన్ డి.రాధాకృష్ణ తెలిపారు. తూర్పు, పశ్చిమ విద్యుత్ కారిడార్లను దక్షిణ గ్రిడ్‌కు అనుసంధానం చేసే పనులు వేగవంత మయన్నారు.
తెలంగాణలో విండ్, సోలార్ పవర్‌కు సంబంధించిన క్లస్టర్ పాలసీలున్నాయని, వీటితో 3 నుంచి 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయొచ్చన్నారు. ఏపీలోనూ సోలార్, విండ్ పవర్ పాలసీలు తీసుకొచ్చామని, వాటి అనుమతులకు సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టామని ఎన్‌ఆర్‌ఈడీ క్యాప్ జనరల్ మేనేజర్ కె.శ్రీనివాస్ చెప్పారు. సదస్సులో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఎనర్జీ ఏరియా చైర్‌పర్సన్ ఉషా రామచంద్రన్, ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి సభ్యుడు పి. రఘు తదితరులు పాల్గొన్నారు.