పలమనేరు: డబ్బు, పదవుల కోసమే పార్టీలను వీడే ఎమ్మెల్యేలకు ప్రజలు శాస్తి చేస్తారని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి అధ్యక్షతన, రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారధ్యంలో ఆదివారం బహిరంగసభ జరిగింది. ఈ సభలో కుమార్‌రాజా, పుంగనూరు నాయకులు వెంకటరెడ్డి యాదవ్, లిడ్‌క్యాప్ మాజీచైర్మన్ రెడ్డెప్ప ప్రసంగించారు.
భవిష్యత్తు లేదు
పార్టీలు ఫిరాయించే ఎమ్మెల్యేలకు ఇక రాజకీయ భవిష్యత్తు లేదు. ఈ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు తుంగలో తొక్కింది. ఈ దఫా ఎన్నికల్లో జిల్లాలోని అన్నీ స్థానాలనుపెద్దిరెడ్డి సారధ్యంలో గెలుస్తాం. - చింతల రామచంద్రారెడ్డి , ఎమ్మెల్యే, పీలేరు
మూల్యం చెల్లించుకుంటారు
పార్టీలు మారి, రాజకీయ వ్యభిచారం చేస్తున్న వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. దిగజారుడు రాజకీయాలు టీడీపీ కేరాఫ్‌లా మారింది. పార్టీ మారిన స్థానిక ఎమ్మెల్యే దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో గెలవాలి. - డా. సునీల్‌కుమార్, ఎమ్మెల్యే పూతలపట్టు
ప్రజాద్రోహి
పలమనేరు ఎమ్మెల్యే రెండు లక్షల మంది ప్రజలకు ద్రోహం చేశారు. కేవలం డబ్బు కోసం అమ్ముడుపోయారు. అందుకే జనం స్థానిక ఎమ్మెల్యేను చావులు, పెళ్లిళ్లకు కూడా పిలవడం లేదు. ఇలాంటి నాయకులు గ్రామాల్లోకి కూడా రానివ్వరాదు. దేశంలోనే నెంబర్- 1 అవినీతి పరుడు సీఎం చంద్రబాబే. నిబద్ధత కలిగిన క్యాడర్ మా పార్టీకే సొంతం. అమర్‌లాంటి నాయకులు ఎందరూ వెళ్లినా, జనం మా పార్టీ వెంట ఉన్నారు. - దేశాయ్ తిప్పారెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే
పార్టీలు మారిన వారికి శాస్తి తప్పదు
Published Mon, Jul 4 2016 1:10 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement