పి.నారాయణ
హైదరాబాద్: ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్పై చేసుకున్న ఒప్పందాలలో ఎటువంటి లోపాలు లేవని పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ చెప్పారు. సింగపూర్ ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా తీసుకున్నట్లు ఆయన తెలిపారు.ఇన్క్యాప్, ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ సింగపూర్ మధ్య ఎంఓయు జరిగినట్లు తెలిపారు. ఎంఓయులో పేర్కొన్న సంస్థలన్నీ సింగపూర్ ప్రభుత్వానికి చెందినవేనని చెప్పారు.
సింగపూర్ బృందం ఏరియల్ సర్వే ముగిసిందని మంత్రి తెలిపారు. భవిష్యత్లో ఈ బృందం గ్రామాలవారీగా పర్యటిస్తుందని చెప్పారు. రేపు సాయంత్రానికి మాస్టర్ ప్లాన్పై యాక్షన్ ప్లాన్ను సింగపూర్ ప్రభుత్వం అందజేస్తుందని నారాయణ చెప్పారు.
**