
రాజీనామా చేసిన వలంటీర్లు
సాక్షి, కొడవలూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలో 33 మంది వలంటీర్లు సామూహికంగా రాజీనామా చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి స్థానిక పోరులో వైఎస్సార్‌సీపీ అభిమానులను గెలిపించుకునేందుకే తామంతా సామూహికంగా రాజీనామా చేసినట్లు వలంటీర్లు స్పష్టం చేశారు. నార్తురాజుపాళెంలోని వీసీఆర్ అతిథి గృహంలో రాజీనామా చేసిన వలంటీర్లు బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వమిచ్చే గౌరవవేతనం కోసం కాకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలనే సేవా దృక్పథంతో తాము పనిచేస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో తమను దూరం పెట్టడంతో.. రాజీనామా చేసి స్థానిక పోరులో వైఎస్సార్‌సీపీ అభిమానులను గెలిపించాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment