అమ్రాబాద్, న్యూస్‌లైన్: భూతగాదాలు ఇద్దరిని ప్రాణాలను బలిగొన్నాయి. మంగళవారం జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో దాయాదుల దాడిలో ఇద్దరు మహిళలు దారుణహత్యకు గురయ్యారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు..మండలంలోని పదర గ్రామపంచాయతీ పరిధిలోని రాయలగండితండాకు చెందిన మూడావత్ చిట్టి(30), టీక్యా భార్యభర్తలు. వీరికి ముగ్గురు సంతానం కాగా, తమకు ఉన్న కొద్దిపాటి భూమిని కౌలుకు ఇచ్చి హైదరాబాద్‌కు వలసవెళ్లారు. అక్కడే చంపాపేట ప్రాంతంలో దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఇదిలాఉండగా చిట్టి మన్ననూర్‌లో చదువుతున్న కూతురు సుగుణ, వటువర్లపల్లిలో చదువుతున్న కొడుకులు లక్‌పతి, శ్రీనులను చూసి సెలవుల అనంతరం హైదరాబాద్ రావాలని చెప్పి ఆదివారం సాయంత్రం రాయలగండితండాకు వచ్చింది.
త్వరగా రావాలని సోమవారం భర్త టీక్యా భార్యకు ఫోన్‌చేశాడు. ఈ సమయంలో ఫోన్‌లోనే భార్యాభర్తల మధ్య మాటలు జరిగాయి. తమ కొడుకును ఎందుకు తిడుతున్నావని అక్కడనే ఉన్న మామ మల్యానాయక్, అత్తా లక్ష్మి కోడలుతో గొడవపడ్డారు. వీరితో పాటు ఆడబిడ్డ సాలి, సమీప బంధువులు భారతి, పద్మలు చిట్టిపై దాడిచేసికొట్టారు. చావుబతుకుల మధ్య ఉన్న ఆమెను అంబులెన్స్ ద్వారా అచ్చంపేటకు తరలిస్తుండగా మృతిచెందింది. అయితే పురుగుమందు తాగి చనిపోయిందని భర్త టిక్యాకు మృతురాలి తల్లిదండ్రులు సోనా, శక్కులకు సమాచారమిచ్చారు. మృతురాలి బంధువులు, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు టిక్యా తల్లిదండ్రులు, బంధువులపై పోలీసులు కేసునమోదుచేసినట్లు అమ్రాబాద్ ఎస్‌ఐ రవీందర్ తెలిపారు.
మరిది చేతిలో వదిన దారుణహత్య
బొంరాస్‌పేట, న్యూస్‌లైన్: భూతగాదాల నే పథ్యంలో మరిది తన భార్యతో కలిసి వదిన ను దారుణంగా హతమార్చాడు. మంగళవా రం ఈ ఘటన మండలంలోని చిల్ముల్‌మైలారంలో సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికుల కథనం.. గ్రా మానికి చెందిన నింగి హన్మయ్యకు బందెప్ప, నర్సప్ప ఇద్దరు కొడుకు లు ఉన్నారు. బందెప్ప, అంజిలమ్మ(36)లకు ఇద్దరు కూతుళ్లు ఉన్నా రు. కాగా, బందెప్ప పదేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అతనికి ఉన్న ఎకరా భూమిని సాగుచేసుకుంటూ భార్య అంజిలమ్మ కుటుంబాన్ని పోషిస్తుంది. తనఅన్న పేర ఉన్న భూమి ఆయన కూతుళ్లకే దక్కుతుందని భావించి, దాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని నర్సప్ప తన వదినతో అంజిలమ్మతో తరుచూ గొడవ పడుతుండేవాడు.
ఈ క్రమంలో రెండురోజుల క్రితం ఇద్దరి మధ్య మరోసారి గొడవలు జరిగాయి. ఇదిలాఉండగా సోమవారం అన్న పొలంలో నర్సప్ప వేరుశనగ విత్తనాలు వేశాడు. అడ్డగించిన వదినపై నర్సప్ప, అతని భార్య లక్ష్మి దాడికి దిగారు. మంగళవారం ఉదయం అంజిలమ్మ పొలానికి వెళ్లగా గొడవపడ్డారు. ఉదయం 10.30గంటల సమయంలో అంజిలమ్మ ఇంటికి వచ్చింది. ఇది గమనించిన నర్సప్ప, లక్ష్మి ఇంట్లో ఉన్న అంజిలమ్మపై గొడ్డలితో దాడిచేసి నరికిచంపారు. మృతురాలి పెద్దకూతురు మొగులమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నామని కొడంగల్ సీఐ కాసాని రామారావు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.
ప్రాణం తీసిన భూతగాదాలు
Published Wed, Oct 2 2013 3:29 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement