మా అమ్మ అస్పత్రిలో ఉందంట | The mother is Died Unknown child | Sakshi
Sakshi News home page

మా అమ్మ అస్పత్రిలో ఉందంట

Published Mon, Dec 1 2014 1:38 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

The mother is Died Unknown child

తల్లి మృతి విషయం తెలియని చిన్నారి
సంగం: లోకం తెలియని ఆ చిన్నారి మాటలు చూపరులకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. తల్లి మృతి చెంది గంటలు దాటినా మా అమ్మ ఆస్పత్రిలో ఉందంటున్న ఆ బుజ్జాయి మాటలు అందరి హృదయాన్ని కలచివేస్తున్నాయి. రాళ్లచెలిక దళితవాడకు చెందిన రంతులయ్య, మస్తానమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు. రంతులయ్య బేల్దారి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అనారోగ్యానికి గురై అప్పులపాలయ్యాడు. ఈ క్రమంలో మస్తానమ్మ మానసికంగా బాధపడుతుండేది. మూడు రోజుల క్రితం ఆయన పులివెందులకు వెళ్లిన సమయంలో ఆమె పురుగుమందు తాగడంతో పాటు బిడ్డలతో కూడా తాగించే ప్రయత్నం చేసింది.

చిన్నకుమార్తె దివ్య కొంచెం తాగగా, పెద్దకుమార్తె శశికళ నిరాకరించింది. ఇద్దరిని నెల్లూరుకు సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మస్తానమ్మ శనివారం రాత్రి మృతిచెందిన సంగతి తెలిసిందే. దివ్య చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో  విచారణ నిమిత్తం వారి పెద్దకుమార్తె శశికళను ఆదివారం సంగం పోలీసుస్టేషన్‌కు పోలీసులు పిలిపించారు. నాయనమ్మతో కలిసి వచ్చిన ఆ చిన్నారి మాటలు అందరినీ కలచివేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement