వామపక్షాల ఆధ్వర్యంలో భూ సేకరణకు వ్యతిరేకంగా బుధవారం చేపట్ట దలచిన చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. వామపక్ష నేతలు విజయవాడకు చేరుకోకుండా ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేస్తున్నారు. దీంతో పలుచోట్ల పోలీస్ స్టేషన్ల ఎదుట ఆందోళనలు కొనసాగుతున్నాయి. రేపల్లె నుంచి విజయవాడ వెళ్తున్న సీపీఐ డివిజన్ కార్యదర్శిని అడ్డుకున్న పోలీసులు ఆయనను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తున్న వారిని అరెస్ట్ చేయడం తగదని ఆందోళనకు చేస్తున్నారు.
చలో విజయవాడను అడ్డుకుంటున్న పోలీసులు
Published Wed, Mar 9 2016 10:33 AM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM
Advertisement
Advertisement