కట్టుకున్నవాడే కాలయముడయ్యూడు | The husband feels suicide attempt | Sakshi
Sakshi News home page

కట్టుకున్నవాడే కాలయముడయ్యూడు

Published Fri, Jun 26 2015 3:08 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

The husband feels suicide attempt

భోగోలు (లింగపాలెం): కలకాలం కాపాడాల్సిన భర్తే కాలయముడిగా మారాడు. హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి విచారణ చేపట్టారు. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా పెదపాడుగూడెం గ్రామానికి చెందిన కిరణ్మయి (28)కి లింగపాలెం మండలం భోగోలు శివారు వెంకటాపురానికి చెందిన బొంతు నాగ వెంకటవరప్రసాద్‌తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది.
 
 వీరికి ఇద్దరు మగపిల్లలు. వివాహమైన కొద్దికాలం నుంచి కిరణ్మరుుని భర్త, అత్త భానుమతి వేధించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం కిరణ్మరుుని భర్త వరప్రసాద్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. తన కుమార్తెను దూలానికి ఉరివేసి చంపాడని మృతురాలి తల్లి గంగారత్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం సాయంత్రం వరప్రసాద్ తనకు ఫోన్ చేసి కిరణ్మరుు కనిపించడం లేదని చెప్పాడని.. తాను ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇంట్లోని దూలానికి కిరణ్మరుు వేలాడుతూ ఉందని గంగారత్నం బోరుమన్నారు.
 
 వివాహమైనప్పటి నుంచి భర్త వరప్రసాద్ తరచుగా వేధిస్తున్నాడని అన్నారు. ఫిర్యాదు మేరకు డీఎస్పీ జె.వెంకటరావు డాగ్‌స్క్వాడ్‌తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి చుట్టూ రక్తపు మరకలు ఉండటాన్ని గుర్తించారు. మృతదేహాన్ని చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చింతలపూడి సీఐ జి.దాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లి చనిపోయిన విష యం కూడా తెలుసుకోలేని స్థిలిలో ఉన్న ఇద్దరు చిన్నారులను చూసి బంధువులు కన్నీటి పర్యంతమయ్యూరు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement