- వైఎస్సార్ సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కేపీ సారథి
అవనిగడ్డ/కోడూరు : రైతులు సాగునీరందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, నాలుగు రోజుల్లోపు సాగునీటి సమస్యను పరిష్కరించకపోతే రైతులతో కలసి ఇరిగేషన్‌మంత్రి ఉమామహేశ్వరరావు కార్యాలయాన్ని ముట్టడిస్తామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి,మాజీమంత్రి కె.పార్థసారథి హెచ్చరించారు.
కోడూరు మండలంలోని వివిధ తీరప్రాంత గ్రామాల్లో పర్యటించి వచ్చిన అనంతరం శనివారం రాత్రి స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సారథి మాట్లాడుతూ కృష్ణాడెల్టా పరిరక్షకునిగా చెప్పుకునే రాష్ట్ర ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, అభినవకాటన్ దొరగా తనకు తానే అభివర్ణించుకుంటూ...రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారిన ఇరిగేషన్‌శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జిల్లాకు చెందిన వారైనప్పటికీ ఈ విషయమై నోరుమెదపరేమని ప్రశ్నించారు.
చంద్రబాబు పాలనలో ఖరీఫ్ సీజన్ సమయం కూడా మారిపోయిందని, జూన్, జులై మాసాల్లో నాట్లు పూర్తిచేసుకునే కృష్ణాడెల్టా రైతాంగం సెప్టెంబరు మాసం వచ్చినప్పటికీ నాట్లువేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేస్తామని పదేపదే ప్రకటించిన ముఖ్యమంత్రి రైతుల కష్టాలు, వారు పడుతున్న ఇబ్బందులు గురించి పట్టించుకోకుండా రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం బాధ్యతగల మంత్రులను భూసేకరణ కోసం భాగస్వాములను చేయటాన్ని చూస్తే రైతులపై ఈ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అవగతమవుతుందన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతువిభాగం అధ్యక్షుడు ఎంవీఎస్.నాగిరెడ్డి మాట్లాడుతూ పంట రుణాలకు, వ్యవసాయ రుణాలకు తేడా తెలియని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పాలిస్తుండటం రైతులు చేసుకున్న దురదృష్టమన్నారు. రైతులను అన్ని విధాలుగా మోసగించి అమలు సాధ్యంకాని వాగ్ధానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు రైతులు కనువిప్పు కలిగించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశా రు.
పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బా బు, స్టీరింగ్ కమిటీ సభ్యుడు కడవకొల్లు నరసింహారావు, మొవ్వ మండల పార్టీ కన్వీనర్ చిందా వీరవెంకట నాగేశ్వరరా జు, అవనిగడ్డ సర్పం చి నలుకుర్తి పృధ్వీరాజ్, వి.కొత్తపాలెం పీఏసీఎస్ అధ్యక్షుడు రేపల్లె పిచ్చేశ్వరరావు, రైతు నాయకుడు గాజుల శ్రీనివాసరావు, రాధా-రంగామిత్రమండలి దివియూనిట్ అధ్యక్షుడు రాజనాల మాణిక్యాలరావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.