హైదరాబాద్: ఏపీ రాజధాని నిర్మించతలపెట్టిన ప్రాంతంలో సింగపూర్ బృందం ఏరియల్ సర్వే కార్యక్రమం తాత్కాలికంగా రద్దయింది. వారు వెళ్లవలసిన విమానం ఆలస్యంగా రావడం వల్లే ఏరియల్ వ్యూ కార్యక్రమం రద్దు చేశారు. ఏపీ మంత్రి పి.నారాయణ, సింగపూర్ నగర ప్రణాళిక విభాగం అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో దాదాపు గంటన్నరసేపు పడిగాపులు కాశారు. వారు వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానం చాలా ఆలస్యంగా వచ్చింది. అయితే అప్పటికి వాతావరణం ఏరియల్ వ్యూకు అనుకూలంగా లేకపోవడంతో వారి పర్యటనను రద్దు చేశారు.
రేపు ఉదయం 9 గంటలకు సింగపూర్ అధికారుల బృందం గుంటూరు జిల్లా అమరావతి, తుళ్లూరు,మంగళగిరి ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహిస్తుంది.
**
విమానాశ్రయంలో సింగపూర్ బృందం పడిగాపులు!
Published Tue, Dec 9 2014 6:25 PM | Last Updated on Wed, May 29 2019 3:19 PM
Advertisement
Advertisement