గంట్యాడ మండలం కొర్లాం వద్ద రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు.
గంట్యాడ మండలం కొర్లాం వద్ద రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. బైక్‌పై ఎస్.కోట నుంచి విజయనగరం వైపు వెళ్తున్న బైక్ అదుపుతప్పింది. బైక్ పై ఉన్న ముగ్గురు వ్యక్తులు కిందపడ్డారు. ఈ ఘటనలో ఎస్.కోటకు చెందిన ఎన్.నాగరాజు(25) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే.. చికిత్స ప్రారంభించిన కొద్ది సేపటికే నాగరాజు మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.